
ఢిల్లీ, సాక్షి: పార్లమెంట్‌లో ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా వైఎస్సార్‌ర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ బీద మస్తాన్‌రావు.. ముందుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే..
ఓబీసీ లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీ తరఫున నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని, ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని పరిశీలించి పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment