ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లుకు మోక్షం లభించింది. ఆ దేశంలో మైనారిటీలైన హిందువులకు త్వరలో వివాహ చట్టం అమల్లోకి రానుంది. పార్లమెంటు కమిటీ హిందూ వివాహ బిల్లు-2015 ఏక్రగీవంగా ఆమోదం తెలిపింది. జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఐదుగురు హిందువులను ఆహ్వానించికు సోమవారం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బిల్లు జాప్యానికి చివరి వరకు కుట్రలు జరుగుతున్నా కమిటీ.. రెండు సవరణలతో ఆమోదం తెలపడం గమనార్హం. దీనిప్రకారం పెళ్లి సమయానికి స్త్రీపురుషులకు 18 ఏళ్లు నిండి ఉండాలని, చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుందని డాన్ పత్రిక వెల్లడించింది.
బిల్లును జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ మద్దతు ఉన్నందున సులభంగా గట్టెక్కే అవకాశముంది. కమిటీ చైర్మన్ మహ్‌మూద్ బషీర్, అధికార పార్టీ సభ్యుడు రమేష్ కుమార్ వాంక్వాని బిల్లును ఆమోదించాలని చెప్పగా, ఇతర పార్టీల సభ్యులు ఆక్షేపించారు. హిందూ దంపతుల్లో ఎవరైనా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదన్న క్లాజ్‌ను తొలగించాలని రమేష్ కుమార్ సూచించారు.
పాక్‌లో హిందూ వివాహ బిల్లుకు మోక్షం
Published Wed, Feb 10 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement