Pay Commission
-
ఉద్యోగులకు శుభవార్త.. బడ్జెట్లో ఆ ప్రకటన?
Budget 2024-25: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న పార్లమెంట్లో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌కు సంబంధించి వివిధ రంగాలు అనేక అంచనాలను పెట్టుకున్నాయి. మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అమలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్బీ యాదవ్ భారత ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని పునరుద్ధరించాలని, 18 నెలల డియర్నెస్ అలవెన్స్‌ను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.8వ వేతన సంఘం అమలు ఎప్పటి నుంచి?సాధారణంగా సెంట్రల్ పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు అలాగే ప్రయోజనాలను సమీక్షించి, సవరణలను సిఫారసు చేస్తుంది. ద్రవ్యోల్బణం, ఇతర బాహ్య కారకాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సులు చేస్తుంది. ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పే కమిషన్ 2015 నవంబర్ 19న తమ నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సులు 2016 జనవరి 1న అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే 8వ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.8వ పే కమిషన్ ప్రకటనపై సానుకూలం!గత వేతన సంఘాన్ని ఫిబ్రవరి నెలలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి పే కమిషన్‌ను ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో 2024 మధ్యంతర బడ్జెట్లో ప్రకటించలేదు. పే కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండటం, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న క్రమంలో ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుపై ఖచ్చితంగా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!
DA Hike: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2023 ఏడాదికి గాను రెండో రౌండ్ డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో తాజా నివేదికలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తున్నాయి. రానున్న పండుగ సీజన్లో డీఏ పెంపుపై కేంద్ర సర్కార్ ప్రకటన చేయనుంది. ముఖ్యంగా ఊహించిన దానికి మించి డీఏ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం తీపి కబురందించనుంది. త్వరలోనే డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. 2023 సంవత్సరంలో రెండో రౌండ్ డీఏ పెంపునిపై కీలక ప్రకటన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. అక్టోబరు-నవంబరు మధ్యలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. గతంలో ఈ పెంపును 3శాతంగా అంచనా వేసినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో దాని కంటే ఎక్కువే ఉండ వచ్చని తెలుస్తోంది. పెంపుతో దాదాపు 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మందికి పైగా పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. అయితే దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. (లెజెండరీ క్రికెటర్ల కళ్లు చెదిరే ఇంద్రభవనాలు: అత్యాధునిక ఫీచర్లు) కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) ఆధారంగా చేసిన లేటెస్ట్ కాలిక్యులేషన్స్ 4 శాతం డీఏ పెంపును సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే డీఏ పెంపు 46శాతంగా ఉండనుంది. ముఖ్యంగా గత నెలలో ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా తాము నాలుగు శాతం డీఏ పెంపు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తాజా నివేదికలకు ఊతమిస్తున్నాయి. కాగా దేశంలో ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనేది విదితమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 ఏడాదిలో రెండో DA పెంపు, ఎప్పుడు ప్రకటించినా, 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం జూలై 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. (నడిరోడ్డుపై ఖరీదైన డైమండ్లు, ఎగబడిన జనం: అదిరిపోయే ట్విస్ట్) ఇదీ చదవండి: మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా? -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్‌కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్‌ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్‌ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. డియర్నెస్ అలవెన్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) కరోనా సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ బకాయిల చెల్లిపులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా టైమ్‌లో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని అయితే ఈ డియర్నెస్ అలవెన్స్‌ను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) డీఏ బకాయిలపై నరేన్ భాయ్ జే రావత్ రాజ్య సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.అలాంటి నిబంధనేమీ లేదని, ప్రభుత్వం దాని గురించి ఆలోచించడం లేదని లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు అంతంత మాత్రం గానే ఉన్నాయన్నారు. డియర్నెస్ అలవెన్స్‌ను నిలిపివేత ద్వారా ప్రభుత్వానికి రూ.34,000 కోట్లు ఆదా అవుతుందని సమాచారం. (పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!) మరోవైపు డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులు,పెన్షనర్ల హక్కు అని ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. కరోనా కాలంలో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి ఉద్యోగుల సంఘాలు సన్నద్ధమ వుతున్నాయి. కాగా 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్‌ను పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తరుణంలో కరోనా కాలంలో నిలిపివేసిన డీఏ బకాయిలను కేంద్ర చెల్లిస్తుందని ఉద్యోగులంతా ఎదురు చూశారు. -
ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అందుకే కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగుల జీతాల పెంపునుకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీఏ(DA) పెంపు అంచనా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరోసారి డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం రేట్లు అలాగే ఉన్నందున, కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ డీఏను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. గత కొంతకాలంగా 7% కంటే ఎక్కువగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ లెక్కిస్తున్నారు. నివేదికల ప్రకారం, డీఏ 3% నుంచి 4% మధ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34% డీఏ అందుతోంది. 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు డీఏ సవరణ ప్రయోజనాలను పొందుతున్నారు. కాగా ప్రభుత్వం 7వ కేంద్ర వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది. చదవండి: వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! -
బిగ్ రిలీఫ్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్ ప్రకటించింది.ఇల్లు నిర్మించుకోవాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ వడ్డీ రేటుతో హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సదుపాయాన్ని ఉద్యోగులకు అందుబాటులోకి తెస్తూ..కేంద్రం ఏప్రిల్ 1న మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) రుణ వడ్డీ రేటును 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీ రేట్లకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హెచ్‌బీఏను పొందవచ్చని కేంద్రం వెల్లడించింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను మినిస్టీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఏప్రిల్1న విడుదల చేసిన మెమోరాండంలో పేర్కొంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు ఈ ఏడాది ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అందుబాటులో ఉంటాయి. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉండనుంది. ఇక సవరించిన వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం 7వ వేతన సంఘం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రూల్స్ 2017 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి 34 నెలల ప్రాథమిక వేతనం లేదా రూ. 25 లక్షలు లేదా ఇంటి ఖర్చు లేదా దాని ప్రకారం మొత్తం అడ్వాన్స్ తీసుకోవచ్చు. తిరిగి చెల్లించే సామర్థ్యం, కొత్త నిర్మాణం లేదా కొత్త ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం తీసుకున్న బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇంటి నిర్మాణ అడ్వాన్స్‌ను పొందవచ్చు. ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్(హెచ్‌బీఏ) వడ్డీ రేట్లు మార్చి 2022 వరకు 7.9శాతంగా ఉంది. అయితే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్‌బీఏలను ఫైనాన్షియల్ ఇయర్లో 80బీపీఎస్‌లను తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కలిగించినట్లైంది. చదవండి: పెరిగిపోతున్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య, హైదరాబాద్‌లో ఎన్ని గృహాలు ఉన్నాయంటే! -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా, పెద్ద వయసుతో సంబంధం లేకుండా జరుపుకునే ఈ పండుగకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్ని మరింత రంగుల మయం చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న కేంద్రం ఉద్యోగులకు రూ.10,000 అడ్వాన్స్‌గా అందించనుంది. ఉద్యోగులు ఎలాంటి వడ్డీ లేకుండా హోలీకి ముందే రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. దీనివల్ల వ్యాపారాలు ఊపందుకోవడంతోపాటు, ఆర్థిక వ్యవస్థ మంద గమనాన్ని అధిగమించవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లలో పేర్కొన్నాయి. ఇప్పటికే కేంద్ర ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతేడాది కూడా ఈ పథకాన్ని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం మళ్లీ అదే పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇక కేంద్రం అందించనున్న ఈ రూ.10వేల అడ్వాన్స్ వారి అకౌంట్లలో జమవుతాయి.ఉద్యోగులు తీసుకున్న మొత్తాన్ని10 వాయిదాల్లో నెలకు రూ.1000 చొప్పున రూ.10,000 మొత్తాన్ని తిరిగి ఇచ్చేలా కేంద్రం వెసలు బాటు కల్పించనుంది. -
గుడ్‌న్యూస్ : డీఏ పెంపుకు కేంద్రం అంగీకారం
7th Pay Commission Updates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ! దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. -
7th pay Commission: కరువు భత్యంపై తేల్చేది నేడే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నరగా ఎదురు చూస్తోన్న కరువు భత్యం అంశంపై ఈ రోజు కేంద్రం సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ , డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్శాఖకు చెందిన ప్రతినిధులు జూన్ 26న సమావేశం కానున్నారు. 7వ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత కరువు భత్యం నిర్ణయించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. మూడు వాయిదాలు కరోనా ఉధృతి కారణంగా 2020 జనవరి నుంచి కరువు భత్యం (డీఏ) ప్రకటించలేదు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో 2020 జనవరి - జూన్, 2020 జూన్ - డిసెంబరు, 2021 జనవరి - జూన్ వరకు ఇలా ఉద్యోగులకు సంబంధించి మూడు డీఏలు, పెన్షనర్లకు సంబంధించి మూడు డీఆర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రోజు జరిగే సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంత డీఏ, డీఆర్లు ఇవ్వాలనే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు బేసిక్ డీఏపై 2020 జనవరి - జూన్ కాలానికి 4 శాతం , 2020 జూన్ - డిసెంబరు కాలానికి 3 శాతం , 2021 జనవరి - జూన్ కాలానికి 4 శాతం డీఏ పెరిగే అవకాశం ఉంది. 28 శాతం 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు 2021 జులై నుంచి డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచే అవకాశం ఉంది. 7వ వేతన సంఘం కనీస వేతనంగా రూ. 18,000లగా నిర్ణయించింది. దీనిపై 15 శాతాన్ని డీఏగా అమలు చేయాలని సూచించింది. దీంతో పాటు ఉద్యోగులకు 2.57 ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పింది. 1.15 కోటి మంది 7వ వేతన సంఘ సిఫార్సులపై ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో వెల్లడికానున్న నిర్ణయం కోసం 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. 65 లక్షల మంది పెన్షనర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరందరికీ గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్లు త్వరలోనే అందనున్నాయి. ఉద్యోగులతో పాటు, పెన్షనర్లకు బకాయిలు పడ్డ డీఏలను జులై 1న ఒకేసారి చెల్లిస్తామంటూ ఇప్పటికే ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే ప్రకటించారు. దానికి అనుగుణంగానే కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు డీఏపై ఫైనల్ డెసిషన్ చెప్పేందుకు సమావేశం నిర్వహిస్తోంది. చదవండి : Toshiba: కుట్రలకు చెక్, చైర్మన్ తొలగింపు.. ఇక సంస్కరణలేనా? -
ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్
యశవంతపుర/కర్ణాటక: ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునివ్వటంతో కార్మికుల డిమాండ్లపై చర్చించటానికి సీఎం యడియూరప్ప, డీసీఎం లక్ష్మీణ సవది సోమవారం సమావేశమై చర్చించారు. ఆరవ వేతన కమిషన్ ప్రకారం జీతాలను పెంచాలని ఏప్రిల్ 7న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. వేతన సిఫార్సులను అమలు చేయటం సాధ్యంకాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పట్టుబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం. పునరాలోచన చేయండి -ఐఏఎస్ శరత్ బదిలీపై క్యాట్ తీర్పు మైసూరు: తన బదిలీపై ఐఏఎస్ అధికారి శరత్ వేసిన పిటిషన్‌పై క్యాట్ తీర్పు వెలువరించింది. శరత్ బదిలీపై ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2020 సెప్టెంబర్‌లో మైసూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే బదిలీ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పు రిజర్వులో ఉంచడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం క్యాట్ తన తీర్పును వెలువరించింది. -
అధికారం కాదు.. అభివృద్ధే మా ధ్యేయం: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షల మేరకు ‘బంగారు బెంగాల్’ను అందివ్వడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం కాదు అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర చివరి దశ ర్యాలీని గురువారం దక్షిణ 24 పరగణ జిల్లా కాక్‌ద్వీప్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీని అధికారం నుంచి దూరం చేయడం తమ ఉద్దేశం కాదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మమతా బెనర్జీని అధికారం నుంచి పడగొట్టి.. పదవి చేపట్టడం బీజేపీ ధ్యేయం కాదు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని పేదలు, మహిళల జీవన స్థితి గతులను మార్చడం.. వారిని అభివృద్ధి పథంలోకి నడపడమే మా ధ్యేయం. ఇవి బీజేపీ కార్యకర్తలు, టీఎంసీ సిండికేట్ నాయకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. వీటిల్లో మేం గెలిస్తే ప్రజలు కోరుకుంటున్న బంగారు బెంగాల్‌ను వారికి అందిస్తాం’’ అన్నారు అమిత్ షా. ‘‘ప్రజల ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రిజర్వేషన్లను 33 శాతం కంటే అధికంగానే అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రయోజనాలు అందేలా చూస్తాం. అమ్ఫాన్ రిలీఫ్ ఫండ్ల పంపిణీలో అవినీతిపై దర్యాప్తు చేస్తాం’’ అని అమిత్ షా తెలిపారు. చదవండి: కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో బొనాంజ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో బంపర్ బొనాంజ పొందబోతున్నారు. వేతన కమిషన్ బొనాంజతో ఇప్పటికే 2 శాతం పెరిగిన డియర్నెస్ అలవెన్స్(డీఏ), మరో విడత వేతన పెంపు ఉండబోతుందని తెలుస్తోంది. డీఏను గణించడానికి ఇండెక్స్‌ను, బేస్ ఇయర్‌ను ప్రభుత్వ సవరించబోతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనం పెరగబోతుందని తెలుస్తోంది. కార్మికుల డీఏను నిర్ణయించడానికి ... ఇండస్ట్రియల్ వర్కర్ల కోసం కొత్త సిరీస్ వినియోగదారుల ధరల సూచీపై కార్మిక మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీవన సర్దుబాటు భత్యం ఖర్చు కింద డీఏను చెల్లిస్తారు. బేస్ ఇయర్ 2016తో కొత్త సీపీఐ-ఐడబ్ల్యూను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే లేబర్ బ్యూరో ఖరారు చేసిందని ప్రభుత్వ రంగ సీనియర్ అధికారి చెప్పారు. జీవన ఖర్చులు మారుతుండటంతో, ప్రతి ఆరేళ్లకు ఒక్కసారి ఈ బేస్‌ను కూడా మార్చాలని ప్రతిపాదించామని తెలిపారు. ప్రస్తుతమున్న సీపీఐ-ఐడబ్ల్యూ 2001 బేస్ ఇయర్ అని పేర్కొన్నారు. బేస్ ఇయర్‌ను మార్చడంతో, ప్రస్తుతం 1.1 కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. గతంలో 2006లో బేస్ ఇయర్‌ను మార్చారు. కాగ, 7వ వేతన కమిషన్ ప్రతిపాదనల మేరకు మార్చిలోనే కేంద్ర కేబినెట్ డీఏను 5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది. ఈ పెంచిన డీఏ 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందుతున్నారు. -
స్కూల్ ఫీజులపై తల్లిదండ్రులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : అదనపు ఫీజులతో సతమతమవుతున్న పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఊరట కల్పించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు ఫీజును తిరిగి ఇచ్చేయాలంటూ ప్రైవేటు స్కూళ్లను ఢిల్లీ సర్కారు ఆదేశించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీవోఈ) నియమించిన కమిటీ అందించిన నివేదిక సూచనలను అనుసరించి... జూన్ 2016 నుంచి జనవరి 2018 వరకు అదనంగా వసూలు చేసిన ఫీజుపై 9 శాతం వడ్డీ కూడా చెల్లించే విధంగా నిబంధనలు రూపొందించింది. ఈ మొత్తాన్ని వారం రోజుల్లోగా తిరిగి చెల్లించాలంటూ స్కూళ్లను ఆదేశించింది. ఈమేరకు 6వ చెల్లింపు కమిషన్ సిఫారసులు అమలు చేయాల్సిందిగా ఢిల్లీలోని 575 పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. అలా చేయని పక్షంలో ఢిల్లీ విద్యా చట్టం- 1973 ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని డీవోఈ హెచ్చరించింది. డీవోఈ నివేదికలో పేర్కొన్నట్లుగా అదనపు ఫీజు వసూలు చేసిన స్కూళ్ల వివరాలు 15 రోజుల్లోగా అందజేయాల్సిందిగా ఆయా జిల్లాల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ఆదేశించింది. గతేడాది 449 పాఠశాలలకు.. అదనపు ఫీజులు వసూలు చేసిన 449 పాఠశాలలకు గతేడాది కూడా ఢిల్లీ సర్కారు షోకాజ్ నోటీసులు పంపింది. తల్లిదండ్రులను పిలిపించి రెండు వారాల్లోగా ఫీజు చెల్లించాలంటూ ప్రభుత్వం షరతులు విధించడంతో.. కొన్ని పాఠశాలలు వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా డబ్బులు వాపసు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కోరాయి. అయితే అలా చెల్లించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనే యోచనలో ఉన్నప్పటికీ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లను ప్రభుత్వమే టేకోవర్ చేయాలనుకుంటుందని విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సలహాదారు అతీషి మర్లేనా తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
త్వరలో వేతన సంఘం సీఎం సిద్ధరామయ్య ప్రకటన బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణలకు సంబంధించి రానున్న బడ్జెట్లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. శాసనమండలిలో గురువారం సిద్ధరామయ్య ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణకు సంబంధించి చాలా కాలంగా డిమాండ్లు వెల్లువెత్తున్నాయని, ఈ నేపథ్యంలో 2017 బడ్జెట్లో నూతన వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు గణేష్ కార్నిక్, రామచంద్రేగౌడ, అరుణ్ షహాపురలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పరిష్కరణ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఉన్న తారతమ్యాలు, లభిస్తున్న సౌకర్యాలు, రోజువారీ భత్యాలు, పింఛన్లు వంటి అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి వేతన పరిష్కరణను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సైతం పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలను వేతనాల రూపంలోనూ, 12 వేల కోట్ల రూపాయలను పించన్ల రూపంలోనూ అందజేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో ఉద్యోగాల భర్తీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,79,000 ఉద్యోగాలున్నాయని, ఇందులో 2,69,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సీఎం తెలిపారు. ఏయే శాఖల్లో ఏయే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటిని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హోం శాఖతో పాటు రెవెన్యూ, విద్యా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. -
జీతం పెరిగిందా?
ఏడవ వేతన సంఘం ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య పచ్చజెండా ఊపింది. దాంతో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. ప్రతి నెలా చేతిలో పడే పచ్చనోట్ల సంఖ్యా పెరిగింది. ‘బేసిక్ పే’ అని ముద్దుగా అందరూ పిలిచే మూల వేతనం దీని వల్ల దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువవుతుంది. నెలకు రూ.7 వేలు ఉండే ప్రారంభ స్థాయి జీతం ఈ దెబ్బతో రూ. 18 వేలకు పెరుగుతుంది. అలాగే, అత్యున్నత స్థాయి జీతం రూ. 90 వేల నుంచి ఏకంగా రూ. 2.5 లక్షలు అవుతుంది. ఈ జీతాల పెరుగుదలతో దాదాపు కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చేతిలో నాలుగు డబ్బులు ఆడతాయి. చేతికి వచ్చే డబ్బు పెరగడం వల్ల వినియోగదారుల డిమాండ్ పెరుగుతుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల్లో గణనీయ సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు కాబట్టి, గ్రామ ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, ఉద్యోగులకు సుమారు 6 నెలల ఎరియర్స్ కూడా రానున్నాయి. మరి, ఇప్పుడు ఈ పెరిగిన డబ్బుతో ఏం చేయాలి? ఈ సమయంలో వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటే అంత కన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదు. అందుకే, తెలివైనవాళ్ళు తమ సేవింగ్స్‌నూ, పొదుపు ప్రణాళికలనూ, రిటైర్మెంట్ వ్యూహాలనూ మరోసారి సరిచూసుకుంటారు. ఈ క్రమంలో ఏం చేయాలంటే... 1. ముందుగా అప్పులు తీర్చాలి. ఎందుకంటే, ఇవాళ ప్రతి ఒక్కరికీ గృహ ఋణాల దగ్గర నుంచి ఏదో ఒక అప్పు ఉంటుంది. అలాంటి ఋణాలపై దృష్టి పెట్టి, ఆ ఋణభారాన్ని తగ్గించాలి. తీసుకున్న ఋణంలో కొంత భాగాన్ని ఇలా ముందే తీర్చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థికస్థితి బలమవుతుంది. ఉదాహరణకు 20 ఏళ్ళలో తీర్చేలా, 10 శాతం వడ్డీకి దాదాపు రూ. 50 లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారనుకుందాం. మీకు పెరిగిన జీతం, వచ్చిన ఎరియర్లతో మొదటి అయిదేళ్ళలోనే లక్ష రూపాయలు ముందుగా తీర్చేశారనుకుందాం. అప్పుడు ఈ 20 ఏళ్ళ కాలపరిమితిలో దాదాపు రూ. 3.3 లక్షల మేర భారాన్ని తప్పించుకున్నట్లు లెక్క. 2. రిటైర్మెంట్ ప్రయోజనాల గురించి ఆలోచించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సర్వసాధారణంగా రిటైర్ అయినప్పుడు పెన్షన్ ఇస్తారు. ఉచిత ఆరోగ్య సంరక్షణ వసతీ ఉంటుంది. అయితే, 2004 తర్వాత సర్వీస్‌లో చేరినవారికి ప్రభుత్వ ఖజానా నుంచి నికరమైన పింఛను బదులు, రిటైర్మెంట్ పొదుపు ప్రణాళిక మొత్తం ‘జాతీయ పింఛను పథకం’ కిందకు వస్తోంది. పదవీ విరమణ అనంతరం వచ్చే సొమ్ములపై ఈ పథకం తుది ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలీదు. కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వీలైనంత వరకు అనేక ఇతర మదుపు ప్రణాళికలు వేసుకోవాలి. పదవీ విరమణ అనంతర జీవితం ఇబ్బందుల్లో పడకుండా, ఇప్పుడు పెరిగిన జీతాన్ని అప్పటి సుఖానికి తగ్గట్లు పొదుపు, మదుపు చేయాలి. 3. జీతం పెరిగిందని, ఖర్చులు పెంచుకోకూడదు. అసలు జీతం పెరిగిందనే విషయాన్ని మర్చిపోయి, ఆ పెరిగిన డబ్బును మీకు ఎందులో సౌకర్యంగా ఉంటే, అందులో మదుపు చేయాలి. దీర్ఘకాలిక మదుపు పథకాల్ని ఆశ్రయిస్తుంటే, ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఈక్విటీల్లో డబ్బు మదుపు చేయడం ఉపయోగం. ఈక్విటీ ఆధారిత మదుపు పథకాల్లో వచ్చే ప్రతిఫలం పరిస్థితుల్ని బట్టి మారిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మిగిలినవాటి కన్నా ఇవే ఉత్తమం. దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే, రిస్కూ తగ్గుతుంది. మొత్తం మీద, వేతన సంఘం సిఫార్సుల వల్ల జీతాలు పెరిగాయని సంబరపడితే సరిపోదు. ఆ పెరిగిన డబ్బును మన ‘ఫ్యామిలీ’కి ఉపయోగపడేలా మదుపు చేస్తేనే ఉపయోగం. ఎందుకంటే, రూపాయి ఆదా చేశామంటే, రూపాయి సంపాదించినట్లేగా! - అదిల్ శెట్టి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ‘బ్యాంక్ బజార్ డాట్‌కామ్’ -
వినియోగం... వృద్ధికి ఊతం!
♦ 7వ వేతన సంఘం సిఫారసుల అమలుపై ఆర్థిక నిపుణుల విశ్లేషణ ♦ 7.9% వృద్ధి రేటు అంచనాలు ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ అంతంతమాత్రమే న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు 23.5 శాతం పెంపుదలకు సంబంధించి ఏడవ వేతన సంఘం సిఫారసులకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటయిన కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సిఫారసుల అమలుకు దాదాపు రూ. లక్ష కోట్లను(జీడీపీలో 0.7%) కేంద్రం కేటాయించాల్సి ఉం టుంది. ఆర్థిక వ్యవస్థలో ఆయా పరిణామాలు ఎలా ఉం టాయన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. సిఫారసుల అమలుతో ద్రవ్యోల్బణం కొంత పెరిగినా.. మొత్తంగా వీటి అమలు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందులో కొన్ని అంచనాలు క్లుప్తంగా చూస్తే... ⇒ వినియోగం 0.3 శాతం పెరుగుతుంది. పొదుపులు 0.2 శాతం పెరుగుతాయి. పన్ను ఆదాయం 0.9 శాతం వృద్ధి చెందుతుంది. ⇒ పెరిగిన వేతనాలు, అలవెన్సులు డిమాండ్‌పై సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే దీనివల్ల ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఒక మోస్తరుగా ఉన్నా... మొత్తంగా ఈ పరిణామం ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ⇒ దీర్ఘకాలం మన్నే వస్తువులు, సేవల వినియోగ డిమాండ్ మెరుగుపడుతుంది. 2015-16లో 7.6%గా ఉన్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.9%కి పెరిగే వీలుంది. పరిశ్రమల హర్షం కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి ఈ నిర్ణయం వల్ల దేశ మధ్య తరగతి ప్రజ వినియోగ డిమాండ్ ఊపందుకుంటుందని, తద్వారా ఈ వృద్ధికి ఊపు లభిస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నది సైతం తమ అభిప్రాయమని అన్నారు. తాజా నిర్ణయం జీడీపీ వృద్ధి 8 శాతం స్థాయికి పెరిగేందుకు దోహదపడుతుందని ఫిక్కీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు తగిన వర్షపాతమూ నమోదయితే ఆటోమొబైల్, కన్జూమర్ ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, హౌసింగ్ వంటి రంగాల్లో చక్కటి వృద్ధి తీరు నమోదవుతుందని అసోచామ్ మరో ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం ద్రవ్యలోటు విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ సూచిం చింది. కాగా గృహ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని రియల్టీ ప్రముఖ సంస్థలు క్రెడాయ్, ఎన్ఏఆర్ఈడీసీఓలు వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నాయి. ఇది చక్కటి నిర్ణయమని క్రెడాయ్ అధ్యక్షుడు గీతాంబర్ ఆనంద్, ఎన్‌ఏఆర్‌ఈడీసీఓ చైర్మన్ రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యలోటుపై ప్రభావం: ఎస్బీఐ సిఫారసుల అమలు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య వ్యత్యాసం)పై ప్రభావం చూపుతుందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక పరిశోధనా విభాగం అభిప్రాయపడింది. ఇది ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంటూనే 2017-18లో ద్రవ్యలోటుపై ప్రభావం తప్పదని స్పష్టం చేసింది. ఖజానాపై రూ.1.02 లక్షల కోట్ల (జీడీపీలో 0.7 శాతం) భారం పడుతుందని ఎస్బీఐ అంచనా. అయితే 2016-17లో కేటాయింపులు రూ.53,844 కోట్లు కావడం గమనార్హం. కార్ల కంపెనీల ఆశలు.. వేతన సంఘం సిఫారసుల అమలు తమకు లాభాలను పంచుతుందని ఆటో కంపెనీలు భావిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండాసహా పలు కార్ల తయారీ కంపెనీలు అమ్మకాల మెరుగుదల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ⇒ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదవుతుందనీ, దీనితో ఇందుకు సంబంధించి 2.5 లక్షల కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్ల అమ్మకాలకు సంబంధించి కీలకమైన విభాగమని తెలిపింది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా దాదాపు 17 శాతం. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది పెన్షనర్లకు అదనపు ఆదాయం కార్ల అమ్మకాల పెరుగుదల దోహదపడుతుందని భావిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంస్థ 2 లక్షల కార్లను విక్రయించింది. ‘వీల్స్ ఆన్ ఇండియా’ కార్యక్రమం కింద కంపెనీ ప్రభుత్వ ఉద్యోగులకు 2006 నుంచీ మొత్తం 15 లక్షల వాహనాలను విక్రయించింది. ⇒ హోండా కార్స్ ఇండియా: ఆటో పరిశ్రమకు ఇది ఒక సానుకూల అంశమని సంస్థ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్ ) జ్ఞానేశ్వర్ సేన్ పేర్కొన్నారు. దీనివల్ల అమ్మకాల్లో వృద్ధి కనబడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ⇒ హోండా కార్స్ ఇండియా:హ్యుందాయ్ మోటార్స్: మార్కెటింగ్ జనరల్ మేనేజర్ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, దీర్ఘకాలంలో సైతం కార్ల అమ్మకాలు పెరగడానికి తాజా పరిణామం దోహదపడుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో కస్టమర్లను మరింత ఆకర్షించడానికి తమ ప్రైడ్ ఆఫ్ ఇండియా ఆఫర్ కింద ప్రస్తుతం ఇస్తున్న ప్రోత్సాహకాలకు అదనంగా మరో రూ.7,000 విలువైన ప్రోత్సాహకాలను అందించనున్నట్లూ తెలిపారు. వినియోగం 45 వేల కోట్లు వృద్ధి... 7వ వేతన సంఘం సిఫారసుల వల్ల దేశీయ వినియోగం రూ. 45,110 కోట్లు (జీడీపీలో 0.30%) పెరుగుతుంది. రూ. 30,710 కోట్ల (జీడీపీలో 0.20 శాతం) గృహ పొదుపు పెరుగుతుంది. మా అంచనా ప్రకారం ప్రభుత్వంపై తక్షణ భారం రూ.94,775 కోట్లు (జీడీపీలో 0.63 శాతం) ఉంటుంది. అయితే వినియోగంపై ఎక్సైజ్ పన్నుల వంటి రాబడులు మినహాయిస్తే., నికరంగా ఈ భారం కేంద్రంపై రూ.80,641 కోట్లని (జీడీపీలో 0.54 శాతం) అంచనా ఉంది. - ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ద్రవ్యోల్బణంపై ఎఫెక్ట్... సిఫారసుల అమలు ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలకు దారి తీస్తుంది. ప్రత్యేకించి సేవలు, తయారీ రంగాల్లో ఈ ప్రభావం కనిపించే వీలుంది. ఇక సానుకూలతకు వస్తే... వినియోగ వస్తువులు, సేవలకు డిమాండ్ పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే అంశం. - అతిది నయర్, ఐసీఆర్ఏ సీనియర్ ఎనకమిస్ట్ అయినా ఇబ్బంది లేదు... ఒకవేళ ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నా... అంతర్జాతీయంగా క్రూడ్ ధరల కట్టడి, అలాగే రుతుపవనాల వల్ల తగిన వర్షపాతం వంటి సానుకూల అం శాలు ద్రవ్యోల్బణాన్ని ఉపశమింపజేయడానికి దోహదపడతాయి. సిఫారసుల అమలుతో విని యోగ డిమాండ్ పెరగడం 7.9% వృద్ధికి దోహదపడే అంశం. - డీకే జోషీ, క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ -
ఎంపీల జీతభత్యాల సమీక్షకు శాశ్వత వ్యవస్థ!
న్యూఢిల్లీ: వేతన సంఘం తరహాలో ఎంపీల జీతభత్యాల సమీక్ష కోసం ఒక ప్రత్యేక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ సూచించింది. సాధ్యమైనంత త్వరగా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని బుధవారం సమావేశమైన కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సమావేశంలో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎంపీల నెలసరి వేతనాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదన ఆర్థిక శాఖలోపెండింగ్‌లో ఉండటంపై భేటీలో సభ్యులు వివరణ కోరినట్లు సమాచారం. ఎంపీల కనీస పెన్షన్‌ను రూ. 20 వేల నుంచి రూ. 35 వేలకు పెంచాలనే అంశం కూడా ఆ ప్రతిపాదనలో ఉంది. ఎంపీల నివాస గృహాల ఫర్నిచర్ కోసం ఉద్దేశించిన ప్రస్తుతం ఎంపీలకు నెల వేతనం రూ. 50 వేలు కాగా, పార్లమెంటు సమావేశాలకు హాజరైన సందర్భాల్లో.. రోజుకు రూ. 2 వేలు అదనంగా లభిస్తాయి. -
పని చేస్తేనే జీతం పెంపు!
ఏడో వేతన సంఘం సిఫార్సు న్యూఢిల్లీ: విధుల్లో నిర్లక్ష్యం వహించి, పని తప్పించుకు తిరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చేదు వార్త. ఇకపై వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తేనే జీతంలో వార్షిక పెరుగుదల ఉంటుంది. సేవలు సంతృప్తికరంగా లేకపోతే ఎప్పటిలా వేతనం పెరిగే అవకాశాలు ఉండకపోవచ్చు. ఏడో కేంద్ర వేతన సంఘం ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది. అలాగే అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రదర్శన ఆధారిత వేతనం (పీఆర్పీ) పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది. పదోన్నతుల్లానే వేతనం కూడా క్రమానుగుణంగా పెరగాలని పేర్కొంది. మోడిఫైడ్ అష్యూర్డ్ కెరీర్ ప్రోగ్రెషన్ (ఎంఏసీపీ) మాదిరి వృత్తిలో నిర్దేశిత స్థాయిని చేరుకున్న ఉద్యోగులకే వార్షిక వేతన పెరుగుదల ఇవ్వాలని అభిప్రాయపడింది. లేని పక్షంలో తొలి 20 ఏళ్ల సర్వీసులో సాధారణ పదోన్నతుల నుంచి కూడా వారిని మినహాయించాలని సూచించింది. కేవలం ఇది ప్రదర్శనకు సంబంధించిన అంశమే కనుక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసుకొనే నిర్ణయాలకు ఇది వర్తించదని తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు ఉద్యోగులు కావాలంటే స్వచ్ఛంద పదవీ విరమణ నియమనిబంధనల ప్రకారం ఉద్యోగం వదిలేయవచ్చని పేర్కొంది. సర్వీస్‌లో 10, 20, 30వ ఏట ఎంఏసీపీ పొందుతారని వెల్లడించింది. ఈ నిబంధనలు ఉద్యోగుల్లో మార్పు కోసమేనని కమిషన్ అభిప్రాయపడింది. వీటన్నింటితోపాటు ఎంఏసీపీ ఇచ్చే ముందు డిపార్ట్మెంటల్ పరీక్షల వంటి వాటిల్లో కచ్చితమైన పద్ధతిని తీసుకురావాలని సూచించింది. అన్ని విభాగాలు, శాఖల్లో ఈ పద్ధతిని అమలు చేయాలంటే కొంత సమయం పడుతుందని, ఈ లోగా ఆకర్షిత బోనస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని కోరింది. -
వేతనాల పెంపు 15 శాతమేనా?
సాక్షి, విజయవాడ బ్యూరో: ఏడో వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. 15 శాతం వేతనాల పెంపును సిఫార్సు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి వేతన సంఘం నివేదిక అందజేయనుందన్న సమాచారం ఉద్యోగులను అసంతృప్తికి గురి చేస్తోంది. కేవలం 15 శాతం వేతనాల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైల్వే, పోస్టల్, ఆదాయపు పన్నుల శాఖల ఉద్యోగ సంఘం నాయకులు తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట గురువారం ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేతలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 49.25 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 54 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరంతా ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరిగే వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడో వేతనం సంఘం 15 శాతం పెంపును మాత్రమే సిఫారసు చేసినట్లు తెలిసింది. ఆరో వేతన సంఘం 35 శాతం వేతనాల పెంపును సిఫారసు చే సిన నేపథ్యంలో ఈసారి ఈ పెంపుదల 40 శాతం ఉంటుందని ఉద్యోగులు ఆశించారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలను బట్టి ఈ మేరకు పెంపు అనివార్యమంటున్న ఉద్యోగులకు 15 శాతమే పెంచబోతున్నారన్న సమాచారం శరాఘాతంలా తాకింది. లక్షలాది మంది ఉద్యోగులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేతనాలను కనీసం 40 శాతం పెంచాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఉద్యోగుల వేతనాల పెంపు 15 శాతం మాత్రమే అయితే మెరుపు సమ్మె చేపడతామని పోస్టల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి శివాజీ హెచ్చరించారు. కేంద్ర ఉద్యోగుల జేఏసీఆంధ్రప్రదేశ్ సర్కిల్ కార్యదర్శిరామచంద్రం కనీసం 40 శాతం పెంపు ఉండాలని డిమాండు చేశారు. నేటి ధర్నాను విజయవంతం చేయండి రైల్వే ఉద్యోగుల సమాఖ్య నేత ఎం. రాఘవయ్య పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, కొత్త పింఛను స్కీం విధానం, ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా గురువారం జరగనున్న దేశవ్యాప్త ధర్నాను విజయవంతం చేయాలని భారత రైల్వే ఉద్యోగుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎం.రాఘవయ్య కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించాలని జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ నిర్ణయించిందని బుధవారం తెలిపారు. సర్వీసులో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏడో వేతన సంఘం సిఫారసులు కార్మికులకు వ్యతిరేకంగా ఉంటే వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సమ్మె తప్పదని పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వంపై ఉద్యోగుల గుస్సా
పీఆర్సీ చేసే సిఫారసులను నీరుగారుస్తోందని ధర్నా హైదరాబాద్: వేతన సంఘం చేసే సిఫారసులను నీరుగార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధోరణిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధానకార్యదర్శి వి నాగేశ్వర్రావు మాట్లాడుతూ 7వ వేతన సంఘం తన నివేదికను ఆగస్టు 28వ తేదీ నాటికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్‌కు డిసెంబర్ 31వ తేదీ వరకు(మరో నాలుగు నెలలు) వ్యవధి ఇవ్వడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి 19న అన్ని కార్యాలయాల్లో పెద్దఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాఖ్య డిప్యూటీ జనరల్ సెక్రటరీ డీఏఎస్‌వీ ప్రసాద్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అజీజ్, నాయకులు శ్రీనివాస్‌రావు. తిరుపతి, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
ఏడో వేతన సంఘం గడువు పెంపు
న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం గడువును కేంద్ర కేబినెట్ మరో నాలుగు నెలలు పొడిగించింది. దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్ల వేతనాల పెంపు కోసం ఫిబ్రవరి, 2014లో ఈ సంఘం ఏర్పాటైంది. కేంద్రం ప్రతి పదేళ్ల కోసం వేతన సంఘాన్ని(పే కమిషన్) ఏర్పాటు చేస్తుంది. 2014లో జస్టిస్ ఏకే మాథూర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏడో పే కమిషన్ నిజానికి ఈ నెలాఖరుకు తమ సిఫారసులను కేంద్రానికి సమర్పించాలి. ఈ కమిషన్ తమ సిఫారసులు చేయడానికి గడువును డిసెంబరు 31 దాకా పొడిగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ప్రభుత్వవర్గాలు బుధవారం వెల్లడించాయి.