హైదరాబాద్: రాజకీయాల్లో కష్టపడి ఎలా గెలవాలో టైగర్ ఆలె నరేంద్రను చూసి నేర్చుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో బీజేపీ దివంగత నేత ఆలె నరేంద్ర వర్థంతి కార్యక్రమం పార్టీ కార్యాలయంలో జరిగింది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో నరేంద్రకు ఉన్న అనుబంధం వారు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే పార్టీ కార్యకర్తల కోసం నరేంద్ర చేసిన పోరాటాన్ని నేతలు కొనియాడారు.
దత్తాత్రేయ, కిషన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరగడానిని ఆలె నరేంద్ర ఆద్యుడు అని తెలిపారు. సహజంగానే బీజేపీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉంటాయని వాటిని ఎదుర్కొని, ఎన్నికల్లో గెలవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నేతలు ఎన్నికల్లో గెలవడానికి ఎలా కష్టపడాలో నరేంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలే నరేంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
'ఎలా గెలవాలో టైగర్‌ను చూసి నేర్చుకోవాలె'
Published Sat, Apr 9 2016 8:09 PM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement