decission
-
లౌడ్ స్పీకర్లు బ్యాన్.. మాంసం విక్రయాలపై మార్గదర్శకాలు!
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడంతోనే కీలక ప్రకటనలు చేశారు. లౌడ్ స్పీకర్లను బ్యాన్ చేయడంతో పాటు, బహిరంగంగా మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు వీవీఐపీ అతిథుల సమక్షంలో మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామంటూ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. కాగా తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడామన్నారు. ధ్వని పరికరాలను నియంత్రించనున్నామని, ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. జనవరి 22న యూపీలోని అయోధ్యలో జరిగే నూతన రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్టంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నమని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. -
జీతాలు పెంచమన్న పాపానికి..
హైదరాబాద్: తమ జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. వేలసంఖ్యలో అంగన్వాడీ వర్కర్లను తొలగించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించిన అంగన్ వాడీ కార్యకర్తల వీడియోలను జిల్లా సీడీపీవోలకు పంపినట్లు సమాచారం. అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వుల్లో వారిని ఎందుకు తొలగిస్తున్నారో తెలుపుతూ సెక్షన్లు కూడా పేర్కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచే 2,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నేడో రేపో తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ కఠిన వైఖరిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు పెంచమన్నందుకు ప్రభుత్వం తమ ఉద్యోగాలనే పీకేయడం ఎంతవరకు సబబని వారు వాపోతున్నారు. -
ఆ సంచలన తీర్పుపై తేల్చుకోలేక..
బల్లియా: ప్రభుత్వ ఉద్యోగులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అలహాబాద్ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలా వద్దా అనే విషయాన్ని ఇంకా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తేల్చుకోలేదు. ఈ తీర్పు ఓ రకంగా మంచిదే అయినప్పటికీ భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో పై కోర్టులో అపీల్ చేయాలా వద్దా అనే అంశంపై సంబంధిత మంత్రి రామ్ గోవింద్ చౌదరీ మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. వ్యక్తిగతంగా ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడానికి ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదట. అయితే, న్యాయమంత్రిత్వశాఖ మాత్రం ఈ తీర్పుపై ప్రత్యేక లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసే అవకాశం ఉందని, ప్రభుత్వానికి ఇష్టం అయితే వెళ్లొచ్చని ప్రాధమిక విద్యామంత్రిత్వశాఖకు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశంలోనే ఓ సంచలనాత్మక తీర్పును అలహాబాద్ కోర్టు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలంతా కూడా ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే చదవాలని ఈ తీర్పులో వెల్లడించింది. దిక్కరించినవారు శిక్షార్హులని కూడా చెప్పింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రామ్ గోవింద్ చౌదరీ.. కోర్టు తీర్పుతో ఏకీభవించినట్లు కనిపించారు. తన వంతు ప్రయత్నంగా రాష్ట్రంలోని అన్ని యూనియన్ లకు, ఉద్యోగ సంఘాలకు, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక నోటిఫికేషన్ లు పంపించి ఈ తీర్పును అమలు చేసే విషయంలో అభిప్రాయ సేకరణ చేశారు. మరోపక్క, ఈ తీర్పుతో కొందరు విభేదించడంతో పై కోర్టుకు వెళ్లే అంశంపై ఆయన ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో చర్చించనున్నారు.