ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు | again Rain Water Leaks in AP Secretariat | Sakshi
Sakshi News home page

ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు

Jul 18 2017 12:21 PM | Updated on Aug 24 2018 2:36 PM

ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి.



అమరావతి:అమరావతి: ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని నాల్గవ బ్లాక్‌లో పలు ఛాంబర్లలో వర్షపు నీరు లీక్‌ అవుతోంది. 4వ బ్లాక్ లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మంత్రి గంటా యాంటీ రూమ్, దేవినేని ఉమ ఛాంబర్ తో పాటు పలుచోట్ల వర్షపు నీరు లోపలికి వచ్చింది. కొన్ని చోట్ల విండో గ్లాస్‌ల నుంచి, కొన్నిచోట్ల పై ఫ్లోర్ నుంచి వాటర్ లీక్‌ అవుతోంది. గంటా యాంటీ రూమ్‌లో సీలింగ్‌ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. బకెట్లతో వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. 

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement