Pay tributes
-
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ నివాళి
-
మహాత్మునికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 75వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి మోదీ సోమవారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని మహాత్ముని సమాధి రాజ్‌ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలుంచారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. గన్ సెల్యూట్ , సర్వమత ప్రార్థనలు, గాంధీకి ఇష్టమైన గేయాలాపన జరిగాయి. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు. ‘బాపుకు నా నివాళులు. దేశ సేవలో ప్రాణాలర్పించిన ఎందరో అమరుల త్యాగాలు దేశం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని మరింత పెంచుతాయి’ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో కొరోసీ భేటీ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్జీఏ) అధ్యక్షుడు సాబా కొరోసీ మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్‌తో భేటీ అయ్యారు. పలు అంతర్జాతీయ సవాళ్లపై చర్చలు జరిపారు. జల సంరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం ఆవశ్యకత కూడా ప్రస్తావనకు వచ్చినట్లు అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, జీ20 ఎజెండాతోపాటు ఐరాస సంస్కరణలపై చర్చించినట్లు జై శంకర్ పేర్కొన్నారు. పలు అంశాలపై వారి అవగాహన, స్పందన అద్భుతమని కొరోసీ కొనియాడారు. భారత్‌తోపాటు పలు దేశాలు సీమాంతర ఉగ్రవాదంతో బాధ పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు. -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
సాక్షి, కడప జిల్లా: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇదిలా ఉంటే, మహానేత వైఎస్సార్ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. -
తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు(మే 20). ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. ‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: దావోస్ పర్యటనకు సీఎం వైఎస్ జగన్ తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో చిరస్మరణీయంగా నిలిచిన ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శం. — YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2022 -
మహాత్ముడికి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: (‘ప్రకాశం’లో ఎయిర్‌పోర్టు) -
అబ్దుల్ కలాంకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. 'సమగ్రతకు, విజ్ఞానానికి అబ్దుల్ కలాం ప్రతిరూపం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం కోట్ల మందికి ఆదర్శనీయం. లక్ష్య సాధనకు కృషి చేసే యువతకు ఆదర్శవంతంగా, స్పూర్తి దాతగా ఉంటారు' అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. Remembering the missile man, former President and Bharat Ratna Dr #APJAbdulKalam on his Jayanthi. Kalam ji is the epitome of integrity, wisdom & benevolence whose life inspires millions to dream & achieve. — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 -
బీజాపూర్ ఎన్ కౌంటర్ లో మరణించిన జవాన్లకు అమిత్ షా నివాళి
-
పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్
నిరంతర సంస్కరణశీలి సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాల్లో ఆయన అమలు చేసిన సంస్క రణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభ విస్తుందని అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత, విదేశాంగ వ్యవహారాల్లోనూ ఆయన అవలం బించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారతదేశ సమ గ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్టపరిచిం దని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన పీవీకి ఘననివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో నిర్వహిస్తోందన్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌ని సందర్శించి నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం పీవీ 16వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని ఆయన ఘాట్ వద్ద మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆయనకు నివాళులర్పించి స్మరించుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మలతో పాటు పీవీ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యులు వకులాభవరణం కృష్ణమోహన్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కేకే ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి చేసిన గొప్ప మేధావి దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె.కేశవరావు తెలిపారు. పీవీ జ్ఞాపకార్థం నెక్లెస్ రోడ్‌కు ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ నెల 31లోపు పీవీ పేరుతో స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ధైర్యంతో భూ సంస్కరణలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సంస్కరణలను, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తుందన్నారు. పీవీ చరిత్రలో నిలిచిపోతారు: ఉత్తమ్ పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణల వల్ల దేశ చరిత్రలో ఆయన నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్‌గా నిలబెట్టాయన్నారు. -
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్) -
బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ ఘన నివాళి
-
బీఆర్ అంబేద్కర్‌కు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆదివారం రోజున సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో హోమ్ మంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుగ నాగార్జున, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
మహానేతకు వైస్ జగన్ నివాళులు..
-
మహానేతకు కుటుంబసభ్యుల నివాళులు..
-
'వైఎస్ఆర్ గొప్ప ప్రజా నాయకుడు'
హైదరాబాద్ : మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజా నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లు రవి తెలిపారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్దంతి జరిగింది. ఈ కార్యక్రమానికి టిపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు మాజీ మంత్రి డీకే అరుణ, బలరాం నాయక్ పాల్గొన్నారు. అలాగే పంజాగుట్టలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కతోపాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మల్లు భట్టివిక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని వైఎస్ఆర్ కలలుగనే వారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. -
యర్రా శ్రీదేవికి ఘన నివాళులు
ఒంగోలు : ప్రముఖ టాలీవుడ్ నటుడు గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవికి శుక్రవారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. జిల్లాలోని కొరిసపాడు మండలం రావినూతలలో గిరిబాబు నివాసంలో యర్రా శ్రీదేవి మృతదేహాన్ని జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుతోపాటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సందర్శించి... ఘనంగా నివాళులర్పించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గిరిబాబు సతీమణి యర్రా శ్రీదేవి గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు శుక్రవారం రావినూతలలో జరపనున్నారు. -
'ఎలా గెలవాలో టైగర్‌ను చూసి నేర్చుకోవాలె'
హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో టైగర్ ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో బీజేపీ దివంగత నేత ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం పార్టీ కార్యాలయంలో జరిగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్తో నరేంద్రకు ఉన్న అనుబంధం వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీ కార్యకర్తల కోసం నరేంద్ర చేసిన పోరాటాన్ని నేతలు కొనియాడారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానిని ఆలె నరేంద్ర ఆద్యుడు అని తెలిపారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని వాటిని ఎదుర్కొని, ఎన్నికల్లో గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవడానికి ఎలా కష్టపడాలో నరేంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలే నరేంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
శేషాచల ఎన్కౌంటర్ మృతులకు శ్రద్ధాంజలి
వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో గత సంవత్సరం ఏప్రిల్ 7న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. తిరుపతి, శేషాచల అడవులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే అనుమానంతో తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికులను ఆంధ్ర పోలీసులు గత సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన కాల్చి చంపిన విషయం విదితమే. మృతి చెందిన వారికి మొదటి సంవత్సరం శ్రద్ధాంజలి ఘటించేందుకు తమిళనాడుకు చెందిన 20 మంది కార్మికుల చిత్ర పటాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం తిరువణ్ణామలై బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రజా పరిరక్షణ సంఘం డెరైక్టర్ హెండ్రీ డిపం, పెరియార్ ద్రావిడ కయగంకు చెందిన కొలత్తూర్ మణి, మృతుల కుటుంబ సభ్యులు కలుసుకొని మృతి చెందిన వారి చిత్ర పటాలను బ్యానర్లో ఉంచి వాటికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి చెందిన వారిలో తిరువణ్ణామలై జిల్లా జవ్యాది కొండకు చెందిన కార్మికులే అధికం కావడంతో ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ బస్టాండ్ వద్దకు చేరుకొని చిత్ర పటాల వద్ద క్యాండిల్స్ వెలిగించి మౌనం పాటించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. అదే విధంగా మొదటి సంవత్సరం కావడంతో చిత్ర పటాలను చూసిన పలువురు క్యాండిల్స్ వెలిగించి వారి ఆత్మ శాంతి కలగాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు. -
పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు
-
పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్ : ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బుధవారం గోషామహాల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీసు అమరవీరులకు కేసీఆర్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... పోలీస్ అమరవీరులకు సమాజం రుణపడి ఉంటుందని, శాంతిభద్రతలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. సమాజ రక్షణ కోసం పాటుపడుతున్న పోలీసుల త్యాగాలను సమాజంలో అందరూ గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంఘ విద్రోహ శక్తులకు స్థానం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఈ సందర్భంగా పోలీసులపై వరాల జల్లు కురిపించారు. పోలీసులకు ప్రోత్సాహకాలు... ప్రమోషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారులకు విధులు నిర్వహిస్తున్న చోటే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామన్నారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ స్థాయి వారికి ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ఎస్ఐ ఆ పైస్థాయి అధికారులకు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు కేటాయిస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు 35 శాతం అలవెన్స్‌ను ప్రకటించారు. అలాగే పోలీసుల యూనిఫామ్ వార్షిక అలవెన్స్ రూ. 3, 500 నుంచి రూ. 7,000 వరకు పెంచుతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నర్సింహన్, హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతోపాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పశ్చిమగోదావరిలో వైఎస్ఆర్కు ఘన నివాళి
-
కలాంకు ప్రముఖుల నివాళి!
