గోదావరిఖని : ‘ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేపట్టనున్నాం.. ఆ రోజు కుటుంబంలోని అందరూ ఇళ్ల వద్దనే ఉండాలి.. ఒకవేళ సర్వేకు వచ్చిన సమయంలో ఎవరు లేకపోయినా వారిని ఇక మీదట వారిని లెక్కలోనికి తీసుకోం..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించగా.. సర్వే రోజు సెలవు దినంగా పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల న్నీ 19న బంద్ పాటించనుండగా... తెలంగాణలోనే అతిపెద్ద సంస్థ అయిన సింగరేణిలో మాత్రం యా జ మాన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలే దు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లా ల్లో 63 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా...మరో 2,500 మంది అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. సర్వేలో ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు అడిగిన వివరా లు తెలిపి తప్పనిసరిగా ఇంటి యజమానులే సంతకం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పదేపదే చెప్తోంది.
ఈ తరుణంలో సింగరేణికి ఇటు ప్రభుత్వం గానీ, అ టు యాజమాన్యం గానీ సెలవు ప్రకటించకపోవడం తో కార్మికులు, ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉండగా సింగరేణిలో ఒక రోజు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సుమారు 1.60 లక్షల టన్నులుండగా...19న సెలవు ప్రకటిస్తే ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అధికారికంగా సెలవు ప్రకటిస్తే వారికి సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6 కో ట్ల వరకు కార్మికులు, ఉద్యోగులకు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
బొగ్గు ఉత్పత్తితో పాటు వేతనా ల రూపంలో నష్టపోవాల్సి వస్తుందనే కారణంతో యా జమాన్యం సెలవు ప్రకటించడంలో వెనుకంజ వేస్తున్న ట్లు స్పష్టమవుతోంది. అయితే దీనికి విరుగుడుగా వా రాంతపు సెలవు దినమైన ఆదివారం రోజు కేవలం సిం గరేణి కార్మికుల కోసం సర్వే చేపడితే ఎలా ఉంటుం దనే ఆలోచన యాజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, 19న సార్వజనీన సర్వేకు సింగరేణిలో సెలవు ప్రకటించాలని కోరుతూ గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు సింగరేణి సీఎండీ సు తీర్థ భట్టాచార్యకు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపించారు.
ఇదిలా ఉండగా అందరితో పాటు సింగరేణికి కూడా సెలవు ప్రకటిస్తే గనులు, ఓపెన్‌కాస్ట్‌లలో భూగర్భంలో ఏర్పడే సహజసిద్ధ్దమైన మార్పులను గమనించి, వాటిని సరిదిద్దేందుకు అత్యవసర సిబ్బంది అవసరం ఏర్పడుతుంది. అంటే నీ టి ఊటలు తొలగించే పంప్ ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర సూపర్‌వైజర్లు దాదాపు 10 శాతం వరకు విధులు నిర్వహించాల్సిందే. ఈ తరుణంలో వారికి ఎప్పుడు సర్వే నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు సింగరేణిలో 19న సెలవు ప్రకటిస్తారా ? లేదా ? సంశయంగా మారగా.. యాజమాన్యం, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కార్మికులు, సంఘాల నాయకులు కోరుతున్నారు.
కార్మికులకు ‘సర్వే’ వర్తించదా?
Published Tue, Aug 12 2014 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement