హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. డీఏ 3.144 శాతం పెంచుతూ బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పెంచిన డీఏ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలు అవుతుందని ఉత్తర్వులలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాలలో జమ చేయాలని తెలంగాన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.