మొదటి జోన్‌లో 46 ఎకరాలలో ఏర్పాటు చేసే అమ్యూజ్‌మెంట్ పార్కులో వాటర్ వరల్డ్‌తోపాటు క్రాఫ్ట్ బజార్ ఉంటాయని తెలిపారు. రెండో జోన్‌ను పూర్తిగా చిన్నారులకు కేటాయించారని, సాహస క్రీడలు, చిల్డ్రన్ అడ్వెంచర్, అవుట్ డోర్ జిమ్ ఉంటాయన్నారు. మూడో జోన్‌లో ఫ్లవర్ గార్డెన్, డక్ పాండ్ ఉంటుందని తెలిపారు. నాలుగో జోన్‌లో కల్చరల్ మ్యూజియం, అంబేడ్కర్ పార్కు, ఇండోర్ అథ్లెటిక్ సెంటర్, స్పోర్ట్స్ క్లబ్, ఫైవ్ స్టార్ హోటల్ వంటివి ఉంటాయన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి వచ్చే సంక్రాంతి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. సీఎం సూచన మేరకు ఈ పార్కుకు ‘గాంధీ మెమోరియల్’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.