న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. (లేడీ బాస్ సర్‌ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!)
కరోనా సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ బకాయిల చెల్లిపులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డియర్‌నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా టైమ్‌లో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని అయితే ఈ డియర్‌నెస్ అలవెన్స్‌ను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్)
డీఏ బకాయిలపై నరేన్ భాయ్ జే రావత్ రాజ్య సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.అలాంటి నిబంధనేమీ లేదని, ప్రభుత్వం దాని గురించి ఆలోచించడం లేదని లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు అంతంత మాత్రం గానే ఉన్నాయన్నారు. డియర్‌నెస్ అలవెన్స్‌ను నిలిపివేత ద్వారా ప్రభుత్వానికి రూ.34,000 కోట్లు ఆదా అవుతుందని సమాచారం. (పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!)
మరోవైపు డియర్‌నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులు,పెన్షనర్ల హక్కు అని ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. కరోనా కాలంలో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి ఉద్యోగుల సంఘాలు సన్నద్ధమ వుతున్నాయి.
కాగా 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తరుణంలో కరోనా కాలంలో నిలిపివేసిన డీఏ బకాయిలను కేంద్ర చెల్లిస్తుందని ఉద్యోగులంతా ఎదురు చూశారు.
Comments
Please login to add a commentAdd a comment