సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.వెంకట్రామిరెడ్డికి హైకోర్టు ఘనంగా నివాళులర్పిం చింది. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశమై న్యాయవ్యవస్థకు జస్టిస్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మృతికి సంతాపంగా మధ్యాహ్నం కార్యకలాపాలను రద్దు చేశారు.