కర్ణాటక సీఎం యడియూరప్ప(ఫైల్‌ఫొటో)
యశవంతపుర/కర్ణాటక: ఆర్టీసీ, బీఎంటీసీ సిబ్బంది సమ్మెకు పిలుపునివ్వటంతో కార్మికుల డిమాండ్లపై చర్చించటానికి సీఎం యడియూరప్ప, డీసీఎం లక్ష్మీణ సవది సోమవారం సమావేశమై చర్చించారు. ఆరవ వేతన కమిషన్ ప్రకారం జీతాలను పెంచాలని ఏప్రిల్ 7న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించారు. వేతన సిఫార్సులను అమలు చేయటం సాధ్యంకాదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. పట్టుబట్టి సమ్మెకు దిగితే ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించినట్లు సమాచారం.
పునరాలోచన చేయండి
-ఐఏఎస్ శరత్ బదిలీపై క్యాట్ తీర్పు
మైసూరు: తన బదిలీపై ఐఏఎస్ అధికారి శరత్ వేసిన పిటిషన్‌పై క్యాట్ తీర్పు వెలువరించింది. శరత్ బదిలీపై ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని క్యాట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 2020 సెప్టెంబర్‌లో మైసూరు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శరత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే బదిలీ చేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తీర్పు రిజర్వులో ఉంచడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం క్యాట్ తన తీర్పును వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment