సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. 2018లోజులైలో పెంచిన 3.144 శాతం కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో కరువు భత్యం 27.248 నుంచి 30.392కు పెరిగినట్లయింది. 2021 జనవరి జీతాలతో (ఫిబ్రవరి 1న) కలిపి నగదుగా చెల్లింపులు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2018, జులై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల బకాయిలు జీపీఎఫ్/జడ్పీపీఎఫ్ వారికి 3 సమ భాగాల్లో పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీపీఎస్ వారికి 30 నెలల ఆరియర్స్ 90 శాతం నగదుతో పాటు 10శాతం ప్రాన్ అకౌంట్‌కు..జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమ భాగాల్లో జమ చేస్తామని తెలిపింది.2019 జనవరి డీఏ 2021 జూలై నుంచి.. 2019 జూలై డీఏ ..2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment