hindu marriage bill
-
ఎట్టకేలకు చట్టం చేశారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందూ పెళ్లిళ్లు ఇక చట్టబద్దం కానున్నాయి. ఇందుకు సంబంధించిన 'ది హిందూ మ్యారేజ్ బిల్ 2017' బిల్లుకు పాకిస్తాన్ సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2015లో నేషనల్ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును సెనేట్ శుక్రవారం ఆమోదించింది. కాగా, ఈ బిల్లు వచ్చే వారం పాకిస్తాన్ అధ్యక్షుడి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తానీ పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్క్వాలలో నివసిస్తున్న హిందువులు ఈ చట్టం వర్తించనుంది. సింధ్ ప్రావిన్సులో ఇప్పటికే హిందూ పెళ్లిళ్లకు ప్రత్యేక చట్టం ఉన్న విషయం తెలిసిందే. -
పాక్‌లో హిందూ వివాహ బిల్లుకు ఆమోదం
ఇస్లామాబాద్: ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుతో.. మైనార్టీలైన హిందువులు తమ పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించుకునేందుకు అవకాశం కలిగింది. హిందూ వివాహాలను 15 రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. అలాగే హిందువుల వివాహానికి కనీస వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించినట్లు మీడియా తెలిపింది. బిల్లు ప్రకారం. భర్త చనిపోరుున ఆరు నెలల తర్వాత వితంతువులు తిరిగి మరో పెళ్లి చేసుకోవచ్చు. -
పాక్‌లో హిందూ వివాహ బిల్లుకు మోక్షం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లుకు మోక్షం లభించింది. ఆ దేశంలో మైనారిటీలైన హిందువులకు త్వరలో వివాహ చట్టం అమల్లోకి రానుంది. పార్లమెంటు కమిటీ హిందూ వివాహ బిల్లు-2015 ఏక్రగీవంగా ఆమోదం తెలిపింది. జాతీయ అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ ఐదుగురు హిందువులను ఆహ్వానించికు సోమవారం బిల్లుకు ఆమోదముద్ర వేసింది. బిల్లు జాప్యానికి చివరి వరకు కుట్రలు జరుగుతున్నా కమిటీ.. రెండు సవరణలతో ఆమోదం తెలపడం గమనార్హం. దీనిప్రకారం పెళ్లి సమయానికి స్త్రీపురుషులకు 18 ఏళ్లు నిండి ఉండాలని, చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుందని డాన్ పత్రిక వెల్లడించింది. బిల్లును జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ మద్దతు ఉన్నందున సులభంగా గట్టెక్కే అవకాశముంది. కమిటీ చైర్మన్ మహ్మూద్ బషీర్, అధికార పార్టీ సభ్యుడు రమేష్ కుమార్ వాంక్వాని బిల్లును ఆమోదించాలని చెప్పగా, ఇతర పార్టీల సభ్యులు ఆక్షేపించారు. హిందూ దంపతుల్లో ఎవరైనా ఇస్లాం మతాన్ని స్వీకరిస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదన్న క్లాజ్‌ను తొలగించాలని రమేష్ కుమార్ సూచించారు.