State of Andhra Pradesh
-
ప్రపంచం మెచ్చుకుంటున్న వాలంటీర్ల వ్యవస్థపై ఎల్లో కుట్రలు
-
ఐఎన్ఎస్ అస్త్రధరణి జలప్రవేశం
రాష్ట్రీయం 22న అమరావతి శంకుస్థాపన అక్టోబరు 22న జరగనున్న రాజధాని అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల10న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నాలుగు పేజీల ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించారు. అక్టోబరు 22, మధ్యాహ్నం 12.45 గంటలకు అమరావతి శంకుస్థాపన జరగనున్నట్లు ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. 8 పర్యాటక ప్రాజెక్టులకు ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకుంది. రూ.1,240 కోట్ల విలువైన ఈ ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, ఆయా సంస్థల ప్రతినిధులు పత్రాలు మార్చుకున్నారు. ఆర్థికం భారత వృద్ధిరేటును తగ్గించిన ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అక్టోబరు 5న విడుదల చేసిన నివేదికలో భారత వృద్ధిరేటును 7.5 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు 3.1 శాతంగా ఉంటుందని తెలిపింది. 2016 సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.5 శాతం, చైనా వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండనుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వ్యవస్థల పురోగమనం నెమ్మదిగా ఉండటం, వర్థమాన దేశాల్లో మందగమన పరిస్థితులు, చమురు ధరలు తగ్గడం వల్ల చమురు ఎగుమతి దేశాల ఇబ్బందులు వంటి కారణాలతో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు తిరోగమనంలో ఉందని తెలిపింది. వృద్ధిరేటును 7.5 శాతంగా పేర్కొన్న అంక్టాడ్ 2015 సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)రేటు 7.5 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి సంస్థ (అంక్టాడ్) అంచనా వేసింది. ఈ మేరకు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ దేశాలు కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకొనేందుకు చమురు ధరల తగ్గుదల ఉపయోగపడిందని అభిప్రాయపడింది. సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే! ఫోర్బ్స్ ఆసియా ప్రాంత 50 సంపన్న కుటుంబాల జాబితాలో 14 భారత్ నుంచే ఉన్నాయి. ఈ జాబితాలో 21.5 బిలియన్ డాలర్ల సంపదతో అంబానీ కుటుంబం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫోర్బ్స్ జాబితాలో 26.6 బిలియన్ డాలర్ల సంపదతో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ లీ కుటుంబం టాప్‌లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంగారకుడిపై ఇసుక తిన్నెలు అంగారకుడిపై ఇసుకు తిన్నెలకు గురించిన చిత్రాలను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విడుదల చేసింది. ఈ చిత్రాలను ఎమ్ఆర్వో వ్యోమనౌక హైరైజ్ (హై రెజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్పరిమెంట్) కెమెరా ద్వారా తీసింది. క్రమక్షయం, ఉపరితల వస్తువుల గమనం, గాలి, వాతావరణ పరిస్థితులు, మట్టి రేణువులు, వాటి పరిమాణం తదితర అంశాల గురించిన సమాచారాన్ని ఈ ఫొటోలు ద్వారా తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. జీవిత కాలాన్ని పెంచే జన్యువులు మనిషి జీవిత కాలం పెంచే దిశగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇటీవల మనిషి వయసును పెంచే 238 జన్యువులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈస్ట్ కణాలపై జరిపిన పరిశోధనల్లో భాగంగా ఈ జన్యువులను తొలగించినప్పడు కణాల జీవిత కాలం పెరిగినట్లు గమనించారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. కనిపించని వ్యాధుల జాబితాలో ‘యాస్’! భయంకరమైన చర్మవ్యాధి ‘యాస్’ను దీర్ఘకాలికంగా కనిపించని వ్యాధుల జాబితాలో చేర్చనున్నారు. ఈ అంటువ్యాధి 2003 నుంచి మన దేశంలో ఎక్కడా నమోదైనట్లు వివరాలు లేవు. దీంతో యాస్ ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించి వ్యాధి లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యాధిని కనుమరుగైన వ్యాధుల జాబితాలో చేర్చునున్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధుల బృందం మన దేశంలో పర్యటిస్తోంది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ నేపాల్ 38వ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ అక్టోబరు 12న ప్రమాణస్వీకారం చేశారు. అక్టోబర్ 11న జరిగిన ఎన్నికల్లో సుశీల్ కొయిరాలాపై ఆయన విజయం సాధించారు. మొత్తం 587 మంది ఓటింగ్‌లో పాల్గొనగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ ఓలీ 338 ఓట్లు సాధించగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొయిరాలాకు 249 ఓట్లు వచ్చాయి. ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికా, 11 పసిఫిక్ దేశాల మధ్య అక్టోబరు 5న అతి పెద్ద ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ట్రాన్స్-పసిఫిక్ పాట్నర్‌షిప్-టీపీపీ) కుదిరింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో కెనడా, మెక్సికో, పెరు, చిలీ, జపాన్, వియత్నాం, బ్రునై, మలేసియా, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ పసిఫిక్ ఒప్పందం ఫలితంగా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి వేల సంఖ్యలో సుంకాలు రద్దుకానున్నాయి. దీంతో పాటు చైనా ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. ప్రపంచ జీడీపీలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న దేశాల జీడీపీ (2012) 40 శాతంగా ఉంది. అంతర్జాతీయం రాష్ట్రపతి ప్రణబ్ జోర్డాన్ పర్యటనభారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోర్డాన్ పర్యటనలో ఇరు దేశాల మధ్య 6 ఒప్పందాలు కుదిరాయి. జోర్డాన్‌లోని అమ్మన్లో గాంధీ పేరిట ఏర్పాటుచేసిన ఓ వీధిని ప్రణబ్ ప్రారంభించారు. రాష్ట్రపతి ప్రణబ్ చారిత్రక పర్యటనకు గుర్తుగా అమ్మన్ సిటీ కౌన్సిల్ ఆయనకు ‘గోల్డెన్ కీ ఆఫ్ అమ్మాన్’ను బహూకరించింది. దారిద్య్రరేఖను సవరించిన ప్రపంచ బ్యాంకు ప్రపంచ దారిద్రరేఖను ప్రపంచ బ్యాంకు సవరించింది. ఇప్పటి వరకు రోజుకు 1.25 డాలర్లు సంపాదించే వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న వారిగా గుర్తిస్తున్నారు. ప్రస్తుతం రోజు వారీ సంపాదనను 1.25 డాలర్ల నుంచి 1.90 డాలర్లకు (రూ.130) సవరించింది. యూఎన్ వాతావరణ మార్పు ప్యానెల్ చైర్మన్‌గా హోసుంగ్ లీ ఐక్యరాజ్యసమితి (యూఎన్) వాతావరణ మార్పులకు సంబంధించిన అంతర్ ప్రభుత్వ ప్యానెల్‌కు (ఐపీసీసీ) చైర్మన్‌గా కొరియన్ ప్రొఫెసర్ హోసుంగ్ లీ అక్టోబరు 6న ఎన్నికయ్యారు. క్రోయేషియాలోని దుబ్రోవ్‌నిక్‌లో జరిగే సదస్సుకు ఆయన నేతృత్వం వహించనున్నారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆర్కే పచౌరీ (భారత్) ఈ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో హోసుంగ్ లీ ఎన్నికయ్యారు. క్రీడలు కర్జాకిన్‌కు ప్రపంచకప్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచకప్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను గ్రాండ్ మాస్టర్ సెర్గీ కర్జాకిన్ (రష్యా) గెలుచుకున్నాడు. బాకు (అజర్బైజాన్)లో అక్టోబరు 6న జరిగిన ఫైనల్లో పీటర్ స్విద్లెర్ (రష్యా)పై కర్జాకిన్ విజయం సాధించాడు. డచ్ ఓపెన్‌లో విజయం సాధించిన జయరామ్ అజయ్ జయరామ్ డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. అక్టోబరు 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రౌల్ మస్త్ (ఎస్తోనియా) పై విజయం సాధించాడు. ఈ చాంపియన్‌షిప్‌ను గతేడాది కూడా జయరామ్ దక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రి జోడీ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. బ్రిటన్‌లోని ఐల్ ఆఫ్ మ్యాన్ ద్వీపంలో అక్టోబర్ 11న జరిగిన టోర్నమెంట్లో నైజల్ షార్ట్ (ఇంగ్లండ్)ను తొమ్మిదో రౌండ్లో 50 ఎత్తుల్లో డ్రాగా ముగించి టైటిల్‌ను సాధించాడు. లారెంట్, గాబ్రియెల్‌లకు వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. చైనా ఓపెన్ విజేత సానియా-హింగిస్ జోడి అక్టోబర్ 10న జరిగిన చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట విజయం సాధించింది. వీరు హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)జోడీని ఓడించి టైటిల్ సాధించింది. జాతీయం నీరాంచల్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం నీటి పారుదల సౌకర్యాలను మెరుగు పరచేందుకు చేపట్టనున్న జాతీయ వాటర్‌షెడ్ నిర్వహణ పథకం నీరాంచల్‌కు కేంద్ర కేబినెట్ అక్టోబరు 7న ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,142,30 కోట్లు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 50 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలిన మొత్తాన్ని ప్రపంచ బ్యాంకు రుణంగా ఇవ్వనుంది. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. ఐఎన్ఎస్ అస్త్రధరణి జలప్రవేశం టార్పెడోల ప్రయోగ నౌక ఐఎన్ఎస్ అస్త్రధరణి అక్టోబరు 5న తూర్పు నావికాదళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ చేతులు మీదుగా జలప్రవేశం చేసింది. ఈ నౌకను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. టార్పెడోలను ప్రయోగించడంతో పాటు తిరిగి సేకరించగలికే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ నౌక పొడవు 50 మీటర్లు. దీని ద్వారా పలు విధ్వంసకర టార్పెడోలను ప్రయోగించి, శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తారు. బీహార్ తొలిదశలో 57 శాతం పోలింగ్ బీహార్ శాసనసభకు అక్టోబరు 12న జరిగిన తొలిదశ ఎన్నికల్లో 57 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 54.5 శాతం మంది పురుషులు, 59.5 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశలో 49 నియోజక వర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి అజయ్ నాయక్ తెలిపారు. అంబేద్కర్ స్మారక నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన ముంబైలోని ఇందు మిల్స్ ఆవరణలో 400 కోట్ల వ్యయంతో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్మారక నిర్మాణానికి అక్టోబర్ 11న మోదీ శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ జీవితంతో ముడిపడివున్న 5 ముఖ్యమైన స్థలాలను.. ప్రజలు సందర్శనార్థం ‘పంచ తీర్థాలు’గా అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంబేద్కర్ విగ్రహం 150 అడుగుల ఎత్తు, 110 అడుగుల చుట్టుకొలత ఉంటుంది. సంక్షిప్తంగా అమరావతిలో ప్రతి కట్టడానికి ఎల్ఈడీ బల్బులు అమర్చుతామని ఏపీ ఇంధన శాఖ కార్యదర్మి అజయ్ జైన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక నూతన అధ్యక్షుడిగా హైదరాబాద్‌కు చె ందిన రిటైర్డ్ ప్రొ॥జీవన్‌కుమార్ ఎన్నికయ్యారు.తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో రూ.146.28 కోట్లతో నిర్మిస్తున్న బాలబాలికల విద్యాకేంద్రాలకు ప్రభుత్వం రూ.104.83 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.41.5 కోట్లు విడుదలయ్యాయి.మిషన్ కాకతీయ విరాళాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు విదేశాలను నుంచి విరాళాలు సేకరించేందుకు మార్గం సుగమమం అయింది. ఈ మేరకు ట్రస్టుకు విదేశీ వ్యవహారాల నియంత్రణ చట్టం-2010 నుంచి కేంద్రం హోం మంత్రిత్వ శాఖ మినహాయింపు ఇచ్చింది. -
బడి పరిశుభ్రతకు జీవో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిశుభ్రత ఖర్చులకు నిధులు కేటా యిస్తామని పాఠశాల విద్యా కమిషనర్ టీచర్ల సంఘాలకు కొంతకాలం క్రితం హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వెంటనే జీవో జారీచేయాలి. ఈ విషయం పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రతిపాదనలకు మోక్షం కలిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీచేయాలి. రాష్ట్రంలో అత్యధిక శాతం పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థులే తరగతి గదులను, పాఠశాల ఆవరణను పరిశుభ్రం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.1,000, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.1,500, ఉన్నత పాఠశాలలకు రూ.2,500 వంతున పరిశుభ్రత ఖర్చుల కింద కేటాయించాలని విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ మేరకు ఆదే శాలు విడుదల చేస్తే పాఠశాలలకు మంచి జరగడమే కాకుండా, నిరుపేదలైన కొందరికి పాక్షికంగా ఉపాధి కలుగుతుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడు దల చేయాలని కోరుతున్నాను. - వి.కొండలరావు పొందూరు, శ్రీకాకుళం జిల్లా -
లక్షన్నర ఖాళీలు!
* రాష్ట్రంలో ఖాళీగా 1.39 లక్షల ఉద్యోగాలు.. భర్తీపై తాపీగా కదులుతున్న ప్రభుత్వం * నిరుద్యోగుల్లో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన * ఎన్నికల హామీ మేరకు బాబు ఉద్యోగాలిస్తారని నిరుద్యోగుల ఎదురుచూపు * అవసరం లేని పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే నిలిపేయడం తగదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఖాళీ పోస్టు ల భర్తీ విషయంలో ప్రభుత్వం చాలా నిదానంగా కదులుతుండటంతో లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.39 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులూ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పైగా, అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2.000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా నే ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఎటువంటి భర్తీలు చేయరాదంటూ ఏపీపీఎస్సీకి ముఖ్యమంత్రి కార్యాలయం లేఖ రాసింది. దీంతో నిరుద్యోగులు కంగుతిన్నారు. అయితే, గత ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల వయస్సు మీరిపోయిందనే కారణంతో చంద్రబాబు సర్కారు గరిష్ట వయో పరిమితిని 34 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించింది. వయస్సయితే పెంచా రు కానీ, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి వేగవంతమైన చర్యలు చేపట్టలేదు. మరోపక్క.. ఈ పోస్టు ల్లో ప్రస్తుత అవసరాలకు పనికి రానివెన్నో తేల్చడానికి సర్కారు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. దీంతో అప్పటివరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉండకపోవచ్చునన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొం ది. రాష్ట్ర విభజనతో సంబంధం పోస్టుల పంపిణీ ఇంకా జరగలేదు. వాటిలో ఖాళీలెన్నో పంపిణీ పూర్తయ్యే వరకు తెలియదు. రాష్ట్ర విభజనతో సంబంధం లేని జిల్లా, జోనల్, మల్టీ జోనల్లో ఖాళీగా ఉన్న పోస్టులనైనా భర్తీ చేస్తారేమోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ మూడు విభాగాల్లో ఏకంగా 1,39,507 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్ పోస్టులు 1,944, జోనల్ పోస్టులు 22,462, జిల్లా స్థాయివి 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మల్టీ జోనల్ పోస్టుల్లో అతి తక్కువ పోస్టులు మాత్రం విభజన ప్రక్రియలో భాగంగా పంపిణీ జరుగుతాయి. ఈ పోస్టులను మినహాయించి, మిగతా వాటిని భర్తీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వెంట నే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లేదంటే వయోపరిమితిని పెంచిన ఫలితం ఉండదని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విషయంలోనూ ఇదే జరిగిందని వివరిస్తున్నారు. కిరణ్ సర్కారు గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలకు పెంచినప్పటికీ, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈలోగా లక్షలాది నిరుద్యోగుల వయస్సు మీరిపోయింది. ఈసారి అలా కాకుండా వెంటనే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. మరోపక్క.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎటువంటి కసరత్తు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మారిన అవసరాలకు తగినట్లుగా లేని పోస్టులను గుర్తించాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో వాటిని రద్దు చేసేం దుకు తగిన సిఫార్సులు చేసేందుకు 10 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తూ ఈ నెల 3వ తేదీన జీవో (నంబర్ 3917) జారీ చేసింది. ఈ కమిటీ పలు ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉన్న పోస్టులను అధ్యయనం చేసి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేని పోస్టుల రద్దుకు సిఫార్సులు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. అంటే మార్చి వరకు పోస్టుల భర్తీ ఉండదేమోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల తర్వాత భర్తీ ప్రక్రియ చేపడితే చాలా సమయం వృథా అవడంతోపాటు వేలాది మంది అనర్హులయ్యే అవకాశముంటుందని అధికారులు కూడా చెబుతున్నారు. పైగా, రద్దు చేయడానికి అవకాశమున్న పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే ఆపడం భావ్యం కాదని కూడా అంటున్నారు. అందువల్ల వెంటనే ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే రాష్ట్రంలోని యువతకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఏపీలో ‘మద్యం’ ఇక ఆన్లైన్లోనే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ ఇకపై ఆన్లైన్లోనే కొనసాగనున్నాయి. హెడొనిక్ పాత్ ఫైండర్ సిస్టం (హెచ్‌పీఎఫ్‌ఎస్) ప్రాజెక్టు పేరుతో మూడేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానానికి ప్రభుత్వం ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందనేది రోజువారీ తెలుసుకోవచ్చని, సెక్యూరిటీ హాలోగ్రామ్స్ వాడకంతో ఏ డిస్టిలరీలో మద్యం తయారైందనే సమాచారంతో పాటు ఏ షాపు నుంచి వచ్చిందనేది సులువుగా తెలుసుకునే వీలుంటుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. యుఫ్లెక్స్, స్రిస్టెక్, సి-టెల్ (యూఎస్సీ) అనే కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. మద్యం ఆన్లైన్ ఆమ్మకాల ప్రాజెక్టును ప్రైవేటుకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. -
‘కోట’లో పాగా వేసేదెవరో..
పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్(మానుకోట) పార్లమెంట్ నియోజకవర్గం తిరిగి ఏర్పాటైంది. ఈ పార్లమెంట్ పరిధిలో గిరిజనుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటి సారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బలరాంనాయక్ కేంద్రమంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. ఈసారి ఆయన టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. (తాండ్ర కృష్ణ గోవింద్, హన్మకొండ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం ద్విసభ్య నియోజకర్గంగా కొనసాగింది. ఈ సమయంలో 1957, 1962లలో సార్వత్రిక ఎన్నికలు, 1965లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు సమయాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే విజయం వరించింది. ఆ తర్వాత ఈ స్థానం రద్దై 2009లో మళ్లీ ఏర్పడింది. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. సీనియరే.. అయినా వ్యతిరేకత మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించడం లేదు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కో పార్టీకి పట్టుంది. గత ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి బలరాంనాయక్ అనూహ్యంగా విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో మిగిలిన పార్టీ అభ్యర్థులకన్నా బలరాం నాయక్ సీనియరే అయినా, ఆయనపై అదేస్థాయిలో వ్యతిరేకత ఉంది. కోయ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ములుగు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లను నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పినపాక సిట్టింగ్ ఎమ్మెల్యే రేగకాంతారావుకు డీసీసీ అధ్యక్షపదవి ఇచ్చిన గంటలోపే ఊడిపోవడం వెనక బలరాంనాయక్ హస్తం ఉందనే ప్రచారం సాగింది. ఇది కోయవర్గం నుంచి వ్యతిరేకతను మరింత పెంచనుంది. బలరాంనాయక్‌కు సన్నిహతుడైన దొంతిమాధవరెడ్డి వరంగల్ డీసీసీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడం, నర్సంపేటలో రెబల్‌గా బరిలో ఉండడం వల్ల ఇక్కడ ఓట్లు చీలే అవకాశం ఉంది. భద్రాచలం సబ్‌డివిజన్‌లోని