water projects
-
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు.. చరిత్ర సృష్టించిన సీఎం జగన్
-
ఏది నిజం?: ప్రాజెక్టులనడుగుదాం.. నీళ్లెవరిచ్చారో?
విశాఖలో రాజధాని కోసం స్థానికులంతా గర్జిస్తే... అప్పుడు రామోజీరావుకు విశాఖలో భూ కుంభకోణాలు కనిపించాయి. రాయలసీమ వాసులంతా ఏకమై మాకు ‘న్యాయ’ రాజధాని కావాలని ఇప్పుడు నినదిస్తే... రామోజీకి సడెన్‌గా రాయలసీమ వెనకబాటుతనం గుర్తుకొచ్చింది. పూర్తికాని ప్రాజెక్టులు మాత్రమే కనిపించాయి. కానీ... చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా బ్రహ్మం సాగర్ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 17.85 టీఎంసీల నీళ్లు నిండటం ‘ఈనాడు’కు కనిపించలేదు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యానికి తగ్గట్టు 10 టీఎంసీలను నిల్వచేయటం ప్రస్తావించనే లేదు. ఇక గండికోట రిజర్వాయర్‌లో గరిష్ఠ సామర్థ్యానికి తగ్గట్టు 26.85 టీఎంసీల నీరు నిల్వచేయటం కూడా రామోజీకి పట్టదు. ఎందుకంటే... ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో చెయ్యలేని పనులు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నరేళ్లలోనే సాధించిన విజయాలు. లీకేజీలకు అడ్డుకట్ట వేస్తే బ్రహ్మం సాగర్ బాగుపడుతుందని, పునరావాసం కల్పిస్తే గండికోటలో గానీ, చిత్రావతిలో గానీ గరిష్ఠంగా నీటిని నిల్వ చేయొచ్చని చంద్రబాబు నాయుడికి తెలియదా? మరెందుకు చేయలేదు? అప్పుడెందుకు రామోజీరావు ఇలాంటి కథనాలు రాయలేదు? ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వంపై కూడా పనిగట్టుకుని ఎందుకు విమర్శలు చేస్తున్నారు? దీనికి సమాధానం ఒక్కటే. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి... ‘న్యాయ’ రాజధానిగా చేస్తానని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చెప్పటం చంద్రబాబుకు సుతరామూ ఇష్టం లేదు. బాబుకు ఇష్టం లేనిదేదైనా... రామోజీకీ నచ్చదు కదా!!. ‘సీమ’ంతైనా మేలు చేశారా... అంటూ వండివార్చిన కథనంలో నిజమెంత? ఏది నిజం? చూద్దాం... ఒక్క నీరే కాదు. పరిశ్రమలు, వైద్య కళాశాలలు... ఇలా రాయలసీమ సమగ్రాభివృద్ధికి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. సాగునీటి సౌకర్యాలను మెరుగుపర్చడంతో పాటు ఐదు వైద్య కళాశాలలు, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను కొత్తగా ఏర్పాటు చేస్తుండటం ద్వారా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నడుంకట్టారు. ఒకటీ అరా పరిశ్రమలు కాదు... ఏకంగా పారిశ్రామిక క్లస్టర్లతోనే సీమ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమ సస్యశ్యామలమైతే.. అక్కడ రాజకీయంగా తమకు నూకలు చెల్లినట్లేనన్నది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన. అప్పుడు తమ డీపీటీకి (దోచుకో..పంచుకో..తినుకో) శాశ్వతంగా తెర పడుతుందనే రామోజీరావు బాధ. అందుకే వికృతరాతలకు ప్రాణంపోస్తూ.. ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికిపుడు రాయలసీమలో బ్రహ్మంసాగర్, గండికోట, సీబీఆర్, వెలుగోడు.. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు ఇలా ఏ ప్రాజెక్టును చూసినా ఇపుడు నిండుకుండను తలపిస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందుతున్నాయి. కానీ చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టుల్లో నాలుగో వంతు కూడా నిండని పరిస్థితి. కొన్నిటికి లీకేజీలు... మరికొన్నిటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవటం... ఇలా అన్నీ సమస్యలే. వాటికి నిధులు ఖర్చుచేసి ప్రాజెక్టుల్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపాల్సిన ప్రభుత్వం ఆ ఊసే గాలికొదిలేసింది. ‘సీమం’తైనా న్యాయం చేయలేకపోయింది. కాకపోతే చంద్రబాబు ఏం చేసినా కరెక్టేనని చెప్పటమే తమ బాధ్యతగా భావించే ‘ఈనాడు’, దాని తోక పత్రిక, ఇతర ఛానెళ్లు ఈ వాస్తవాలను ఎన్నడూ చెప్పలేదు. ఇపుడు మాత్రం అకస్మాత్తుగా వాటికి రాయలసీమ గుర్తుకొచ్చింది. అమ్మో... సీమ అన్యాయమైపోతోందంటూ గుండెలు బాదుకుంటున్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గరిష్ఠ సామర్థ్యం 17.85 టీఎంసీలు. కానీ మట్టికట్టలో నిర్మాణ లోపాల వల్ల లీకేజీలు ఉండటంతో నిల్వ సామర్థ్యం నాలుగైదు టీఎంసీలకు పడిపోయింది. 2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు... ఎన్నడూ లీకేజీలకు అడ్డుకట్ట వేసి గరిష్ఠ సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేద్దామనే ప్రయత్నాలు చేయలేదు. రాయలసీమను సస్యశ్యామలం చేద్దామనే ఆలోచనే చంద్రబాబుకు రాలేదు. ఆ నాలుగైదు టీఎంసీల నిల్వతోనే నెట్టుకొచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... యుద్ధప్రాతిపదికన బ్రహ్మంసాగర్ మట్టికట్టలో లీకేజీలున్న చోట రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారు. లీకేజీలకు అడ్డుకట్ట వేసి ఏకంగా 17.85 టీఎంసీలను నిల్వ చేసి... ఆయకట్టు చివరి భూములక్కూడా నీళ్లిచ్చారు. ఖరీఫ్ పూర్తయినా ఇప్పటికీ బ్రహ్మంసాగర్‌లో 15.11 టీఎంసీల నీరు నిల్వ ఉందనే విషయం రామోజీకి తెలియదా? ఎందుకు రాయరు? గండికోట రిజర్వాయర్ గరిష్ఠ సామర్థ్యం 26.85 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడంతో ఐదారు టీఎంసీలు కూడా నిల్వ చేయలేని దుస్థితి ఉండేది. పునరావాసం కల్పించే ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టాక రూ.వెయ్యి కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. గత రెండేళ్లుగా గరిష్ఠంగా నీటిని నిల్వ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇలాంటి వాస్తవాలను రాస్తే రాయలసీమకు చేస్తున్న మేలు బయటపడుతుందని... అబద్ధాలు రాయటానికే అలవాటు పడ్డారు రామోజీరావు!!. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ది (సీబీఆర్) కూడా గండికోట లాంటి కథే. దీని గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు. కానీ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. ఫలితంగా నాలుగైదు టీఎంసీలను కూడా నిల్వ చేయలేని పరిస్థితి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రూ.600 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. రెండేళ్లుగా సీబీఆర్‌లో గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో 9.61 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇదీ వాస్తవం. బ్రహ్మంసాగర్ రిజర్వాయరు గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు సొరంగాలను తవ్వాలి. ఇందులో ఒకటి మహానేత వైఎస్ఆర్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగంలో మిగిలిన 162 మీటర్ల పనులను ఐదేళ్లలో చంద్రబాబు పూర్తి చేయలేక చేతులెత్తేశారు. ఫాల్ట్ జోన్‌లోని ఆ సొరంగం పనులను అధునాతన సాంకేతిక పరి/ê్ఞనంతో ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయిస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ సొరంగం పూర్తి కాబోతున్నది కూడా. అప్పుడు గాలేరు–నగరి ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించడానికి మార్గం సుగమం అవుతుంది. రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంలో భాగంగా అవుకు వద్ద పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మరో సొరంగాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. తాకట్టు పెట్టిన బాబే గొప్పా..? రాయలసీమ తాగు, సాగునీటికి శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. శ్రీశైలంలో 800 అడుగుల కంటే దిగువ నుంచి అక్రమంగా నీటిని తరలించడానికి 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను చేపడితే నాటి సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయిన బాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎడమ గట్టు కేంద్రం ద్వారా తెలంగాణ సర్కార్ ఎడాపెడా నీటిని తోడేస్తే.. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుంది. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల కంటే దిగువన ఉంటే కృష్ణా బోర్డు కేటయింపులున్నా సరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో 854 అడుగులకు దిగువన ఉన్నా శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షణకు నడుం బిగించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. దీనిపై తెలంగాణ సర్కార్ ఎన్జీటీని ఆశ్రయించింది. పర్యావరణ అనుమతులు తెచ్చుకున్నాకనే రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించాలని ఎన్జీటీ ఆదేశించడంతో.. ఆ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసిన ప్రభుత్వం.. ఆ అనుమతిని తెచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కాకపోతే కబోదిలా మారిన రామోజీకి ఇవేవీ కనిపించవు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాలనే ఆలోచన కూడా చేయని చంద్రబాబే రామోజీకి ఆదర్శ నాయకుడు. ఎందుకంటే.. తన అక్రమాలకు రక్షకుడు కాబట్టి. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులను నింపేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులను రాయలసీమ కరవు నివారణ పథకంలో భాగంగా రూ.43,336 కోట్ల వ్యయంతో చేపట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్. అదీ... సీమకు చేతల్లో చేస్తున్న న్యాయం. వైద్యంతో పాటు ‘న్యాయం’... వైద్య సౌకర్యాలలోనూ రాయలసీమ ముందుండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏకంగా ఐదు మెడికల్ కాలేజీలను, రెండు క్యాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో వైద్య విద్య సీట్లు పెరగటమే కాదు... మెరుగైన వైద్యమూ అందుబాటులోకి రానుంది. ఇక శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలుతో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి నిర్ణయం. ఇప్పటికే ఈ నిర్ణయంలో భాగంగా లోకాయుక్త, వినియోగదారుల కోర్టుతో సహా కొన్ని న్యాయాధికార ప్రాంగణాలు అక్కడ కొలువుదీరాయి. హైకోర్టు రావాలంటూ యావత్తు రాయలసీమ ఉద్యమిస్తోంది కూడా. కాకపోతే రామోజీరావుకు ఈ వాస్తవాలతో పనిలేదు. అందుకే అసలు రాయలసీమ వాసులెవ్వరికీ అక్కడ న్యాయస్థానం రావాలని లేదని, అందరూ అమరావతికే కట్టుబడి ఉన్నారనే ప్రచారాన్ని చంద్రబాబు మొదలెట్టారు. తాను కర్నూలు వెళ్లి అడిగానని, అక్కడి వారంతా అమరావతి రాజధానిగా ఉండటానికే అంగీకరించారని చెప్పటం ఆరంభించారు. దానికి కొనసాగింపుగానే... రామోజీ ఈ వంకర రాతలు మొదలెట్టారు. ఇదీ.. గురుశిష్యుల గూడుపుఠానీ. సీమలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి... వెనుకబడిన రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంపైనా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మహానేత వైఎస్ హయాంలో శ్రీ సిటీ రాకతో రాయలసీమ రూపు రేఖలు మారగా...... సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి వద్ద, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రెండు భారీ పారిశ్రామిక పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిని పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మూడన్నరేళ్లలో వివిధ రంగాలకు చెందిన 29 భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టబడుల ప్రోత్సాహక కమిటి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ 29 ప్రాజెక్టులు ద్వారా రూ.88,333.66 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 76,992 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వీటిలో తిరుపతి జిల్లా ఇనగలూరు వద్ద హిల్‌టాప్ (అపాచీ) సెజ్ భారీ పాదరక్షల తయారీ, పులివెందులలో సుమీత్ ఫుట్‌వేర్, కొప్పర్తి వద్ద నీల్కమల్, పిట్టి లామినేషన్స్, నాయుడుపేట వద్ద గ్రీన్‌టెక్ ఎనర్జీ, చిత్తూరు జిల్లా ఎలకటూరు వద్ద అమ్యప్పర్ టెక్స్టైల్, తిరుపతి జిల్లా తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్, పులివెందుల వద్ద ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్, బద్వేల్ వద్ద సెంచురూ ప్యానల్స్, కొప్పర్తి వద్ద కాసిస్ ఎలక్ట్రిక్ బస్సులు తయారీ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడమే కాకుండా అక్కడ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కర్నూల్ జిల్లా్ల ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు రూ.428 కోట్లతో 74 ఎంఎల్డీ నీటి సరఫరా, కొప్పర్తికి రూ.150 కోట్లతో 46 ఎంఎల్డీ నీటి సరఫరా ప్రాజెక్టులను ఏపీఐఐసీ చేపట్టంది. ఎండాకాలంలో నీటి ఎద్దటి లేకుండా కొప్పర్తి వద్ద రూ.38 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ నిక్‌డిక్ట్ సహకారంతో ఓర్వకల్లు వద్ద 4,742 ఎకరాలు, కొప్పర్తి వద్ద 2,595 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఇది కాకుండా రూ.750 కోట్లతో కొప్పర్తి వద్ద వైఎస్ఆర్ ఈఎంసీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్ ఈఎంసీలో డిక్సన్ యూనిట్లను ఏర్పాటు చేసింది. సెంచురీ ప్లై యూనిట్‌కు నీటి సరఫరా కోసం గోపవరం వద్ద రూ.45 కోట్లతో నీటి తరలిపంపు ప్రాజెక్టును అభివద్ధి చేస్తోంది. పీఎం గతిశక్తి కింద రూ.31 కోట్లతో కృష్ణపట్నం నుంచి కొప్పర్తికి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టింది. -
ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఆపండి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు/అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులన్నింటినీ నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.60 వేల కోట్లతో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదించిన 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది. కడప జిల్లాలోని గండికోటలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతిచ్చినట్టుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వీటి నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. గతంలోనే వద్దన్నాం.. ఏపీ తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల అవసరాలకని చెప్పుకుంటూ ..నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి తరలిస్తున్న జలాలను విద్యుదుత్పత్తి/పంప్డ్ స్టోరేజీ పథకాలకు వినియోగించడం సరికాదన్నారు. చిత్రావతి, గోరకల్లు రిజర్వాయర్ల వద్ద ఏపీ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు గతంలోనే అభ్యంతరం తెలిపామని, అనుమతులొచ్చే వరకు నిలుపుదల చేయాలని బోర్డుకు లేఖ సైతం రాసినట్టు గుర్తుచేశారు. ఈ రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరారు. కొత్త బ్యారేజీలనూ నిలిపివేయాలి ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు చేస్తోందని, వీటినిర్మాణం కూడా చేపట్టకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ మరో లేఖలో కృష్ణా బోర్డును కోరారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్‌లను ఏపీ సిద్ధం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను బోర్డుకు పంపించారు. -
ప్రాజెక్టులకు కొత్త కళ
బి.కొత్తకోట : అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా రెండోదశ సాగు, తాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులకు సర్వేకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తయ్యాయి. ఈ రెండింటికి పాలనాపర అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. గుర్రంకొండ మండలంలో కొత్తగా రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి స్టేజ్–1 పనులు పూర్తయ్యాయి. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల 13న జరిగే రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలపనుంది. గడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానుండగా, కుప్పం ఉపకాలువ మిగులు పనులు సత్వరమే పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కొత్త పథకాల రూపకల్పనతో ప్రాజెక్టు విస్తరణ పెరిగి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది. రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన రిజర్వాయర్ గుర్రంకొండ మండలం చెర్లోపల్లె వద్ద ప్రభుత్వం ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి తొలిదశ సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పూర్తయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలించి ఎగువతోటపల్లె వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 5 వేల ఎకరాలకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయినిచెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించి నింపుతారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.359 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. స్టేజ్–1 స్థాయి పనులు పూర్తి కావడంతో పాలనాపరమైన అనుమతి కోసం నివేదికను చీఫ్ ఇంజినీర్, ప్రభుత్వానికి పంపారు. రామసముద్రం ఉపకాలువ మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలో మీటర్ నుంచి రామసముద్రం ఉపకాలువ మొదలవుతుంది. ఇక్కడికి 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వుతారు. దీనికింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించి, ఇక్కడినుంచి తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రతిపాదన ఉంది. కాలువ సర్వే, సమగ్ర నివేదిక కోసం ప్రభు త్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ పొందిన సంస్థ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించింది. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీ టిని అందించాలన్నది లక్ష్యం. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీ వా కాలువ ద్వారా మళ్లిస్తారు. దీని సమగ్ర సర్వే, ప్రా జెక్టు నివేదిక రూపొందించడం కోసం రూ.59.22 లక్షలతో సర్వే పనులు పూర్తవగా రూ.73.43 కోట్లతో ప నులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికింద 24 చెరువులకు నీటిని అందించి 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం. త్వరలో గుడిసిబండ పనులు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందించే గుడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 1,400 ఎకరాలు చెరువులకింద, 2,600 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఈ పనులకు టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనున్నారు. రూ.21.05 కోట్లతో పనులకు ఒప్పందం జరిగింది. బాహూదాకు కృష్ణా జలాలు నిమ్మనపల్లె మండలంలోని బాహూదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. అలాగే వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. పీబీసీపై 13న ఎస్‌ఎల్‌టీసీ భేటీ పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై ఈ నెల 13న జలవనరులశాఖ రాష్ట్రస్థాయి సాంకేతిక క మిటీలో చర్చించి అమోదం తెలపనుంది. రూ.1,929 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు, సాంకేతిక అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద కిలోమీటర్ 79 నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె వద్ద 220.350 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. ఈ కాలువ 140.75 కిలోమీటర్లు ఉండగా కుడివైపున కాలువను 4.8 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కాలువ సామర్థ్యం ప్రకారం ఒక్కో పంపు 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. కాలువలో 1,180 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించేలా నిర్మాణాలు చేపడతారు. వేగంగా చర్యలు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పూర్తికి వేగంగా చర్యలు చేపట్టాం. రెడ్డెమ్మకోన రిజర్వాయర్, రామసముద్రం కాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి పాలనాపర ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాం. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై కమిటీ నిర్ణయం తర్వాత చర్యలు వేగవంతం అవుతాయి. కొత్త పథకాలకు రూపకల్పన చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాం. – రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు కుప్పంకు కొత్త కాంట్రాక్టర్ గత టీడీపీ హయాంలో కుప్పం ఉపకాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అందినంత దోచుకొని 2019 నుంచి పనులను నిలిపివేసింది. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఖాతరుచేయలేదు. మిగిలిపోయిన రూ.117.18 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తొలగించారు. ఇదే విలువకు పనులు చేపట్టాలని పలు కాంట్రాక్ట్ సంస్థలను ప్రభుత్వం కోరగా హైదరాబాద్‌కు చెందిన నాలుగైదు నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ కంపెనీల సాంకేతిక అధికారులు ప్రస్తుతం కుప్పం కాలువలో మిగిలిన పనులను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక మిగులుపని విలువతో పనులు చేసేందుకు ముందుకొస్తే టెండర్లు లేకుండా అప్పగించేందుకు నిర్ణయిస్తారు. లేనిపక్షంలో ప్రస్తుత నిర్మాణ ధరల ప్రకారం అంచనావేసి టెండర్లను ఆహ్వానించనున్నారు. -
భూ సేకరణ పనులు శరవేగం
సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ శరవేగంగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ, భూ సేకరణ స్పెషల్ కలెక్టర్లతోపాటు ఆయా ప్రాజెక్టుల పరిధిలోని ఎస్ఈలతో ఎప్పటికప్పుడు భూ సేకరణపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో భూ సేకరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. మొత్తం తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో 10 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఆరు వేల ఎకరాల పరిధిలో డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మిగిలిన భూమి సర్వే దశలో ఉంది. మూడు, నాలుగు నెలల్లోనే భూ సేకరణ తంతు పూర్తి కానుంది. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రూ. 1357 కోట్లతో రాజోలి రిజర్వాయర్, రూ. 852.59 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె చెరువులను విస్తరించి వాటి పరిధిలోని పలు చెరువుల ద్వారా‡ వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు రూ. 45.49 కోట్లతో అలవలపాడు లిఫ్ట్ స్కీమ్, రూ. 1100 కోట్లతో పీబీసీ, జీకేఎల్ఐల పరిధిలోని పులివెందుల నియోజకవర్గంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ. 3050 కోట్లతో గండికోట, సీబీఆర్ లిఫ్ట్ అలాగే గండికోట, పైడిపాలెం లిఫ్ట్ పనులు రూ. 1182 కోట్లతో జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనులను చేపట్టారు. ఇది కాకుండా రూ. 50 కోట్ల నిధులతో బ్రహ్మంసాగర్ పరిధిలోని ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులు, తెలుగుగంగ పరిధిలోని ఎస్ఆర్–1లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన పనులను పూర్తి చేయనున్నారు. 810,245.02 ఎకరాల భూ సేకరణ తొమ్మిది సాగునీటి వనరుల పరిధిలో మొత్తం 10,245.02 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 6076.02 ఎకరాల భూమికి డిక్లరేషన్ అవార్డు అయింది. మరో 9571.38 ఎకరాలు ప్రతిపాదనల దశలో ఉండగా, 3552 ఎకరాల భూమి సర్వే దశలో ఉంది. ఇది కాకుండా వైఎస్సార్ జిల్లాలో 1080 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 390 ఎకరాలు, సత్యసాయి జిల్లాలో 72 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తికానుంది. త్వరలోనే భూ సేకరణ పూర్తి భూ సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మొత్తం 10,245.02 ఎకరాల భూమిని అన్ని ప్రాజెక్టుల పరిధిలో సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 65 శాతం మేర భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ మరో మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానుంది. – రామ్మోహన్, స్పెషల్ కలెక్టర్ (భూసేకరణ), జీఎన్ఎస్ఎస్, కడప వేగవంతంగా భూ సేకరణ జీఎన్ఎస్ఎస్ పరిధిలోని అన్ని కొత్త సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 65 శాతానికి భూ సేకరణ పూర్తయింది. మిగిలిన 35 శాతం భూ సేకరణ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, ఆయా ప్రాజెక్టుల స్పెషల్ కలెక్టర్ భూ సేకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రక్రియ మరింత వేగంగా సాగుతోంది. – మల్లికార్జునరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీరు, జీఎన్ఎస్ఎస్, కడప -
ఏది నిజం.. నీటి మీద నీతులా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు పగ్గాలు చేపట్టాక రూ.17,368 కోట్లతో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఏకంగా శ్వేతపత్రమిచ్చారు. కానీ ఐదేళ్లలో అబ్బో.. ఏకంగా రూ.55,893 కోట్లు ఖర్చుచేశారు. విచిత్రమేంటంటే ఇంత ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తికాలేదు. కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. ఎందుకంటే అదంతా కమీషన్ల కోసం పెంచిన ఖర్చు. బాబుకు ఏటీఎంలా మారటమే కాంట్రాక్టర్ల పని. కాకపోతే ఆ ‘దోపిడీ ప్రాజెక్టులన్నీ’ ‘ఈనాడు’కు అత్యద్భుతాల్లా కనిపించాయి. 17వేల కోట్లతో పూర్తవుతాయని చెప్పి.. 55వేల కోట్లు ఖర్చుచేసినా ఎందుకు పూర్తిచేయలేకపోయావని నాడు బాబును అడిగితే ఒట్టు!! ఆ లూటీని కనీసం విమర్శిస్తే ఒట్టు!. ఇప్పుడైతే ఆ పరిస్థితే లేదు. ప్రాధాన్య క్రమంలో తక్కువ ఖర్చుతో ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటిదాకా సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది రూ.18,658.93 కోట్లే అయినా.. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజీలు దాదాపుగా పూర్తయ్యాయి. 2020, 2021లో భారీ వర్షాలతో చెరువులు నిండి మట్టి తరలించలేని పరిస్థితి ఏర్పడకపోతే గతేడాదే ఇవి పూర్తయ్యేవి కూడా. గాలేరు– నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్లో మట్టిపెళ్లలు విరిగిపడ్డ చోట 300 మీటర్ల తవ్వకాన్ని పూర్తి చేయలేక గత సర్కార్ చేతులెత్తేసింది. హిమాలయాల్లో సొరంగం తవ్వే నిపుణులను రప్పించి ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తోంది. వెలిగొండ తొలి దశ రికార్డు సమయంలో పూర్తయింది. సెప్టెంబర్‌లో శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమలసాగర్‌కు నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో టన్నెల్ మార్చి నాటికి పూర్తవుతుంది. వంశధార జల వివాదాల పరిష్కారానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరుపుతూనే... మరోవైపు వంశధార ఫేజ్–2 స్టేజ్–2ను, వంశధార–నాగావళి అనుసంధాన పనులను సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు, భారీ వర్షాలు లేకుంటే అవి కూడా గతేడాదే పూర్తయ్యేవి. పెండింగ్ పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించి గండికోట, పైడిపాలెం, వామికొండ సాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరు, పులిచింతల జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసేలా వాటిని ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే రీతిలో జలయజæ్ఞం కింద చేపట్టిన మిగతా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశారు. కాకపోతే ఇవేవీ ‘ఈనాడు’కు పట్టవు. ప్రాజెక్టులకు నిధులు లేవని, బాబు మాదిరి ఎక్కువగా ఖర్చుచేయటం లేదనే వితండ వాదననే పదేపదే ప్రచారంలోకి తెస్తోంది. ఎంత ఖర్చు చేశారన్నది కాదు రామోజీ... ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారన్నదే ముఖ్యం.. అని ఎందరు చెబుతున్నా వినిపించుకోకపోవటమే ‘ఈనాడు’ శైలి. అందుకే నీటి మీద కోతలే... అంటూ నీతి తప్పిన రాతలకు పూనుకుంది మరి. నాడు జీవచ్ఛవం.. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు 2016 డిసెంబర్ వరకు అటువైపు చూడనే లేదు. దివంగత వైఎస్సార్ పూర్తి చేసిన పోలవరం కుడి కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా కమీషన్ల కోసం పట్టిసీమను పట్టుకున్నారు. 2018 జూన్‌కు పోలవరాన్ని పూర్తి చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు.. ఎడమ కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టి పోలవరాన్ని నిర్వీర్యం చేశారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలపై రూ.4 వేల కోట్లకు పైగా తగలేసి పోలవరానికి సమాధి కట్టారు. స్పిల్ వేను కూడా పూర్తి చేయకుండా, నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా చేపట్టిన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను మధ్యలోనే వదిలేసి జీవనాడి లాంటి పోలవరాన్ని జీవచ్ఛవంగా మార్చారు. నేడు జీవనాడి.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పోలవరాన్ని ప్రణాళికా బద్ధంగా పూర్తిచేసే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో 48 గేట్లతో సహా స్పిల్ వేను పూర్తి చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే గతేడాది జూన్ 11న స్పిల్ వే మీదుగా గోదావరిని మళ్లించారు. గత సర్కారు పనులను మధ్యలోనే వదిలేయడంతో మూడేళ్లుగా వరద ఉద్ధృతికి ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతం, దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాలను పూడ్చటం పెద్ద సవాల్‌గా మారింది. లేదంటే 2021కే పోలవరం పూర్తయ్యేది కూడా. జగన్ చొరవ తీసుకుని నేరుగా కేంద్ర మంత్రి షెకావత్‌తో చర్చించడంతో దిగువ కాఫర్ డ్యామ్ డిజైన్‌ను కేంద్ర జలసంఘం ఆమోదించింది. ఫలితంగా పనులకు ఊపొచ్చింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈనెల 22, 23వతేదీల్లో జల్ శక్తి శాఖ సలహాదారు నేతృత్వంలో నిపుణుల బృందం పోలవరానికి వస్తోంది. ఇది సూచించిన డిజైన్లను ఖరారు చేస్తే.. తర్వాతి 14 నెలల్లోగా పోలవరాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. మరి ఇవన్నీ ఏమిటి..? నీళ్లకు నిధులివ్వకుండా కోతలు పెట్టేశారని ఆక్రోశిస్తున్న రామోజీ.. కొత్తగా ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత భూమికి నీళ్లందాయన్నది మాత్రం ఎన్నడూ రాయరు. ఎందుకంటే అది తన పాలసీకి విరుద్ధం మరి! కాకపోతే నిజాలనెవ్వరూ దాచలేరు.. సాక్ష్యాలనెవ్వరూ కాదనలేరు. అలాంటి సాక్ష్యాలు కొన్ని.. ► పులివెందుల బ్రాంచ్ కెనాల్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి కాలువ, గండికోట ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టులో 1,22,480 ఎకరాలకు సూక్ష్మనీటి పారుదల విధానంలో నీళ్లందించడానికి రూ.1,256 కోట్లతో పనులు చేపట్టారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి దశలో 70 వేల ఎకరాలకు నీళ్లందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ► శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నా వాటా జలాలను వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం తాగు, సాగునీటి కష్టాలు తీర్చేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. డీపీఆర్ తయారీకి కసరత్తు పూర్తి చేశారు. ఈ ఎత్తిపోతలపై తెలంగాణ పిటిషన్ దాఖలు చేయడంతో ఎన్జీటీ అనుమతులతో పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి 40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు అభివద్ధి చేసే పనులను రూ.570.45 కోట్లతో చేపట్టారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు 2020, 2021లో పీహెచ్ఆర్ ద్వారా 8 నెలలు నీటిని విడుదల చేశారు. పంట విరామ సమయంలో పనులు చేస్తున్నారు. ► ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని 20 వేల – 30 వేల క్యూసెక్కులకు పెంచుతూ అవుకు, గండికోట వద్ద చేపట్టిన అదనపు టన్నెళ్ల తవ్వకం పనులు వేగంగా సాగుతున్నాయి. ► ఎన్నికలకు ముందు కమీషన్ల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ పనులకు టెండర్లు పిలిచిన చంద్రబాబు సర్కార్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఇప్పుడు తొలి దశతోపాటు రెండో దశ పనులు జరుగుతున్నాయి. ► పల్నాడుకు గోదావరి జలాలను తరలించేందుకు రూ.6,020 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులు చకచకా సాగుతున్నాయి. ► చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో సాగు, తాగునీటి కష్టాలను కడతేర్చేందుకు రూ.2,145 కోట్లతో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులను ప్రభుత్వం చేపట్టగా చంద్రబాబు తన పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసులు దాఖలు చేసి అడ్డుకుంటున్నారు. మూడు రెట్లకుపైగా నిధుల మేత! పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామని 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాడు చంద్రబాబు ప్రకటించారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు రూ.55,893.71 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు వ్యయం చేసిన సుమారు రూ.పది వేల కోట్లను మినహాయించినా జలయజ్ఞం ప్రాజెక్టులపై రూ.45 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో ప్రకటించిన దాని కంటే రూ.28 వేల కోట్లను అధికంగా ధారపోసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లను ఇవ్వలేకపోయారు. కమీషన్లు ఇవ్వని కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి అంచనా వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. వాటిని అడిగినంత కమీషన్ చెల్లించే కాంట్రాక్టర్లకు అప్పగించి ఖజానాను దోచుకున్నారు. అందుకే రూ.55,893.71 కోట్లు వెచ్చించినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ బాబు హయాంలో పూర్తి కాలేదని రామోజీ తప్ప ఎవరినడిగినా చెబుతారు. ఉపాధి హామీ పథకం నుంచి రూ.12,214.33 కోట్లు, అటవీ శాఖ నుంచి రూ.185.90 కోట్లు వెరసి రూ.12,400.23 కోట్లను నీరు–చెట్టు కింద చేసిన ఖర్చంతా టీడీపీ నేతల జేబుల్లోకే పోయిందన్నది ‘ఈనాడు’కు తప్ప అందరికీ తెలిసిన రహస్యం. -
నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
తిరుపతి ఎడ్యుకేషన్: రాయలసీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కోరారు. తిరుపతికి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని సోమవారం ఆయన కలిశారు. సీమ నీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి కేటాయించిన కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని సహజ న్యాయ సూత్రాలకు లోబడి విశాఖలో కాకుండా రాయలసీమలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం పూడిక వల్ల 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. వరదల సమయంలో నీటిని సరఫరా చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు తీగల వంతెన స్థానంలో సిద్ధేశ్వరం అలుగు చేపట్టేలా కేంద్రంతో సంప్రదింపులు చేయాలని కోరారు. పోతిరెడ్డిపాడు వెడల్పు, కాల్వల సామర్థ్యం పెంపు వంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కుందూ నదిపై ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, తుంగభద్ర నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు గుండ్రేవుల నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిస్తూ సీఎం దృష్టికి తీసుకెళతానని సజ్జల హామీ ఇచ్చారు. -
Andhra Pradesh: ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్న దానిపై లెక్కలు తీయాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో కమిటీ ఏర్పాటు చేశాం. ► ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ చైర్మన్‌గా ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారు. ► వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. ఇటీవలి వరదలు, కుంభవృష్టిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది. ► ఆటోమేషన్ రియల్ టైం డేటాకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించింది. ► అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ► పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పని కూడా ఈ కమిటీ చేస్తోంది. -
CM YS Jagan: నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ఇన్ ఛీఫ్‌లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఉన్నారని, తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారని వివరించారు. చదవండి: (Andhra Pradesh: పేదలకు నిశ్చింత) సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాజెక్టుల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోందన్నారు. తాజా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేస్తుందన్నారు. ఆటోమేషన్ రియల్ టైం డేటాకు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపైన కూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్ రెగ్యులేషన్‌కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అధికారులు తెలియజేశారు. వీరి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పెద్దమొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా కమిటీ చేస్తోందని కూడా అధికారులు తెలిపారు. -
హైకోర్టు, నీటిప్రాజెక్టులు రాయలసీమకు అవసరం
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్ర ప్రయోజనాల పేరిట ఇప్పటికే రెండుసార్లు రాజధానిని కోల్పోయామని, మరోసారి ఇందుకు సిద్ధంగా లేమని రాయలసీమ మేధావుల ఫోరం పేర్కొంది. రాయలసీమకు హైకోర్టు రావాలని, నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు. తిరుపతిలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో రాయలసీమ మేధావుల ఫోరం ‘అభివృద్ధి వికేంద్రీకరణ–రాయలసీమ ప్రయోజనాలు’ అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించింది. ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను ఉపసంహరించుకుని, నూతనంగా సమగ్ర అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని చెప్పారు. రాయలసీమకు ప్రయోజనాలు కలిగేలా బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలన్న అంశంపై చర్చ జరగాలని అన్నారు. అమరావతి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కూలంకష చర్చ జరగాలని తెలిపారు. అమరావతి రైతులు భూములిచ్చింది వారి ప్రయోజనాల కోసమేనని చెప్పారు. దానిని త్యాగం అంటూ, రాష్ట్రం కోసం అంటూ విచిత్ర వాదనలు తెస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం కోసం, రైతులకు ఇవ్వాల్సిన భూమి పోను మిగిలిన భూమి 10 నుంచి 15 వేల ఎకరాల దాకా ఉంటుందన్నారు. అందులో గత ప్రభుత్వం ప్రైవేటు, విదేశీ సంస్థలకు ఇచ్చినప్పుడు అభ్యంతరం తెలపలేదని, ఇప్పుడు 5 వేల ఎకరాల్లో విజయవాడ, గుంటూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. అక్కడ పేదల ఇళ్లు ఉంటే వారి ప్లాట్లకు మంచి మార్కెట్ ఉండదనే బెంగే కారణమన్నారు. తీవ్ర కరువు, నీటి సమస్యతో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు నేడు కావాల్సింది మరో కొత్త నగరంతో కూడిన రాజధాని నిర్మాణం కాదన్నారు. ఉన్న పరిమిత వనరులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అవసరమని చెప్పారు. తిరుపతి, హిందూపురం నగరాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్వీయూ విశ్రాంత ప్రొఫెసర్ జి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పాలన సాగిస్తోందని, అలాంటి సమయంలో అన్ని వ్యవస్థలు ఒకేచోట ఉండాలని కోరుకోవడం సరికాదని అన్నారు. అమరావతి కేంద్రంగా కేంద్రీకృత అభివృద్ది జరిగితే మరో విభజన తప్పదని హెచ్చరించారు. అధ్యాపకులు సుబ్రమణ్యం ఆచారి, హిమబిందు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రబీకి నిండుగా నీరు
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుగా ఉన్నాయి. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్ పంటలకు పూర్తిస్థాయిలో నీరందించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీకి కూడా నీరందించేందుకు సిద్ధమవుతోంది. 2019, 2020 తరహాలోనే యాజమాన్య పద్ధతుల ద్వారా నీరందించనుంది. తక్కువ నీటితో ఎక్కువ ఆయకట్టుకు ప్రయోజనం కలిగేలా జలవనరుల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార నదులు పోటీ పడి ప్రవహించాయి. వర్షాఛాయ ప్రాంతమైన పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కూడా సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ కూడా పరవళ్లు తొక్కింది. దాంతో ఖరీఫ్ పంటలకు సమృద్ధిగా నీళ్లందించారు. ఇప్పటికీ వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి. అందువల్ల రబీ పంటలకూ సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు డెల్టాలతోపాటు ఇతర ఆయకట్టులోనూ.. గోదావరి డెల్టాలో ఏటా రబీ పంటలకు నీటిని సరఫరా చేస్తారు. కృష్ణా డెల్టాలో 2019లో తొలి సారిగా రబీకి ప్రభుత్వం అధికారికంగా నీటిని విడుదల చేసింది. గతేడాది కూడా దాన్ని కొనసాగించింది. ఈ ఏడాదీ కృష్ణా డెల్టాలో రబీకి నీళ్లిచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. దీంతో పెన్నా డెల్టాలో కూడా పూర్తి స్థాయిలో రబీకి నీళ్లందించనుంది. వంశధారలో గతేడాది తరహాలోనే నీటి లభ్యత ఆధారంగా ఈ ఏడాదీ సాగు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టింది. తుంగభద్రలోనూ వరద కొనసాగుతుండటంతో హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ) ఆయకట్టులో నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. నీటితో కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీ అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టులోనూ నీటి విడుదల వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్, రబీల్లో 2019, 2020లలో కోటి ఎకరాల చొప్పున ఆయకట్టుకు నీళ్లందించాం. ఈ ఏడాదీ అదే రీతిలో ఖరీఫ్‌లో నీళ్లందించాం. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. రబీలోనూ అధిక ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు రబీలో అవకాశం ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, జలవనరుల శాఖ ఈఎన్సీ -
ప్రాజెక్టుల పరిశీలనకు కృష్ణా, గోదావరి బోర్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల స్వాధీనంపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. ప్రాజెక్టుల స్వాధీనం దిశలో ఉన్న అవాంతరాలు, వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాజెక్టుల పరిధిలో పర్యటించనున్నాయి. సోమవారం నుంచి గోదావరి బోర్డు సబ్‌కమిటీ దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో పర్యటించనుండగా, కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలంలో పర్యటించనుంది. నిజానికి అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమలు కావాల్సి ఉన్నా ఇంతవరకు ప్రాజెక్టుల స్వాధీనంపై స్పష్టత లేక అనిశ్చితి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల పరిధిలో 15 ఔట్లెట్ల స్వాధీనానికి బోర్డులు తీర్మానించినా, తెలంగాణ నుంచి అంగీకారం కుదరక అడుగు ముందుకు పడటం లేదు. ఈ అనిశ్చితి కొనసాగుతుండగానే రవికుమార్ పిళ్లై, డీఎం రాయ్పురేల నేతృత్వంలోని కృష్ణా బోర్డు సబ్‌కమిటీ శ్రీశైలం పరిధిలో పర్యటించాలని నిర్ణయించింది. శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సిబ్బంది, ఆపరేషన్ ప్రొటోకాల్, వరద నియంత్రణ పద్ధతులు, ఇతర పథకాలకు నీటి అవసరాలు, వినియోగం తదితర అంశాలపై స్థానిక ఇంజనీర్లతో చర్చించనుంది. ఇక కేంద్ర జల సంఘం సీఈ అతుల్‌కుమార్ నాయక్ నేతృత్వంలోని గోదావరి బోర్డు సబ్ కమిటీ దేవాదులలోని గంగారం పంప్‌హౌస్, ఎస్సారెస్పీ పరిధిలోని కాకతీయ కెనాల్ పరిధిలోని క్రాస్ రెగ్యులేటర్‌ను పరిశీలించనుంది. షెడ్యూల్–2లో పేర్కొన్న ఈ ప్రాజెక్టులను బోర్డులు స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా, స్వాధీనం అనంతరం ఉండే పరిస్థితులు, వాటి నిర్వహణపై కమిటీలు అధ్యయనం చేయనున్నాయి. చదవండి: Hyderabad RTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో -
‘కృష్ణా’ గేట్లన్నీ ఓపెన్
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/హుజూర్నగర్: ఎగువన ఆల్మట్టి నుంచి దిగువన పులిచింతల దాకా కృష్ణా నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. అన్ని ప్రధాన ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలోనే అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం 2009 ఏడాది తర్వాత ఇదే తొలిసారికావడం విశేషం. కృష్ణా పరవళ్లతో బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. సాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండటంతో తాగునీటి అవసరాలు తీరడంతోపాటు వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన కుండపోత వానలతో..: మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలకు గత నెలలోనే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండిపోయాయి. తర్వాత కూడా వానలు కొనసాగడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీళ్లన్నీ జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు కూడా నాలుగు రోజుల కిందటే నిండటంతో గేట్లు ఎత్తివేశారు. తాజాగా నాగార్జున సాగర్ సైతం నిండింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి నీటి నిల్వ 297 టీఎంసీలు దాటింది. ఎగువ నుంచి 4.38 లక్షల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి సాగర్‌లో 206 టీఎంసీల నిల్వ మాత్రమే ఉండగా.. ఈసారి పూర్తిగా నిండింది. 2009 తర్వాతి నుంచి చూస్తే.. ఆగస్టు తొలివారంలోనే సాగర్ గేట్లు ఎత్తడం, మొత్తం కృష్ణా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఉంచడం ఇదే తొలిసారి అని ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. 2 పంటలకు ఢోకా లేనట్టే.. సాగర్ నిండుకుండలా మారడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచే ఎడమ కాల్వ కింద సాగు అవసరాలకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు ఇప్పటికే నిండటం, అక్టోబర్ వరకు కూడా ప్రవాహాలు వచ్చే అవకాశాలు ఉండటంతో ఈసారి వానాకాలం, యాసంగి పంటల సాగుకు ఇక్కట్లు తప్పనున్నాయి. ఈ ఏడాది వానాకాలంలో సాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక తయారైంది. అంటే సుమారు 60 టీఎంసీల నీటిని 6 నుంచి 7 తడుల్లో ఇవ్వనున్నారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎమ్మార్పీ, హైదరాబాద్, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు ఇబ్బంది తప్పనుంది. -
భారీ వర్షాలతో జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు
-
Telangana: రికార్డు స్థాయిలో వర్షాలు.. 4,943 చెరువులు ఫుల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో చెరువులు నిండుతున్నాయి. ఇప్పటికే 9 వేలకు పైగా చెరువులు పొంగి పొర్లుతుండగా, మరో 7 వేల చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 19 ఇరిగేషన్ డివిజన్ల పరిధిలో మొత్తంగా 43,870 చెరువులు ఉండగా, అందులో గురువారానికే 4,698 చెరువులు అలుగు దూకాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రోజంతా వర్షాలు కురవడంతో మరో 4,943 చెరువులు నిండాయి. మొత్తంగా 9,641 చెరువులు నిండు కుండల్లా మారి పొర్లుతున్నాయి. మరో 8,476 చెరువులు ఏ క్షణమైనా నిండే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ గుర్తించింది. ములుగు, వరంగల్, ఆదిలాబాద్ డివిజన్లలో వెయ్యికిపైగా చెరువులు నిండటం విశేషం. చెరువుల కింద 22 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, ఈ వానాకాలంలోనే 20 లక్షల ఎకరాలకు నీరం దే అవకాశాలున్నాయని ఇరిగేషన్ శాఖ అంచనా. చెరువు కట్టలపై అప్రమత్తం ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20 చెరువులు పాక్షికంగా దెబ్బతిన్నాయని నీటిపారుదల శాఖకు నివేదికలు అందాయి. ముఖ్యంగా వర్షాలు అధికంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో చెరువుల కట్టలు తెగడం, బుంగలు పడటం వంటివి సంభవించాయని చెబుతున్నారు. నిర్మల్‌లో 3 చెరువుల కట్టలు పూర్తిగా తెగాయని చెబుతున్నారు. కట్టలు తెగిన చోట ఇప్పటికే తక్షణ చర్యలు మొదలయ్యాయి. ఇక ఆగస్టు వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉండటం, ఇప్పటికే చెరువులు నిండిన నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, కట్టలు, తూములు, కాల్వలపై పర్యవేక్షణ పెంచాలని శుక్రవారం జలసౌధ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు అన్ని డివిజన్ల ఇంజనీర్లను ఆదేశించారు. నిండిన మధ్యతరహా ప్రాజెక్టులు మధ్యతరహా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండుతున్నాయి. గోదావరి బేసిన్లో ఇప్పటికే 90 శాతం నిండ గా, కృష్ణాలోనూ ఇదేమాదిరి వర్షాలు కొనసాగితే ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిగా నిండనున్నాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని పెద్దవాగుకు ఏకంగా 3.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, కుమ్రంభీం ప్రాజెక్టుకు 58 వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాలు వస్తున్నాయి. ఇవన్నీ ఇప్పటికే నిం డటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వది లేస్తున్నారు. స్వర్ణకు 24 వేల క్యూసెక్కులు, సుద్ద వాగుకు 18 వేలు, శనిగరంకు 12 వేలు క్యూసెక్కుల చొప్పున ప్రవాహాలు కొనసాగుతున్నాయి. -
‘విభజన చట్టం ప్రకారమే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్’
మంగళగిరి: విభజన చట్టం ప్రకారమే నీటి ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. మంగళగిరిలోని చేనేత వస్త్ర దుకాణాలను ఆదివారం సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు రివర్ మేనేజ్మెంట్ బోర్డులు నిర్ణయాలు చేసే ముందు ట్రిబ్యునల్ ప్రతిపాదనకు అనుగుణంగానే పనిచేస్తాయన్నారు. ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం అన్నది అభూతకల్పనేనన్నారు. నీటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, పార్టీలు రాజకీయ కారణాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని, కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కొత్త ప్రాజెక్టుల అనుమతులు కోసం అయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు కావాలన్నా రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జలశక్తి మంత్రి చర్చించుకుని అనుమతులు పొందొచ్చని జీవీఎల్ వివరించారు. -
జల వివాదం: పర్మిషన్ లేకుంటే ప్రాజెక్టుల మూత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు కల్వకుర్తి ఎత్తిపోతల కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ డిండి ఎత్తిపోతల ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు భక్త రామదాస ఎత్తిపోతల తుమ్మిళ్ల ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు (వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు తెలుగు గంగ వెలిగొండ హంద్రీ-నీవా గాలేరు-నగరి ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్ధాపురం ఎత్తిపోతల గురు రాఘవేంద్ర (ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు మున్నేరు పునర్ నిర్మాణం గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు కంతనపల్లి బ్యారేజీ కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు రామప్ప- పాకాల మళ్లింపు తుపాకులగూడెం బ్యారేజీ మోదికుంటవాగు ప్రాజెక్టు చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కందుకుర్తి ఎత్తిపోతల బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత గూడెం ఎత్తిపోతల ముక్తేశ్వర్ ఎత్తిపోతల సీతారామ ఎత్తిపోతల (రాజీవ్ దుమ్ముగూడెం) పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల చింతలపూడి ఎత్తిపోతల వెంకటనగరం ఎత్తిపోతల -
కీలక ప్రాజెక్టులన్నీ బోర్డుల ఆధీనంలోకి..
సాక్షి, హైదరాబాద్: గెజిట్ నోటిఫికేషన్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను 3 షెడ్యూళ్లుగా విభజించారు. రెండు రాష్ట్రాల్లో ఈ నదులు, ఉప నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను మొదటి షెడ్యూల్లో ప్రస్తావించారు. మొత్తంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులను షెడ్యూల్-2లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రతి అంశంపై బోర్డులకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ప్రాజెక్టులు, కాల్వల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్ సహా అన్నింటినీ బోర్డులు తమ ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ బాధ్యతలు చేపడతాయి. ఆ ప్రాజెక్టుల్లోని రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ సహా ఉద్యోగులంతా బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తారు. బోర్డులు ప్రాజెక్టులను తమ స్వాధీనంలోకి తీసుకున్నా.. గెజిట్ వచ్చేనాటికి ఉన్న కేసులు, అప్పటికే జరిగిన విషయాలపై భవిష్యత్‌లో దాఖలయ్యే కేసులకు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. షెడ్యూల్ -3లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను రెండు రాష్ట్రాలు తీసుకోవాలి. కృష్ణా బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీశైలం రిజర్వాయర్, దానిపై ఆధారపడిన ప్రాజెక్టులు.. స్పిల్‌వే, ఎడమ, కుడిగట్టు విద్యుత్ కేంద్రాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ కెనాల్, ఎస్ఆర్బీసీ, వెలిగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, తెలుగుగంగ, వెలిగొండ, ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి, హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, ముచ్చుమర్రి, జీఎన్ఎస్ఎస్ నాగార్జున సాగర్ పరిధిలో.. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, కుడి, ఎడమ కాల్వలు, ఇతర బ్రాంచ్ కెనాల్లు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి సరఫరా, సాగర్ టెయిల్ పాండ్. తుంగభద్ర, దాని పరిధిలోని హై లెవల్, లో లెవల్ కెనాల్లు, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, కేసీ కెనాల్, సుంకేశుల ఎగువ కృష్ణాలో.. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, పులిచింతల రిజర్వాయర్, విద్యుత్ కేంద్రం, మున్నేరు ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు నీటిని మళ్లించే పథకాలు (కాళేశ్వరంలోని కొండపోచమ్మసాగర్ నుంచి శామీర్‌పేటకు నీటిని తరలించే కాల్వ, గంధమల రిజర్వాయర్, దేవాదులలోని దుబ్బవాగు - పాకాల ఇన్‌ఫాల్ రెగ్యులేటర్, సీతారామలోని మూడో పంపుహౌస్, ఎస్సారెస్పీ స్టేజ్ -2లోని మైలవరం రిజర్వాయర్ వేంపాడు, బుడమేరు మళ్లింపు పథకం, పోలవరం ఆర్ఎంసీ-ఎన్ఎస్-ఎల్ఎంసీ లింకు, పోలవరం–కృష్ణాలింకు,కృష్ణాడెల్టా,గుంటూరు కెనాల్. గోదావరి బోర్డు అధీనంలో ఉండే ప్రాజెక్టులు శ్రీరాంసాగర్ స్టేజ్–1, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు, చొక్కారావు ఎత్తిపోతలు, తుపాకుల గూడెం బ్యారేజీ, ముక్తేశ్వర్ ఎత్తిపోతలు, సీతారామ లిఫ్టు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు, సీలేరు విద్యుత్ కాంప్లెక్స్. పెద్దవాగు రిజర్వాయర్ స్కీం, పోలవరం ప్రాజెక్టు, కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల తరలింపు ప్రాజెక్టు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా కృష్ణాకు గోదావరి నీళ్ల తరలింపు. పోలవరం 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతలు, తాడిపూడి ఎత్తిపోతలు, పట్టిసీమ, పురుషోత్తమపట్నం లిఫ్టు, సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్. తొర్రిగడ్డ, చింతలపూడి, చాగలనాడు, వెంకటనగరం ఎత్తిపోతలు. -
చుక్క నీటినీ వదులుకోం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ తనయ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరితోనైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. న్యాయవాది నుంచి దేశ ప్రధాని స్థాయికి అంచలంచెలుగా ఎదిగిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని పీవీ జీవితం నేటి సమాజానికి మార్గదర్శకమని సోమవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: ‘హైదరాబాద్‌లోని ఆంధ్రా ప్రజలు ప్రశ్నించాలి’ అంతా మాఇష్టం.. రూ.137.46 కోట్ల నిధులు ‘నీళ్ల ’పాలు.. -
