న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డీఏ), కరవు సాయం(డీఆర్)ను అదనంగా 2 శాతం పెంచడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులు, 62.03 లక్షల మంది పించన్‌దారులకు(మొత్తం 1.1 కోట్ల మంది) ప్రయోజనం కలగనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డీఏ, డీఆర్‌లను పెంచడం ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.6,112.20 కోట్ల భారం పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెంచిన భత్యాలు ఈ జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఖజానాపై రూ.4074.80 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు, రైల్వే రంగంలో శాస్త్రీయ, సాంకేతికత సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి దక్షిణ కొరియా రైల్వేతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అధికారులు కేబినెట్‌కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment