ఆ సంచలన తీర్పుపై తేల్చుకోలేక.. | UP govt yet to decide whether to challenge Allahabad HC order | Sakshi
Sakshi News home page

ఆ సంచలన తీర్పుపై తేల్చుకోలేక..

Published Wed, Oct 28 2015 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

ఆ సంచలన తీర్పుపై తేల్చుకోలేక..

ఆ సంచలన తీర్పుపై తేల్చుకోలేక..

బల్లియా: ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అలహాబాద్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలా వద్దా అనే విషయాన్ని ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తేల్చుకోలేదు. ఈ తీర్పు ఓ రకంగా మంచిదే అయినప్పటికీ భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో పై కోర్టులో అపీల్ చేయాలా వద్దా అనే అంశంపై సంబంధిత మంత్రి రామ్ గోవింద్ చౌదరీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

వ్యక్తిగతంగా ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడానికి ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదట. అయితే, న్యాయమంత్రిత్వశాఖ మాత్రం ఈ తీర్పుపై ప్రత్యేక లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉందని, ప్రభుత్వానికి ఇష్టం అయితే వెళ్లొచ్చని ప్రాధమిక విద్యామంత్రిత్వశాఖకు తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశంలోనే ఓ సంచలనాత్మక తీర్పును అలహాబాద్ కోర్టు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలంతా కూడా ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే చదవాలని ఈ తీర్పులో వెల్లడించింది. దిక్కరించినవారు శిక్షార్హులని కూడా చెప్పింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రామ్ గోవింద్ చౌదరీ.. కోర్టు తీర్పుతో ఏకీభవించినట్లు కనిపించారు. తన వంతు ప్రయత్నంగా రాష్ట్రంలోని అన్ని యూనియన్ లకు, ఉద్యోగ సంఘాలకు, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక నోటిఫికేషన్ లు పంపించి ఈ తీర్పును అమలు చేసే విషయంలో అభిప్రాయ సేకరణ చేశారు. మరోపక్క, ఈ తీర్పుతో కొందరు విభేదించడంతో పై కోర్టుకు వెళ్లే అంశంపై ఆయన ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్తో చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement