సాక్షి, ఢిల్లీ: టీడీపీ గోబెల్స్ ప్రచారానికి దిగుతోందని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రాష్ట్రంలో ఉనికి కోసం టీడీపీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాగా, ఎంపీ మోపిదేవీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
యువగళం పేరుతో లోకేశ్ పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు. గత మే 16న అమర్నాథ్ అనే వ్యక్తి హత్యలో రాజకీయ కారణాలు లేవు. ఈ ఘటనకు పాల్పడిన నలుగురిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలో వారిని కోర్టు ముందు నిలబెట్టాము. బాధిత కుటుంబానికి వెంటనే ఉద్యోగం ఇచ్చాం.
అలాగే, వారికి ఇంటి స్థలం కూడా మంజూరు చేశాం. కానీ, ఇప్పుడు నారా లోకేశ్ బాబు.. అమర్నాథ్ తల్లి, చెల్లితో పచ్చి అబద్ధాలు చెప్పించారు. అభం శుభం తెలియని వారిని తమ స్వార్థం కోసం టీడీపీ ఉపయోగించుకుంటోంది. అమర్నాథ్ కుటుంబాన్ని మా ప్రభుత్వం సంపూర్ణంగా ఆదుకుంది. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే బాధితులకు అండగా నిలిచిందన్నారు. నాలుగేళ్లలో బీసీల కోసం ప్రభుత్వం రూ.82వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. బీసీలను అధికంగా రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్‌దే. బీసీల కోసం చరిత్రలోనే ఎవరూ చేయనంతగా రాజకీయంగా, సామాజికంగా సీఎం జగన్ చేయూతనిచ్చారు.
మరోవైపు, వైఎస్సార్‌సీపీ ఎంపీ బీద మస్తాన్ రావు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో బీసీలకు ఒరిగిందేమీ లేదు. రేపల్లె ఘటనపై లోకేశ్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. టీడీపీ నీచ రాజకీయాలను మానుకోవాలి. టీడీపీ మాయ మాటలను బీసీలెవరూ నమ్మరు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మొసలికన్నీరు సంగతి సరే.. మరి ఈనాడుకు ఆ దమ్ముందా?
Comments
Please login to add a commentAdd a comment