నేటి నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి సమ్మేటివ్-1 (త్రైమాసిక) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 3 నుంచి 9 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ వాటి మూల్యాం కాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం చింది. ఫలితాలను ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 8, 9 తేదీల్లో, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 26న తెలియజేయాలి.
విద్యార్థులకు 27న క్యుమిలేటివ్ రికార్డులను(ప్రోగ్రెస్) ఇవ్వాలి. పాఠశాలలకు 10 నుంచి 25 వరకు దసరా సెలవులుగా విద్యాశాఖ ప్రకటించింది. ఈ సారి 9, 10 తరగతుల పరీక్షల విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు తెలుగుతో ప్రారంభమయ్యే పరీక్షలు ఈసారి గణితంతో ప్రారంభం కానున్నాయి.