న్యూఢిల్లీ: ఎంపీల జీతభత్యాలు 100 శాతం పెంచాలని పార్లమెంట్ కమిటీ కోరింది. పార్లమెంట్ మాజీ సభ్యుల పెన్షన్ను రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని కమిటీ గురువారం సిఫార్సు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే రోజుల్లో డీఏను రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలని పార్లమెంట్ కమిటీ పేర్కొంది.