
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్)