వరరామచంద్రపురం, చింతూరు వంటి మండలాలను సీమాంధ్రలో కలిపారు. ఈ ప్రభావం ఎన్నికలపై పడనుంది. గతంలో మహాకూటమి ఓట్లు తనకు అనుకూలంగా క్రాస్ అయినట్టు ఈ సారి మిత్రపక్షమైన సీపీఐ ఓటుబ్యాంకు ఇతర పార్టీల వైపు మళ్లుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి బరిలో టీఆర్ఎస్ మహబూబాబాద్ నుంచి టీఆర్ఎస్ తొలిసారి పోటీ చేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. అదే సమయంలో ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు సంస్థాగత బలం అంతగా లేకపోవడం ఆ పార్టీకి కొంత ఇబ్బందే. ఈ జిల్లాలో ఇల్లందులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుండటం సీతారాంనాయక్కి కలిసి వచ్చే అంశం. టీడీపీకి గడ్డుకాలం టీడీపీ నుంచి బరిలో ఉన్న బానోతు మోహన్‌లాల్ ఎదురీదుతున్నారు. డోర్నకల్, ఇల్లందులనుంచి ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు సిట్టింగ్‌లు సైకిల్ దిగి కారెక్కడంతో ఆ పార్టీ బాగా బలహీనపడింది. గత ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించినా ఈసారి ఇబ్బందులు తప్పడంలేదు. పినపాక, భద్రాచలంలలో ఆ పార్టీ ఎన్నడూ విజయం సాధించలేదు. మహాబూబాబాద్ అసెంబ్లీసెగ్మెంట్లో పార్టీ కోసం పాటుపడిన నాయకులు లేరు. మరోవైపు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కవిత పాతుకుపోయారు. నర్సంపేట, ములుగులలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. లోక్‌సభ నియోజకవర్గం:మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పడింది : 2009 ప్రస్తుత ఎంపీ : బలరాం నాయక్ (కాంగ్రెస్) ప్రస్తుత రిజర్వేషన్ : ఎస్టీ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు: మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్, ములుగు, ఇల్లందు, భద్రాచలం, పినపాక. మొత్తం ఓటర్లు : 13,57,806 ఇతరులు : 65 ప్రస్తుతం బరిలో నిలిచింది : 17 ప్రత్యేకతలు: ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు ఎస్టీ రిజర్వుడు స్థానాలే. గిరిజన ఓటర్ల సంఖ్య ఎక్కువ. అటవీ, ఖనిజ సంపదలకు నెలవు. ఇల్లందు, పినపాకల్లో సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. పోలవరం ముంపు ప్రాంతాలు ఇక్కడ ప్రస్తుతం ప్రధాన సమస్య. ప్రధాన అభ్యర్థులు వీరే: బలరాం నాయక్ (కాంగ్రెస్), ప్రొ.సీతారాం నాయక్ (టీఆర్ఎస్), డాక్టర్. తెల్లం వెంకట్రావు(వైఎస్సార్సీపీ),మోహన్‌లాల్ (టీడీపీ) స్పీడ్‌మీదున్న ఫ్యాన్ మహాబూబాబాద్ నుంచి వైస్సార్సీపీ తరఫున టి. వెంకట్రాం బరిలో ఉన్నారు. మహాబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన గిరిజనులే ఉన్నారు. ఇందులో చాలా మంది వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫించన్లు వంటి పథకాల వల్ల లబ్ధి పొందారు. వీరిలో వైఎస్సార్సీపీ పట్ల సానుకూలత ఉంది. ఈ ప్రభావం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాలతో పాటు వరంగల్ జిల్లాలోని డోర్నకల్, ములుగులలో పోలింగ్‌పై ఉంటుంది. నర్సంపేట నియోజకర్గంలో సీపీఎంకు గట్టి ఓటుబ్యాంకు ఉంది. పొత్తులో భాగంగా ఈ ఓటర్లు వైఎస్సార్సీపీకి అండగా నిలబడితే ఇక్కడ ఆశ్చర్యపోయే ఫలితాలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. బలరాంనాయక్ (కాంగ్రెస్) నే.. గెలిస్తే.. 1. హామహబూబాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేస్తా. 2. శృంగేరీ పీఠం సహకారంతో ములుగులో 3. మెడికల్ కాలేజీ ఏర్పాటు. ఇల్లందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తా. 4. హామహబూబాబాద్లో 500 సీట్లతో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, 5. ఏటూరునాగారంలో సైనిక్ స్కూల్ కోసం ప్రయత్నిస్తా. 