-
అనంతలో కలాంకు వైఎస్ఆర్ సీపీ నివాళి
అనంతపురం: మాజీ రాష్ట్రపతి అబ్దూల్ కలాంకు అనంతపురం వైఎస్పార్ సీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కలాం సేవలను ఈ సందర్భంగా పలువురు నేతలు కొనియాడారు. దేశానికి అబ్దూల్ కలాం మృతి తీరని లోటు అని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యాక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు, మాజీ ఎంపీ అనంతరామిరెడ్డి, ఉరవ కొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'చనిపోతే సెలవు ఇవ్వొద్దన్నారు'
హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తనకు ఆత్మీయుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం బాధకరంగా ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు ఆయన మంత్రి వర్గం అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... నిరంతరం శ్రమించడం వల్లే అబ్దుల్ కలాం అత్యున్నత శిఖరాలు చేరుకున్నారన్నారు. కలాం ఆత్మకథ 'వింగ్స్ ఆఫ్ ఫైర్' యువతకు ఓ స్ఫూర్తి అన్నారు. నిజమైన భారతరత్న అబ్దుల్ కలాం అని అన్నారు. జీవితాంతం పరిశోధనలపై దృష్టి పెట్టిన వ్యక్తి ఆయన అని కలాం సేవలను కొనియాడారు. తాను చనిపోతే సెలవు ఇవ్వొద్దని చెప్పిన మహనీయుడు కలాం అని శ్లాఘించారు. ఆయన చెప్పిన కొన్ని స్ఫూర్తివంతమైన మాటలను ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేదన్నారు. నీతి నిజాయితీ, పట్టుదలతో ఆయన పని చేసేవారని చెప్పారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం చిన్ననాటి నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టే వరకు ఆయన జీవిత విశేషాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలని ... ఆయన ఏ కలలైతే కన్నారో... ఆ విధంగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు యువతకు సూచించారు. అబ్దుల్ కలాం స్టేట్స్ మెన్ అని స్పష్టం చేశారు. దేశానికి స్టేట్స్ మెన్‌గా ఉండి... దేశభక్తితో దేశానికి అబ్దుల్ కలాం సేవ చేశారన్నారు. తుది శ్వాస వరకు అబ్దుల్ కలాం పని చేస్తూనే ఉన్నారన్నారు. అలాగే ఇటీవల అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆహార ప్రక్రియ విధానంపై ఏర్పాటు చేసిన సభకు అబ్దుల్ కలాం విచ్చేసి ప్రసంగించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలలో భారతరత్న అబ్దుల్ కలాంకు నివాళులు ఆర్పించాలని తమ ప్రభుత్వం ఆదేశించిందని చంద్రబాబు చెప్పారు. -
కలాంకు బాలీవుడ్ ఘన నివాళి
ముంబై : భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్ఫూర్తిమంతమైన దార్శనికత, శాస్త్ర రంగంలో ఆమోఘమైన ప్రతిభ పాటవాలు, రాజకీయాలు తెలియని వ్యక్తి రాష్ట్రపతిగా ఆ పదవిని చేపట్టి వన్నె తెచ్చిన తీరుతో అబ్దుల్ కలాం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి ప్రేమకు పాత్రులయ్యారని వారు ఘనంగా నివాళులర్పించారు. కలాంతో తమకు గల అనుబంధాన్ని బాలీవుడ్ ప్రముఖులు మంగళవారం ట్విట్టర్లో ఇలా వివరించారు. అమితాబ్ బచ్చన్ : అబ్దుల్ కలాం మేధస్సు అద్భుతం... ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించేవారు... ఉదారభావంతో వ్యవహారించే వారు... ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. షారూఖ్ ఖాన్: గురుదాస్‌పూర్‌లో తీవ్రవాదుల దాడి వార్తతో విచారంలో మునిగాను. ఆ వెంటనే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇక లేరు అని వార్త విని షాక్ గురయ్యాన్. వీరందరికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. సల్మాన్ ఖాన్: అనేక తరాల భారతీయులకు అబ్దుల్ కలాం సాబ్ స్ఫూర్తి ప్రదాత అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. కలాంను కలవాలని చాలా సార్లు ప్రయత్నించాను. అందుకు చాలా ప్రయత్నం చేశానన్నారు. నేనే కాదు... భారతీయులంతా ఆయన్నీ మిస్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక చోప్రా: అబ్దుల్ కలాం మృతి భారత్‌కు తీరని లోటని ప్రియాంక చోప్రా తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఏ ఆర్ రెహమాన్: యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన అబ్దుల్ కలాం మరణం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. అనుపమ్ ఖేర్: అబ్దుల్ కలాం గారు.... మీ దేశభక్తికి, మీ స్ఫూర్తివంతమైన జీవితానికి, మీ జ్ఞానానికి ధన్యవాదాలన్నారు. కబీర్ బేడీ: అబ్దుల్ కలాం నిజమైన స్ఫూర్తి ప్రదాత సాజిద్ ఖాన్: రాష్ట్రపతిగా ఉన్న ఆయన రాజకీయ నాయకుడిగా వ్యవహరించలేదు. అబ్దుల్ కలాం గొప్ప మానవతా వాది. -
'వైఎస్ఆర్ రైతు బాంధవుడు'
అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని అనంతపురం వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి పురస్కరించుకుని అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అనంతవెంకట్రామిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్దే అని శంకర్ నారాయణ గుర్తు చేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే జలయజ్ఞాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని చవ్వా రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మహానేత వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగిస్తామని గుర్నాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.