Beeda Masthan Rao
-
చీకటి వ్యవహారాలు టీడీపీకి కొత్తేమీ కాదుగా..!
రాజకీయాల్లో కృతజ్ఞత, విధేయత అనే పదాలకు పెద్దగా విలువ ఉండదన్న సంగతి మరోసారి రుజువైంది. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకట రమణరావు, బీదా మస్తాన్ రావులు జెండా ఫిరాయించేశారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన పాత పద్దతులకు పదును పెడుతోందని, పదవుల అమ్మకాలు, కొనుగోళ్లు బేరసారాల పర్వం ఆరంభమైందన్న చర్చ మొదలైంది. కానీ ఈ తాజా పర్వంలో కొత్త ట్రెండ్ ఏంటంటే తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలు తమకు ఎమ్మెల్సీ లేదా ఎంపీ పదవి కావాలనుకుంటే వైఎస్సార్సీపీలో ఆ పదవుల్లో ఉన్న వారిని ప్రలోభపెట్టి నేరుగా బేరం కుదుర్చుకుని రాజీనామాలు చేయిస్తుండటం! వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీకి టీడీపీ నేత ఒకరు రూ.పది కోట్లు ఆశపెట్టి రాజీనామా చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే 40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎంపీలలో విషయంలోనూ ఇదే రకమైన వ్యవహారం నడించిందా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి.ఈ బేరసారాలన్నీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొత్తాన్ని శాసిస్తున్న మంత్రి, బాబు గారి పుత్రుడు లోకేశ్ అనుమతితోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావుల రాజీనామాలకు రాజ్యసభ అధ్యక్షుడు ఇప్పటికే ఆమోదం కూడా తెలిపారు. టీడీపీలో చేరి తరువాత వారికే ఆ పదవులు ఇస్తే బేరసారాల వ్యవహారం నిజం కాదని అనుకోవచ్చు. వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరినందుకు వేరే ఏదో ఒకటి గిట్టుబాటు అయి ఉంటుందని అంచనా వేయవచ్చు. అలా కాకుండా.. ఈ పదవులకు ఇతరులకు దక్కితే మాత్రం అనుమానాలు రావడం సహజం.వాస్తవానికి టీడీపీ నాయకత్వానికి ఈ రకమైన చీకటి వ్యవహారాలు, కొనుగోళ్లూ కొత్తేమీ కాదు. గతంలోనూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి అసలు ప్రాతినిథ్యమే లేదు. అందుకే వారు ఈ కొనుగోళ్లు, బేరసారాలకు తెరతీశారు. ఇందుకు డబ్బు, పదవులు ఆశపెడుతున్నారు. అయితే ఇది పార్టీ నేరుగా చేస్తున్న పనా? లేక పదవులు ఆశిస్తున్న నేతలతో పార్టీ కొనుగోలు చేయిస్తోందా? అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.రాజీనామా చేసిన ఎంపీల్లో ఒకరైన మోపిదేవి మాత్రం చాలా స్పష్టంగా స్థానిక రాజకీయల్లో ఉండడం కోసమే రాజ్యసభ పదవిని వదులుకుంటున్నట్టు, టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కానీ ఈ వాదనలో తర్కమేమిటో ఆయనకే తెలియాలి! అందుకే తామూ ఇదంతా బేరాసారాల వ్యవహారమంటున్నామని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.మోపిదేవి స్వస్థలం రేపల్లె. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పుడు అక్కడి ప్రతినిధి. సత్యప్రసాద్‌ను కాదని మోపిదేవికి రేపల్లెలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. మహ అయితే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టవచ్చు. 2026లో నియెజకవర్గాల పునర్విభజన జరిగితే... మోపిదేవి లేదా అయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వవచ్చని కొందరు అంటున్నారు. రెండేళ్ల పదవి కాలం ఉన్నవారు రాజీనామా చేస్తే రూ. ఇరవై కోట్లు, రూ.నాలుగేళ్ల పదవి కాలం ఉన్న వారు రాజీనామా చేస్తే రూ.40 కోట్లను ఆఫర్ చేస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. సరే డబ్బు సంగతి నేరుగా ఎవరు అంగీకరించరు. మొత్తమ్మీద చూస్తే మోపిదేవి పార్టీ మారడం వల్ల స్వస్థలం రేపల్లెలో పరపతి ఏమీ పెరగదు సరికదా.. తగ్గే అవకాశాలే ఎక్కువ. మోపిదేవి వరుసగా రెండుసార్లు ఓడిపోయినా వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆయనను గౌరవించి అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడమే కాకుండా... మంత్రిని కూడా చేశారు. విధాన పరిషత్‌ను రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కూడా మోపిదేవితోపాటు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు నష్టం జరక్కూడదన్న ఆలోచనతో వారిని రాజ్యసభకు పంపించారు. ఈ విషయాలను గుర్తు చేసుకుంటూనే పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు జగన్ ఎప్పుడూ అన్యాయం చేయలేదని, పార్టీ కూడా గౌరవంగా చూసిందని, తాను పార్టీకి విధేయుడినని స్పష్టం చేశారు. రాజీనామా చేయనున్నారన్న ప్రచారం చేసిన ఎల్లో మీడియాను తప్పుపట్టారు మోపిదేవి మాత్రం అందరని అశ్చర్య పరుస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. మోపిదేవి మొదట మండల అధ్యక్షుడిగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చింది. తరువాతి కాలంలో ఆయన 1999, 2004లలో కూచినపూడి నుంచి, 2009లో రేపల్లె నుంచి గెలుపోంది వైఎస్సార్ కేబినెట్లో మంత్రి అయ్యారు. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లోనూ కొనసాగారు.