
ఫైల్‌ఫోటో
సాక్షి, బాపట్ల: చంద్రబాబుకు హాని చేయాల్సిన పని ప్రభుత్వానికి లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. బాబుకు ప్రమాదం ఏదైనా ఉంటే అది కుటుంబ సభ్యుల నుంచే ఉంటుందని, చంద్రబాబు కుటుంబంలోనే దొంగలు ఉన్నారన్నారు. చంద్రబాబు చుట్టూ దొంగలను పెట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లటం సరైన పద్దతి కాదంటూ ఎంపీ మోపిదేవి హితవు పలికారు.
‘‘13 చోట్ల సంతకాలు పెట్టి సీఐడీకి అడ్డంగా దొరికిన దొంగ బాబు. బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మానసికంగా కుంగిపోయి బరువు తగ్గుతారు. కానీ చంద్రబాబు జైలులో ఉండి కూడా కేజీ బరువు పెరిగారు. జైల్లో ఉండి కూడా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కుట్రలు, కుతంత్రాలతో చంద్రబాబు జైలు జీవితం గడుపుతున్నాడు. గతంలో స్టేలతో తప్పించుకుని తిరిగిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు పాపం పండింది జైలుకి వెళ్లారు’’ అని మోపిదేవి వ్యాఖ్యానించారు.
చదవండి: నారా లోకేష్‌కి మరోసారి షాక్ ఇచ్చిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment