'మంచి' నీరేనా
'మంచి' నీరేనా
Published Mon, Jul 31 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM
- గత కొన్నేళ్లలో ప్రాథమిక స్కూళ్లలో పెరగని తాగునీటి వసతి..
- దాని నాణ్యతపైనా అనుమానాలు..
2010లో తాగునీటి సదుపాయమున్న బడులు 83%
2016లో తాగునీటి సదుపాయమున్న బడులు 85%
ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 73%
ఇందులో వినియోగానికి అనువుగా ఉన్నవి 74%
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతోందా..? అసలు వాటిలో నీటి సదుపాయాలెలా ఉన్నాయి..? విద్యార్థులకు అందిస్తున్న నీరు నిజంగా సురక్షితమేనా..? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్‌ఈఆర్) అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని గ్రామీణ పాఠశాలల్లో అధ్యయనం చేసింది. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో తాగునీటి పరిస్థితిలో కొద్ది మేరకే మార్పు వచ్చిందని సర్వేలో తేలింది. స్కూళ్లలో తాగునీటి సదుపాయాలపై (పైపులు, హ్యాండ్ పంపులు, నీటి కూజాలు వంటివి) ఈ సర్వే నిర్వహించారు. పైకి కనిపించడానికి 2016లో 74 శాతం తాగునీటి సదుపాయాలు వినియోగానికి అనువుగా ఉన్నప్పటికీ.. తాగు నీటి నాణ్యత సందేహాస్పదమే అంటున్నారు. ఎందుకంటే.. దీన్ని కచ్చితంగా పరీక్షించే వ్యవస్థ లేకపోవడం ఇందుకు ఓ కారణం.
– సాక్షి, తెలంగాణ డెస్క్
ప్రాథమిక స్కూళ్లలో విద్యార్థులు 20 కోట్లు..
2016లో ఏఎస్‌ఈఆర్ సంస్థ దేశంలోని 619 గ్రామీణ జిల్లాలకుగానూ 589 జిల్లాల్లో సర్వే చేసింది. 17,473 మంది సర్వేయర్లు ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఏఎస్‌ఈఆర్ 2009 నుంచి గ్రామీణ ప్రభుత్వ స్కూళ్లలో తాగునీరు, పారిశుధ్య సదుపాయాలపై గణాంకాలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20 కోట్లు. వీరికి సర్వశిక్షా అభియాన్ నిబంధనల ప్రకారం.. ప్రతి పాఠశాలలోనూ తాగునీటి సదుపాయం ఉండటం తప్పనిసరి. అయితే తాగునీటి సదుపాయం వినియోగంలో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.
తాగే నీరు సురక్షితమేనా?
పాఠశాలల్లో తాగునీటి సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా లేదా తాగునీటి నాణ్యత ఎలా ఉంది అనేదానిపై డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(డీఐఎస్‌ఈ) గణాంకాలు సేకరించాలి. అయితే డీఐఎస్‌ఈ ఈ గణాంకాలను సరిగా సేకరించడం లేదు.
ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో తాగునీటి వసతి తగ్గిన రాష్ట్రాలు
Advertisement
Advertisement