6. తాగు, సాగునీటి కష్టాలు తీర్చేందుకు కంతనపల్లి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయిస్తా. భద్రాచలంలో గోదావరిపై రెండో బ్రిడ్జి నిర్మిస్తా. బలాబలాలు.. అనుకూలం హాపార్లమెంట్ పరిధిలో నాయకులు, ఓటర్లతో పరిచయాలు. 1. లంబాడా సామాజిక వర్గం అండ. 2. కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు. 3. మంత్రి పదవిలో ఉన్నా వివాదాలకు దూరంగా ఉండటం. 4. సొంత పార్టీలో అసమ్మతి లేకపోవడం. ప్రతికూలం 1. కేంద్రమంత్రి పదవిలో ఉన్నా అంతగా అభివృద్ధి చేయలేకపోవడం. పెల్లెట్ పరిశ్రమ, గిరిజనవర్సిటీ ఏర్పాటు హామీలకే పరిమితం కావడం. 2. వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నర్సంపేట నుంచి రెబల్‌గా బరిలో ఉండటం, 3. రేగకాంతారావుకు డీసీసీ అధ్యక్ష పదవి దూరం కావడంతో కోయ వర్గంలో ఏర్పడిన అసంతృప్తి. సీతారాం నాయక్ (టీఆర్ఎస్) నే.. గెలిస్తే.. 1. గిరిజన తండాల్లో గుడుంబా తయారీ నివారించి గిరిజనులకు ఉపాధి కల్పిస్తా. 2. సహజ వనరులను శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగించుకుంటాం. 3. ఖనిజ సంపద ఆధారంగా కొత్త పరిశ్రమలు నెలకొల్పుతాం. 4. మహబూబాబాద్ కేంద్రంగా జిల్లా ను ఏర్పాటు చేసి, సమగ్రాభివృద్ధికి ప్రణాళిక అమలు చేస్తా. 5. నియోజకవర్గంలోని పీజీ కేంద్రాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా. బలాబలాలు.. అనుకూలం 1. ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం, తెలంగాణ సెంటిమెంట్. 2. విద్యాధికుడు కావడంవల్ల విజన్‌తో పని చేస్తారనే నమ్మకం. 3. లంబాడా సామాజిక వర్గం ఓట్లు. 4. ఇటీవలే డోర్నకల్, ఇల్లందులలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం 5. సీమాంధ్రలో కలవబోతున్న పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల్లో కాంగ్రెస్‌పై గూడుకట్టుకున్న ఆగ్రహం. ప్రతికూలం 1. తెలంగాణ సెంటిమెంట్‌పైనే ఎక్కువ ఆధారపడటం. 2. ఇల్లందు, పినపాక, భద్రాచలంలలో టీఆర్ఎస్కు అనుకున్నంతగా బలం లేకపోవడం. 3. రాజకీయాలకు కొత్త కావడం. డా. వెంక ట్రావు (వైఎస్సార్ సీపీ) నే.. గెలిస్తే.. 1. కోట్లాది మందికి లబ్ధి చేకూర్చిన వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలంగాణలో కచ్చితంగా కొనసాగిస్తాం. 2. పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచేందుకు కృషి చేస్తా. 3. ఆరోగ్యశ్రీలో అన్ని రకాల రోగాలను చేర్పిస్తా. 4. భద్రాచలం కేంద్రం జిల్లా ఏర్పాటు. 5. గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రయత్నిస్తా. బలాబలాలు.. అనుకూలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు. 1. సీపీఎంతో పొత్తుతో ఆపార్టీ ఓటు బ్యాంకు అండగా ఉండటం కలిసివచ్చే అంశం. 2. కోయసామాజిక వర్గం అండ 3. ఖమ్మం జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణ 4. పోలవరం ముంపు మండలాల ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ప్రచారంలో దూసుకుపోవడం. ప్రతికూలం వరంగల్ జిల్లాలో రాజకీయాలకు కొత్త అవడం. మోహన్‌లాల్ (టీడీపీ) నే.. గెలిస్తే.. 1. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తా. అన్ని గ్రామాల్లో మినరల్ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేస్తా. 2. గిరిజన యూనివర్సిటీ మంజూరు కోసం పాటుపడతా. 3. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేస్తా. 4. ప్రజలుకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తా. బలాబలాలు.. అనుకూలం 1. బీజేపీతో పొత్తు 2. సొంత సామాజిక వర్గం ఓట్లు 3. ములుగు, నర్సంపేటలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటం ప్రతికూలం 4. గత ఎన్నికల్లో మాదిరి క్రాస్‌ఓటింగ్ భయం 5. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో పార్టీపై సడలిన విశ్వసనీయత 6. ఇల్లందు, డోర్నకల్‌లలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తరఫున పోటీలో ఉండటం