కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్రం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ 4శాతం పెంచింది. అయితే తాజాగా హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) వంటి నిర్దిష్ట అలవెన్సులు సవరించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ప్రకారం..త్వరలో హెచ్‌ఆర్‌ఏ పెంపుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నట్లు తెలుస్తోంది.దీంతో డీఏ 50శాతానికి చేరినందున హెచ్‌ఆర్‌ఏ పెంపును ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా? ఒకే వేళ విడుదల చేస్తే హెచ్‌ఆర్‌ఏలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరినందున హెచ్‌ఆర్‌ఏ ఎంత పెరుగుతుంది?
హెచ్‌ఆర్‌ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాసం ఉండే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. హెచ్‌ఆర్‌ఏ గణన కోసం జనాభా లెక్కలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా నగరాలను టైప్ ఎక్స్, వై, జెడ్‌గా వర్గీకరించబడ్డాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జులై 1, 2017 నుండి ఉద్యోగులు తమ బేసిక్ శాలరీ రూ.35,000లలో
ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 27శాతం = రూ. 9,450
వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 18శాతం అంటే = రూ. 6,300
జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 9శాతం అంటే = రూ. 3,150
దీన్ని బట్టి 7వ పే కమీషన్ డీఏ 50శాతానికి చేరుకున్నప్పుడు ఉద్యోగికి చెల్లించే బేసిక్ పేలో ఎక్స్ కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 20 శాతం, వై కేటగిరీ నగరాల ఉద్యోగులకు 10 శాతంతో హెచ్‌ఆర్‌ఏ రేట్లు సవరించాలని సిఫార్సు చేసింది.
దీన్ని బట్టి ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హెచ్‌ఆర్‌ఏకి
ఎక్స్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 30శాతం అంటే = రూ. 10,500
వై కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ. 35,000లో 20శాతం అంటే = రూ. 7,000
జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి బేసిక్ పే రూ.35,000లో 10శాతం = రూ. 3,500 లు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంపు: హెచ్‌ఆర్‌ఏ సవరణకు సంబంధించి కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా?
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేస్తుందా అన్న ప్రశ్నలకు ఆర్ధిక నిపుణులు మాట్లాడుతూ.. జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ప్రకారం డీఏ 50శాతం దాటిన తర్వాత హెచ్‌ఆర్‌ఏకి సంబంధించి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అందువల్ల, మరొక నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమలు చేస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment