పాక్లో హిందూ వివాహ బిల్లుకు ఆమోదం
ఇస్లామాబాద్: ఎప్పట్నుంచో పెండింగ్‌లో ఉన్న హిందూ వివాహ బిల్లును పాకిస్తాన్ పార్లమెంట్ దిగువ సభ మంగళవారం ఆమోదించింది. బిల్లుతో.. మైనార్టీలైన హిందువులు తమ పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించుకునేందుకు అవకాశం కలిగింది. హిందూ వివాహాలను 15 రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. అలాగే హిందువుల వివాహానికి కనీస వయోపరిమితిని 18 ఏళ్లుగా నిర్ణయించినట్లు మీడియా తెలిపింది. బిల్లు ప్రకారం. భర్త చనిపోరుున ఆరు నెలల తర్వాత వితంతువులు తిరిగి మరో పెళ్లి చేసుకోవచ్చు.