ఉద్యోగులకు తీపికబురు | 7th Pay Commission: Centre agrees to double deputation allowance | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు తీపికబురు

Published Tue, Nov 28 2017 7:37 PM | Last Updated on Tue, Nov 28 2017 7:37 PM

7th Pay Commission: Centre agrees to double deputation allowance - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అందించింది. ఏడవ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 48 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల డిప్యుటేషన్‌ అలవెన్సును రెట్టింపు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.డిప్యుటేషన్‌ అలవెన్సును 2.25 రెట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందని, 2017, జులై 1 నుంచి ఈ నిర్ణయం వర్తింపచేస్తామని సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఒకే స్టేషన్‌లో డిప్యుటేషన్‌కు సంబంధించి డిప్యుటేషన్‌ అలవెన్స్‌ను బేసిక్‌ పేలో 5 శాతంగా ఉంటుందని గరిష్టంగా నెలకు రూ 4500 వరకూ పెరుగుతుందని, లొకేషన్‌ మారితే మూల వేతనంలో పది శాతం గరిష్టంగా రూ 9000 వరకూ డిప్యుటేషన్‌ అలవెన్స్‌ చెల్లిస్తారని నోటిఫికేషన్‌ తెలిపింది.ప్రస్తుతం డిప్యుటేషన్‌ అలవెన్స్‌ను ఈ రెండు కేటగిరీల్లో వరుసగా రూ2000, రూ 4000గా చెల్లిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement