దేశంలో ఆర్థిక సంస్కరణలకు మూల పురుషుడు పీవీ నరసింహరావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
హైదరాబాద్ : దేశంలో ఆర్థిక సంస్కరణలకు మూల పురుషుడు పీవీ నరసింహరావు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పీవీ నరసింహరావు 94వ జయంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఆయన చిత్ర పటానికి బాబు పూలమాల వేసి... ఘనంగా నివాళులర్పించారు. పీవీ నరసింహరావు తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. దేశానికి దిశానిర్దేశం చేసి మేథావి పీవీ అని ఆయన సేవలను చంద్రబాబు కొనియాడారు.
గాంధీ భవన్ :
గాంధీభవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఘనం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.