
మంగళగిరిలో రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
గుంటూరు(మంగళగిరి): రెవెన్యూ సిబ్బందిపై రియల్ వ్యాపారుల దాడులపై రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలిగింపు వెళ్లిన రెవెన్యూ ఉద్యోగులపై రియల్ ఎస్టేట్ మాఫియా ఆదివారం దాడి చేసిన సంగతి తెలిసిందే. గాయపడిన వీఆర్వో, వీఆర్ఏలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు రియల్ మాఫియా పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఆర్డీవో భాస్కర్ నాయుడు సంఘీభావం తెలిపారు.