సాక్షి, హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఖాళీగా ఉన్న 399 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. శాఖాపరమైన ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం భర్తీకి అనుమతిచ్చిన పోస్టులు.. ప్రొఫెసర్లు 14, అసోసియేట్ ప్రొఫెసర్లు 15, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 28, మెడికల్ సూపరింటెండెంట్ 1, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ 1, ఆర్‌ఎంవో 4, సీనియర్ రెసిడెంట్స్ 41, మెడికల్ ఆఫీసర్స్/జూనియర్ రెసిడెంట్స్ 26, స్టాఫ్ నర్సు 130, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ 4, ల్యాబ్ టెక్నీషియన్స్ 30, ఫార్మాసిస్ట్ 5, ఎక్స్ రే/సీ ఆర్ టెక్నీషియన్ 6, సీటీ టెక్నీషియన్ 4, ఎంఆర్‌ఐ టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 6, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్ 8, అనెస్తీషియా టెక్నీషియన్ 9, చైల్డ్ సైకాలజిస్టు 1, హెల్త్ ఎడ్యుకేటర్ 1, ఆర్థోటిస్ట్ 1, ఆడియో విజువల్ టెక్నీషియన్ 1, రిసెప్షనిస్టు/బిల్లింగ్ 12, పీఆర్‌వో 1, ఏపీఆర్‌వో 2, జూనియర్ మెడికల్ రికార్డు ఆఫీసర్ 1, స్టాటిస్టీషియన్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 5, సెక్రరేటర్ అసిస్టెంట్ 5, పీఎస్ 10, అకౌంటెంట్ 4, సూపర్‌వైజర్ 4, హెల్త్ ఇన్‌స్పెక్టర్ 2, మెడికల్ సోషల్ వర్కర్ 2, డైటీషియన్ 1, సివిల్ డిపార్ట్‌మెంట్ ఏఈ 1, ఎలక్ట్రికల్ డిపార్టుమెంట్ ఏఈ 1, వర్క్‌షాప్ సూపరింటెండెంట్/ఏఈ మెకానికల్ 1, కంప్యూటర్ డివిజన్ ఇంచార్జి 1, అసిస్టెంట్ సిస్టం అనలిస్టు 1, కంప్యూటర్ అసిస్టెంట్ 1, బయోమెడికల్ ఇంజనీర్ 1, బయోమెడికల్ టెక్నీషియన్ 2.
నిమ్స్‌కు 399 పోస్టులు
Published Thu, May 24 2018 1:17 AM | Last Updated on Thu, May 24 2018 1:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment