'మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనత వైఎస్దే' | TPCC, APCC Leaders pay tributes to YSR at panjagutta Circle | Sakshi
Sakshi News home page

'మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనత వైఎస్దే'

Published Wed, Jul 8 2015 10:59 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

'మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనత వైఎస్దే' - Sakshi

'మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఘనత వైఎస్దే'

హైదరాబాద్: పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలంగాణ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరానికి మెట్రోరైలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి ఘనమైన ప్రాజెక్టులు సాధించిన ఘనత ఆ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని మాజీ మంత్రి, నగర  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు దానం నాగేందర్ తెలిపారు.

మహానేత వైఎస్ఆర్ 66వ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి కార్యక్రమంలో మల్లు భట్టివిక్రమార్క, దానం నాగేందర్,  షబ్బీర్ అలీ, కేవీపీ రామచంద్రరావు, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, భారీ సంఖ్యలో ఆయన అభిమానులు హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement