వేతన సంఘం తరహాలో ఎంపీల జీతభత్యాల సమీక్ష కోసం ఒక ప్రత్యేక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ సూచించింది.
న్యూఢిల్లీ: వేతన సంఘం తరహాలో ఎంపీల జీతభత్యాల సమీక్ష కోసం ఒక ప్రత్యేక శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ సూచించింది. సాధ్యమైనంత త్వరగా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని బుధవారం సమావేశమైన కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. సమావేశంలో ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఎంపీల నెలసరి వేతనాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రతిపాదన ఆర్థిక శాఖలోపెండింగ్‌లో ఉండటంపై భేటీలో సభ్యులు వివరణ కోరినట్లు సమాచారం. ఎంపీల కనీస పెన్షన్‌ను రూ. 20 వేల నుంచి రూ. 35 వేలకు పెంచాలనే అంశం కూడా ఆ ప్రతిపాదనలో ఉంది. ఎంపీల నివాస గృహాల ఫర్నిచర్ కోసం ఉద్దేశించిన ప్రస్తుతం ఎంపీలకు నెల వేతనం రూ. 50 వేలు కాగా, పార్లమెంటు సమావేశాలకు హాజరైన సందర్భాల్లో.. రోజుకు రూ. 2 వేలు అదనంగా లభిస్తాయి.