వేతన సంఘం చేసే సిఫారసులను నీరుగార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం
పీఆర్‌సీ చేసే సిఫారసులను నీరుగారుస్తోందని ధర్నా
హైదరాబాద్: వేతన సంఘం చేసే సిఫారసులను నీరుగార్చడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ధోరణిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధానకార్యదర్శి వి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ 7వ వేతన సంఘం తన నివేదికను ఆగస్టు 28వ తేదీ నాటికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్‌కు డిసెంబర్ 31వ తేదీ వరకు(మరో నాలుగు నెలలు) వ్యవధి ఇవ్వడం శోచనీయమన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి 19న అన్ని కార్యాలయాల్లో పెద్దఎత్తున నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సమాఖ్య డిప్యూటీ జనరల్ సెక్రటరీ డీఏఎస్‌వీ ప్రసాద్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ అజీజ్, నాయకులు శ్రీనివాస్‌రావు. తిరుపతి, నరహరి తదితరులు పాల్గొన్నారు.