Parliament committee
-
శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.మెజారిటీ ఎంత ఉండాలంటే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి👉అలాగే.. లోక్‌సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2026లో..అసోం(పూర్వపు అస్సాం)పశ్చిమ బెంగాల్పుదుచ్చేరితమిళనాడుకేరళ2027లో..గోవాఉత్తరాఖండ్పంజాబ్మణిపూర్ఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్గుజరాత్ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. 2028లో..త్రిపురమేఘాలయానాగాలాండ్కర్ణాటకమిజోరాంఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్తెలంగాణ2029లో..అరుణాచల్ ప్రదేశ్సిక్కింఆంధ్రప్రదేశ్ఒడిషాజమ్ము కశ్మీర్హర్యానాజార్ఖండ్మహారాష్ట్రకోవింద్ కమిటీ సిఫార్సులుజమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.ఇప్పుడు కాకుంటే..జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
పార్లమెంట్ ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా బీద మస్తాన్ రావు
ఢిల్లీ, సాక్షి: పార్లమెంట్లో ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా వైఎస్సార్ర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ బీద మస్తాన్‌రావు.. ముందుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఓబీసీ లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీ తరఫున నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని, ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని పరిశీలించి పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
పార్లమెంట్ కమిటీ ముందు హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి
న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు పార్లమెంట్ కమిటీతో సమావేశం కావడానికి అకస్మాత్తుగా తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డిజీపీతో పాటు ఏడిజి జితేందర్, ఏడిజి సంజయ్ జైన్ కూడా వెళ్లారు. పార్లమెంట్ కమిటీ ముందు తెలంగాణ పోలీస్ శాఖ పని తీరును వివరించారు. అందులో పోలీస్ శాఖ ప్రవేశ పెడుతున్న సంస్కరణలు, అమలు చేస్తున్న విధానాలు, టెక్నాలజీ, మావోయిస్టు సమస్య, వర్టీకల్ (పని విభజన) పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా డిజీపీ వివరించారు. ఈ క్రమంలో అన్ని అంశాలపై నివేదికను పార్లమెంట్ కమిటీకి సమర్పించారు. -
పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి సాదర స్వాగతం పలికిన అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. చదవండి: మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ -
ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా?
పార్లమెంటు కమిటీ సూచన న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ మీడియానూ ప్రెస్‌కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావాలంటూ.. పార్లమెంటరీ కమిటీ సూచనలు చేసింది. ఓ వర్గం మీడియా అనైతిక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందున ప్రెస్ కౌన్సిల్ పరిధిలోకి తీసుకురావటం అవసరమని సూచించింది. దీంతో పాటు ప్రెస్ కౌన్సిల్ అధికారాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పలు మీడియా సంస్థల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్నందున కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కఠినచర్యలు తీసుకోలేకపోతోందని.. పెయిడ్ న్యూస్ ను నియంత్రించటంలోనూ స్పష్టమైన చట్టాలుండాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొం ది. కేబుల్ టీవీ నెట్వర్క్ యాక్ట్ (ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ చట్టం పరిధిలోకే వస్తుంది) అమలుకు ఓ చట్టబద్ధమైన సంస్థ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
పాక్‌లో హిందూ వివాహ బిల్లుకు మోక్షం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లుకు మోక్షం లభించింది. ఆ దేశంలో మైనారిటీలైన హిందువులకు త్వరలో వివాహ చట్టం అమల్లోకి రానుంది. పార్లమెంటు కమిటీ హిందూ వివాహ బిల్లు-2015 ఏక్రగీవంగా ఆమోదం తెలిపింది. జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఐదుగురు హిందువులను ఆహ్వానించికు సోమవారం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బిల్లు జాప్యానికి చివరి వరకు కుట్రలు జరుగుతున్నా కమిటీ.. రెండు సవరణలతో ఆమోదం తెలపడం గమనార్హం. దీనిప్రకారం పెళ్లి సమయానికి స్త్రీపురుషులకు 18 ఏళ్లు నిండి ఉండాలని, చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుందని డాన్ పత్రిక వెల్లడించింది. బిల్లును జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ మద్దతు ఉన్నందున సులభంగా గట్టెక్కే అవకాశముంది. కమిటీ చైర్మన్ మహ్మూద్ బషీర్, అధికార పార్టీ సభ్యుడు రమేష్ కుమార్ వాంక్వాని బిల్లును ఆమోదించాలని చెప్పగా, ఇతర పార్టీల సభ్యులు ఆక్షేపించారు. హిందూ దంపతుల్లో ఎవరైనా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదన్న క్లాజ్‌ను తొలగించాలని రమేష్ కుమార్ సూచించారు. -
'ఎంపీల జీతాలు 100 శాతం పెంచాలి'
న్యూఢిల్లీ: ఎంపీల జీతభత్యాలు 100 శాతం పెంచాలని పార్లమెంట్ కమిటీ కోరింది. పార్లమెంట్ మాజీ సభ్యుల పెన్షన్‌ను రూ. 20 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని కమిటీ గురువారం సిఫార్సు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే రోజుల్లో డీఏను రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలని పార్లమెంట్ కమిటీ పేర్కొంది. -
‘దారి’ దోపిడీ!
సంపాదకీయం: ఈమధ్య టోల్ ప్లాజాల వద్ద చోటుచేసుకుంటున్న ఘర్షణలు, దౌర్జన్యాలు తరచు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఎవరో వీఐపీనో, ఆ తరహా వ్యక్తుల అనుచరులో టోల్ ప్లాజా సిబ్బందిని చావబాదిన దృశ్యాలు చానెళ్లలో దర్శనమిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు కూడా కడుపు మండి ఘర్షణకు దిగుతున్నా చివరకు అక్కడి సిబ్బందిదే పైచేయి అవుతుందని వేరే చెప్పనవసరం లేదు. అంతక్రితం మాటేమోగానీ... ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో అంకురార్పణచేసిన స్వర్ణచతుర్భుజి ప్రారంభమైన తర్వాత ఈ టోల్‌ప్లాజాల జోరు ఎక్కువైంది. నడిరోడ్డుపై అందమైన నిర్మాణాలు, అందులో కంప్యూటర్ల ముందు కూర్చునే సిబ్బంది, వారికి డబ్బులు చెల్లిస్తేగానీ తెరుచుకోని గేట్లు... ఇవన్నీ మనం ఎక్కడున్నామో తెలియని స్థితిలోకి తీసుకెళ్తాయి. రద్దీగా ఉండే రహదార్లపై ఒక్కోసారి ఈ వసూళ్లవల్ల వాహనాలన్నీ ఐదారు కిలోమీటర్లకు మించి నిలిచి పోతున్నాయి. ఏదో అత్యవసర పని నిమిత్తమో, మరింకేదైనా ముఖ్య కార్యక్రమం కోసమో వెళ్లేవారి సహనాన్ని ఈ ట్రాఫిక్ జాంలు పరీక్షిస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో టోల్ ప్లాజాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. దాదాపు అన్నిటికీ పోలీసు రక్షణ అవసరమైంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే టోల్ ప్లాజాల వద్ద డబ్బులు చెల్లించొద్దని పిలుపునిచ్చాక విధ్వంసాలు కూడా జరిగాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయి గనుక ప్రజలను తమవైపు ఆకర్షించడం కోసం ఎంఎన్ఎస్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నదని విమర్శిస్తున్నవారున్నారు. అయితే వారు సైతం టోల్ ప్లాజాల నిలువు దోపిడీని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. జనం ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతం వెళ్లడానికి లేదా నిత్యావసరాలు, ఇతర సరుకులు తరలించడానికి రవాణా సౌకర్యాలు... అందుకోసం పటిష్టమైన రహదార్లు అవసరం. దేశంలో 90వ దశకంలో ఉదారవాద ఆర్ధిక విధానాలు ప్రవేశించాక ఇలాంటి ప్రాథమిక అవసరాలను తీర్చడం కూడా ప్రభుత్వాలకు కష్టమవుతున్నది. ‘అన్నీ మమ్మల్నే చేయమంటే ఎలా... జనం కూడా బాధ్యత గుర్తించాలి, సౌకర్యాలను వినియోగించుకున్నప్పుడు అందుకు తగిన మొత్తం చెల్లించాలి’ అని సుద్దులు చెప్పడం మొదలైంది. విద్య, వైద్యం, ఆఖరికి బిల్లుల చెల్లింపుకూడా ఖరీదైపోయాయి. యూజర్ చార్జీలనే కొత్త పదబంధం వాడుకలోకొచ్చింది. మన రాష్ట్రంలో అయితే చంద్రబాబు పాలనాకాలంలో ధర్మాసుపత్రుల్లో చిన్నా చితకా రోగాలకు మందుకోసం వెళ్లేవారిని కూడా ఈ యూజర్ చార్జీలు పీడించేవి. ఆ వరసలోనే రహదారుల నిర్మాణానికయ్యే వ్యయాన్ని ప్రజలనుంచి వసూలు చేసే పథకానికి రూపకల్పనచేశారు. రహదారుల నిర్మాణాల బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించి, అందుకైన వ్యయాన్ని టోల్‌ప్లాజాల ద్వారా వారే రాబట్టుకునే ఏర్పాటుచేశారు. కనుక కోట్లాది రూపాయల వ్యయంతో ఆరు వరసలు, ఎనిమిది వరసలు ఉండే రోడ్లను నిర్మించడం... దానికి ఆ చివరా, ఈ చివరా రోడ్డు మధ్యలో టోల్‌ప్లాజాలు నిర్మించడం, వాహనాలనుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభమైంది. ఇదంతా వాహనాలున్నవారి గొడవే కదా...మనకేమి సంబంధం అని సామాన్యులు అనుకోవడానికి లేదు. వారు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల టిక్కెట్లలో సైతం ఈ టోల్‌ప్లాజా ఖర్చు కలిసే ఉంటున్నది. ఇందువల్ల బస్సు చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఆటోలు, క్యాబ్‌లు కూడా టోల్ ఖర్చును ప్రయాణికులకు బదిలీచేస్తున్నాయి. ఈ వసూళ్లకు ఒళ్లుమండి ధర్నాలకు దిగడం, రాస్తారోకోలు చేయడంవంటి ఉదంతాలు మన రాష్ట్రంలో ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. దేశంలోని 17 ప్రధాన రహదారులవద్ద టోల్‌ప్లాజాల పనితీరును అధ్యయనం చేసిన కోల్‌కతా ఐఐఎం ఆసక్తికరమైన సంగతి వెల్లడించింది. గంటల తరబడి నిలిచిపోయే వాహనాలవల్ల దేశ ఆర్ధిక వ్యవస్థకు ఏటా దాదాపు రూ. 87,000 కోట్ల నష్టం సంభవిస్తున్నదని తేల్చింది. సంపన్నుడైనా, పూటకు ఠికానాలేని సామాన్యుడైనా తెల్లారిలే స్తే తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే ప్రతి ఖర్చులో కొంత భాగం పన్నుల రూపంలో పోతుంది. ఆ పన్నులు కాదని ఇలా వేర్వేరు రూపాల్లో సామాన్యులను బాదటం ప్రభుత్వాలకు అలవాటైపోయింది. టోల్ ప్లాజాల వద్ద సాగేది నిజానికి డబుల్ దోపిడీ! కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పైనా, డీజిల్‌పైనా ప్రతి లీటర్‌కూ రోడ్డు సెస్ పేరిట రూ. 2 చొప్పున వసూలు చేస్తోంది. 2012-13లో ఇలా దేశంలో వసూలైన మొత్తం రూ.19,333 కోట్లు. ఈ వసూళ్లు ఇలా ఉండగానే టోల్‌ప్లాజాల వద్ద మరోసారి నిలువుదోపిడీ చేయడమంటే జనంనుంచి ఒకే పనికి రెండుసార్లు వసూలుచేయడం. రోడ్డు సెస్‌ద్వారా వసూలయ్యే మొత్తాన్ని రోడ్లకే ఖర్చు చేయాల్సి ఉండగా అది జరగడంలేదు. 2012-13లో కేవలం రూ.7,000 కోట్లు మాత్రమే కేంద్రం రోడ్లకు ఖర్చు పెట్టింది. చాన్నాళ్ల క్రితం ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న పార్లమెంటరీ కమిటీ సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. రహదారుల నిర్మాణం విషయంలోనూ, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేటపుడూ కాస్త తెలివితో వ్యవహరిస్తే ప్రాజెక్టు వ్యయం గణనీయంగా తగ్గుతుందని కాగ్ నిరూపించింది. ప్రాజెక్టును కొన్ని భాగాలుగా విడగొట్టి వేర్వేరు సంస్థలకు అప్పగించాలని సూచించింది. ఇలా ఎందరు ఎన్ని చెప్పినా యూపీఏ ప్రభుత్వం తన బండబారిన ఆలోచనల్నే అమలుచేస్తోంది. పర్యవసానంగా టోల్‌ప్లాజాలవద్ద ఆగ్రహా వేశాలు పెరుగుతున్నాయి. కనీసం రాబోయే ఎన్నికల భయంతోనైనా, మహారాష్ట్ర పరిణామాలను గమనించాకైనా తన విధానాలను సమీక్షించుకోవడం అవసరమని కేంద్రం గుర్తించాలి. లేకుంటే జనం క్షమించరు.