వైఎస్సార్ అనుహ్య మరణం, తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టుకునే పరిస్థితి రావడం.. కాంగ్రెస్ అధిష్టానం అక్రమ కేసులు బనాయించడం జరిగాయి. మోపిదేవిని కూడా కాంగ్రెస్ పార్టీ కేసుల్లో ఇరికించింది. కొంతకాలం జైలు జీవితమూ అనుభవించారు. ఈ విషయాలన్నీ తెలిసిన జగన్ పార్టీలో ఆ తరువాత అధికారం వచ్చిన తరువాత కూడా మోపిదేవికి మంచి ప్రాధన్యత ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో రేపల్లెలో పోటి చేయాలని అనుకున్నా గెలుపు అవకాశం లేదని సర్వేలు తేల్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ మోపిదేవికి టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఆ సంగతిని మోపిదేవి ఇప్పుడు ప్రస్తావించడం ఇప్పుడు సముచితంగా లేదు. ఒక వేళ టిక్కెట్ ఇచ్చిన తరువాత ఓడిపోయి ఉంటే ఏం చేసేవారు?రాజకీయాల్లో విధేయత అన్నది శాశ్వతం కాదు అన్నది ఈయన కూడా రుజువు చేశారు. జగన్ కేసుల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు తీవ్రంగా విమర్శించేవారు. కానీ ఇప్పుడు మోపిదేవిని తన పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ పై పెట్టినవి అక్రమ కేసులే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు అయ్యింది.రాజీనామా చేసిన మరో ఎంపీ బీద మస్తాన్ రావు గతంలో కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే. కాని రెండు సార్లు వరుసగా ఓడిపోయారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీ వైపు వచ్చేశారు. పార్టీ నాయకత్వం కూడా ఈయనను గుర్తించి ఎంపీ పదవి ఇచ్చింది. మస్తాన్ రావుకు రొయ్యల ఫీడ్ వ్యాపారంతోపాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో తన వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పార్టీ మారుతూండవచ్చని అంటున్నారు.అయితే వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైన వెళతారా అన్నది చూడాలి. ఎల్లో మీడియా అయితే ఇద్దరు ముగ్గురిని మినహాయించి అందరూ పార్టీ వీడతారని ప్రచారం చేసింది ఎల్లో మీడియా. అది వాస్తవం కాదని ఇప్పటికైతే స్పష్టం. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు మిగిలిన వారు అందరూ ఖండించారు. ఎంపీలు లేదా ఎమ్మెల్సీలు పార్టీలు ఫిరాయించినంత మాత్రాన వైఎస్సార్సీపీకి నష్టం జరుగుతుందని అనుకుంటే అది టీడీపీ పొరబాటే అవుతుంది. ఎందుకంటే 2014 - 2019 మధ్యకాలంలో వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతరుల ప్రభావాలను లోనై పార్టీని వీడారు. అయినప్పటికీ జగన్ ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదని 2019 నాటి ఎన్నికలు రుజువు చేశాయి. ఎంపీలు వెళ్లిపోతే పార్టీ మళ్లీ గెలవలేదని అనుకుంటే.. తాజా ఎన్నికల్లో టీడీపీ కూడా గెలిచి ఉండకూడదు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎంపీలు నలుగురు బీజేపీలోకి చేరారు మరి! కాకపోతే వారు చంద్రబాబు అనుమతి తీసుకుని పార్టీ మారారు అన్నది బహిరంగ రహస్యం. పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్నప్పుడు టీడీపీ లోకసభ సభ్యులు అరడజను మందిని కాంగ్రెస్‌లోకి లాక్కొచ్చారు. కానీ ఆ తర్వాత 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ వారికి క్యారెక్టర్ లేదు అంటూనే ఆ పార్టీ వారిని టీడీపీలోకి చేర్చుకుంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరారని చెబుతున్న ఈయన ఒంగోలు, ఏలూరు కార్పోరేషన్ ఛైర్మన్లను, మరికొన్ని చోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నేరుగా పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారో కూడా చెప్పాలి. ఏది ఏమైనా... ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అయారాం.. గయారామ్‌ల వ్యవహారాలు మాత్రం ఆగడం లేదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
డబ్బు చేతికి అందగానే.. మోపిదేవి, బీదా మస్తాన్ రాజీనామా
-
మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు
సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్‌లో మస్తాన్‌రావు మాట్లాడారు. మెరిట్ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్‌రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. -
పార్లమెంట్ ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా బీద మస్తాన్ రావు
ఢిల్లీ, సాక్షి: పార్లమెంట్లో ఓబీసీ సంక్షేమ కమిటీ సభ్యునిగా వైఎస్సార్ర్సీపీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎంపీ బీద మస్తాన్‌రావు.. ముందుగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. ఓబీసీ లకు ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కమిటీ తరఫున నిష్పక్షపాతంగా పరిశీలిస్తానని, ఓబీసీల సంక్షేమానికి సంబంధించిన విషయాల్ని పరిశీలించి పార్లమెంటుకు నివేదిక సమర్పిస్తానని చెప్పారు. -
చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మెడబెట్టి గెంటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : కావలి ఎమ్మెల్యే
-
బీసీలను మోసం చేసింది బాబే.. సీఎం జగన్ పథకాలతో ఎక్కువ లబ్ది పొందింది బీసీలే
-
బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంది.
-
‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్’
సాక్షి, ప్రొద్దుటూరు: దళితులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. దళితులకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర ఎవ్వరికీ లేదని తెలిపారు. ఈ మేరకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశాంలో.. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి అందించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కేబినెట్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారని. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పారు. ‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ జగనే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అంజాద్ బాషా తెలిపారు. చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే! -
ఉనికి కోసమే టీడీపీ గోబెల్స్ ప్రచారం: మోపిదేవి ఫైర్
సాక్షి, ఢిల్లీ: టీడీపీ గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రంలో ఉనికి కోసం టీడీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ఎంపీ మోపిదేవీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. యువగళం పేరుతో లోకేశ్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. గత మే 16న అమర్నాథ్ అనే వ్యక్తి హత్యలో రాజకీయ కారణాలు లేవు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో వారిని కోర్టు ముందు నిలబెట్టాము. బాధిత కుటుంబానికి వెంటనే ఉద్యోగం ఇచ్చాం. అలాగే, వారికి ఇంటి స్థలం కూడా మంజూరు చేశాం. కానీ, ఇప్పుడు నారా లోకేశ్ బాబు.. అమర్నాథ్ తల్లి, చెల్లితో పచ్చి అబద్ధాలు చెప్పించారు. అభం శుభం తెలియని వారిని తమ స్వార్థం కోసం టీడీపీ ఉపయోగించుకుంటోంది. అమర్నాథ్ కుటుంబాన్ని మా ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బాధితులకు అండగా నిలిచిందన్నారు. నాలుగేళ్లలో బీసీల కోసం ప్రభుత్వం రూ.82వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీసీలను అధికంగా రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌దే. బీసీల కోసం చరిత్రలోనే ఎవరూ చేయనంతగా రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్ చేయూతనిచ్చారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. రేపల్లె ఘటనపై లోకేశ్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలను మానుకోవాలి. టీడీపీ మాయ మాటలను బీసీలెవరూ నమ్మరు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా? -
సీఎం జగన్ కు కృతజ్ఞతలు
-
వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బీసీలకు సముచిత స్థానం: బొత్స అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నామినేటెడ్ పదవులతోపాటు నామినేషన్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: సజ్జల బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే.. 1.ర్యాగ కృష్ణయ్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 13, 1954 విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. ► 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2. వేణుంబాక విజయసాయిరెడ్డి పుట్టిన తేదీ: జూలై 1, 1957 సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ పదవులు: ► ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. ► వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు)కు ఎంపికయ్యారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3. బీద మస్తాన్‌రావు పుట్టిన తేదీ: జూలై 2, 1958 సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్) ► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ► చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్‌లో ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేశారు. ► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు. ► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. ► బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ► 2019 డిసెంబర్లో వైఎస్సార్సీపీలో చేరారు. ► బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ► కోవిడ్ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్‌కు విరాళం ఇచ్చారు. ► 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ వాషింగ్టన్, యూఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 4. నిరంజన్‌రెడ్డి పుట్టిన తేదీ: జూలై 22, 1970 సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ విద్యార్హతలు: హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. -
బీద మస్తాన్‌రావు: వ్యాపార, రాజకీయాలతోనే కాదు..
సాక్షి, నెల్లూరు: బీసీ కోటాలో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థిగా రాజ్యసభకు ఎంపికయ్యారు బీద మస్తాన్ రావు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వ్యాపారంలో ఎదిగి.. తిరిగి రాజకీయాలతోనే రాణిస్తున్నారాయన. ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత.. బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విద్య పూర్తయ్యాక.. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా మొదలుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు.