'వైఎస్ఆర్ రైతు బాంధవుడు' | Anantapur ysrcp leaders pay tributes to ysr | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ రైతు బాంధవుడు'

Published Wed, Jul 8 2015 12:44 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

Anantapur ysrcp leaders pay tributes to ysr

అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడని అనంతపురం వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి పురస్కరించుకుని అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి అనంతవెంకట్రామిరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు.

దేశంలో ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్దే అని శంకర్ నారాయణ గుర్తు చేశారు. వైఎస్ఆర్ స్ఫూర్తితోనే జలయజ్ఞాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని చవ్వా రాజశేఖర్రెడ్డి తెలిపారు. మహానేత వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగిస్తామని గుర్నాథ్రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement