ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే కొనసాగనున్నాయి. హెడొనిక్ పాత్ ఫైండర్ సిస్టం (హెచ్‌పీఎఫ్‌ఎస్) ప్రాజెక్టు పేరుతో మూడేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానానికి ప్రభుత్వం ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందనేది రోజువారీ తెలుసుకోవచ్చని, సెక్యూరిటీ హాలోగ్రామ్స్ వాడకంతో ఏ డిస్టిలరీలో మద్యం తయారైందనే సమాచారంతో పాటు ఏ షాపు నుంచి వచ్చిందనేది సులువుగా తెలుసుకునే వీలుంటుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. యుఫ్లెక్స్, స్రిస్టెక్, సి-టెల్ (యూఎస్సీ) అనే కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. మద్యం ఆన్‌లైన్ ఆమ్మకాల ప్రాజెక్టును ప్రైవేటుకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి.