
మహానేతకు నివాళులర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో మంగళవారం ఉదయం ఘనంగా నివాళులు ఆర్పించారు. ఆ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్లతోపాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఘనంగా నివాళులు ఆర్పించారు.