ఏడో వేతన సంఘం గడువు పెంపు | Seventh Pay Commission Deadline hike | Sakshi
Sakshi News home page

ఏడో వేతన సంఘం గడువు పెంపు

Published Thu, Aug 27 2015 1:29 AM | Last Updated on Mon, Aug 20 2018 9:26 PM

Seventh Pay Commission Deadline hike

న్యూఢిల్లీ: ఏడో వేతన సంఘం గడువును కేంద్ర కేబినెట్ మరో నాలుగు నెలలు పొడిగించింది. దాదాపు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 55 లక్షల మంది పెన్షనర్ల వేతనాల పెంపు కోసం ఫిబ్రవరి, 2014లో ఈ సంఘం ఏర్పాటైంది. కేంద్రం ప్రతి పదేళ్ల కోసం వేతన సంఘాన్ని(పే కమిషన్) ఏర్పాటు చేస్తుంది. 2014లో జస్టిస్ ఏకే మాథూర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏడో పే కమిషన్ నిజానికి ఈ నెలాఖరుకు తమ సిఫారసులను కేంద్రానికి సమర్పించాలి. ఈ కమిషన్ తమ సిఫారసులు చేయడానికి గడువును డిసెంబరు 31 దాకా పొడిగించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ప్రభుత్వవర్గాలు బుధవారం వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement