
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరితోనైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. న్యాయవాది నుంచి దేశ ప్రధాని స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ జీవితం నేటి సమాజానికి మార్గదర్శకమని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.