కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నా దీనికి సంబంధించిన సమాచారమేదీ ఇంకా బయటకు రాలేదు. గతేడాది అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంపును ప్రకటించారు.
నివేదికల ప్రకారం.. దీపావళికి ముందు ప్రభుత్వం 3-4 శాతం డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. దీని ప్రకారం రూ. 18,000 బేసిక్ జీతం ఉన్న ఉద్యోగికి నెలకు రూ. 540-720 జీతం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఉన్నట్లే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అందజేస్తారు. రెండూ సంవత్సరానికి రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో సవరిస్తారు. ప్రస్తుతం కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50 శాతం డీఏ పొందుతున్నారు.
ఇదీ చదవండి: ‘సుకన్య సమృద్ధి’పై వడ్డీ పెరిగిందా?
ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఇప్పటికే డీఏ, డీఆర్‌లను 4 శాతం పెంచింది. వాటిని బేసిక్ పేలో 50 శాతానికి తీసుకువచ్చింది. డీఏలో పెరుగుదల శాతం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ)పై ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment