సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇప్పటికే నిర్వహిస్తున్న ఆంగ్ల మాధ్యమం తరగతులను వచ్చే విద్యాసంవత్సరానికి (2016-17) అనుమతించాలని ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ గ్రామాల్లోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి తమ సొంత ఖర్చులతో తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారని తెలిపారు.