కొత్త ప్రాజెక్టులపై సర్వే.. ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ ఆదేశాల మేరకు కొత్త ప్రాజెక్టుల సర్వేకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదముందని కేబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తాగునీటికీ ఇక్కట్లు తప్పవని సమావేశంలో పేర్కొన్నారు. ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు చేరకముందే మళ్లించేలా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. కొత్త ప్రాజెక్టుల సర్వేకు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఆదేశించిన పనులు ఇవే.. ►శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్‌లో జోగుళాంబ బ్యారేజీ నిర్మించి 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేస్తారు. ►భీమా నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ తరలించేలా నారాయణపేట జిల్లా కుసుమర్తి గ్రామం నుంచి వరద కాలువ తవ్వుతారు. ఈ కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు పరిధిలోని గోపాలదిన్నె రిజర్వాయర్ వరకు చెరువులు, రిజర్వాయర్లు నింపుతారు. ►ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల గ్యాప్ ఆయకట్టుకు నీళ్లివ్వడానికి సుంకేశుల బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో కొత్త ఎత్తిపోతల పథకం చేపడతారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు దీని ద్వారా నీళ్లిస్తారు. ►కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తారు. ►పులిచింతల డ్యాం ఫోర్‌షోర్‌లో ఎత్తిపోతల పథకం చేపట్టి నల్లగొండ జిల్లాలోని అప్ల్యాండ్ ప్రాంతాల్లో గల 2 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారు. ►నాగార్జునసాగర్ టెయిల్ పాండ్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి కాల్వ చివరి, ఎగువ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లిస్తారు. -
కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌ల నిర్మాణం: మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి : కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు సరికాదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటున్నాం. తెలంగాణలో అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారు. రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉంది. ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్ ముందుంటారు. అలానే ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదు. 840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదు. వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తాం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారు. ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే మనిషి వైఎస్ జగన్. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయి. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాం’’ అని అన్నారు. -
వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు) ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు) కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
బ్రహ్మపుత్రపై భారత్ రిజర్వాయర్
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. యర్లుంగ్ త్సంగ్ బో(బ్రహ్మపుత్ర) నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని జల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నదీ జల వివాదాలు కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. -
కుళాయి కనెక్షన్లకు రూ. 4,800 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహాలో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే నిమిత్తం నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. రూ. 4,800.59 కోట్ల విడుదలకు అనుమతి తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 91,40,605 ఇళ్లు ఉండగా అందులో 33,88,160 ఇళ్లకు ఇప్పటికే కుళాయి కనెక్షన్లు ఉన్నట్టు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తెలిపారు. మిగిలిన 57,52,445 ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.10,975 కోట్లతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జలజీవన మిషన్ పథకంలో భాగంగా 50% నిధులను కేంద్రం రాష్ట్రానికి ఇస్తుంది. ఈ పథకం తొలి దశలో రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.4,800.59 కోట్లకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, అందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల నుంచి 55 లీటర్ల మధ్య వినియోగానికి వీలుగా మంచినీటి పథకాలు నిర్మితమైన చోట ఈ తొలి దశలో కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి రోజూ 43.5 లీటర్ల కంటే తక్కువ పరిమాణంలో నీటి సరఫరా ఉన్న చోట, ఆయా గ్రామాల్లోనూ మంచినీటి పథకాల సామర్థ్యం పెంచి రెండో దశలో ఆ గ్రామాల పరిధిలో ఉన్న మిగిలిన 25.52 లక్షల ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
నిండుకుండల్లా.. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు, ఉప నదులు, వాగులు, వంకలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా జలకళకు నోచుకోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలతో ఆదివారం నాటికి సగటున 539 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 27.9 శాతం అధికంగా అంటే.. 689.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా మిగిలిన పది జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం చోటు చేసుకుంది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 28.1 శాతం తక్కువ వర్షం కురిసింది. ► ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే 45.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో 3.86 టీఎంసీలకుగానూ 3.50 టీఎంసీలను నిల్వ చేసి.. వరద కొనసాగుతుండటంతో 22,311 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కంభం చెరువు నిండుకుండలా మారింది. ► రెయిన్‌షాడో ప్రాంతమైన పెన్నా బేసిన్లో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో పెన్నా, చెయ్యేరు, పాపాఘ్ని, కుందూ ఉరకలెత్తుతున్నాయి. చెయ్యేరు ఉధృతితో వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు కాగా ఇప్పుడు 2.20 టీఎంసీల నీరు ఉంది. పాపాఘ్ని పరవళ్లతో వెలిగల్లు ప్రాజెక్టులో నీటి నిల్వ 4.64 టీఎంసీలకుగానూ 2.43 టీఎంసీలకు చేరుకుంది. ► అనంతపురం జిల్లాలో సాధారణం కంటే 67 శాతం అధిక వర్షపాతం నమోదైంది. పెన్నా పరవళ్లుతో చాగల్లు, పెండేకళ్లు రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ► కర్నూలు జిల్లాలో హంద్రీ నది ఉప్పొంగుతోంది. దశాబ్దాలుగా నిండని గాజులదిన్నె ప్రాజెక్టుకు ఈ ఏడాది మూడు దఫాలుగా వరద రావడంతో గేట్లు ఎత్తేయాల్సి వచ్చింది. ► పెన్నా ఉధృతికి నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిండిపోయింది. కండలేరు నిండుకుండలా మారింది. కనిగిరి రిజర్వాయర్‌లోకి 3.45 టీఎంసీలకుగానూ 1.59, సర్వేపల్లి రిజర్వాయర్‌లోకి 1.74 టీఎంసీలకుగానూ 1.04 టీఎంసీలు చేరాయి. ► తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌లో 24.1 టీఎంసీలకుగానూ 22.72 టీఎంసీలను నిల్వ చేశారు. ప్రాజెక్టులోకి 8,540 క్యూసెక్కులు చేరుతుండటంతో గేట్లు ఎత్తి 9,060 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ► విశాఖ జిల్లాలో తాండవ, వరాహ నదులు ఉరకలెత్తుతున్నాయి. తాండవ ప్రాజెక్టు నిండిపోయింది. రైవాడ రిజర్వాయర్‌లో 3.60 టీఎంసీలకుగానూ నీటి నిల్వ 3.02 టీఎంసీలకు చేరింది. వరాహ, కోనం తదితర ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. ► నాగావళి పరవళ్లతో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టు గేట్లను జూన్ 11న ఎత్తేశారు. ఆ రోజు నుంచి గేట్లను దించలేదు. పెద్దగెడ్డ, వెంగళ్రాయసాగరం ప్రాజెక్టులు జలకళతో ఉట్టిపడుతున్నాయి. ► శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, సువర్ణముఖి తదితర నదులు ఉరకలెత్తుతున్నాయి. -
నదుల ఉరకలు..పోటెత్తిన ప్రాజెక్టులు
సాక్షి,హైదరాబాద్: నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలతో పాటు ప్రధాన నదులన్నీ ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్ల ఎగువ రాష్ట్రాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆయా ప్రాజెక్టుల్లోకి ఉధృతంగా ప్రవాహాలు పోటెత్తు తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతుండగా, ఆల్మట్టి, నారాయణ పూర్‌కు భారీగా వరద పెరిగింది. ఇక్కడకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మరోపక్క గోదావరి ప్రాజెక్టుల్లోనూ ప్రవా హాలు పుంజుకున్నాయి. ప్రాణహిత మహో గ్రరూపం దాల్చుతోంది. (ఊళ్లన్నీ జలదిగ్బంధం) ఎగువన మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పరీవాహకంలో కురుస్తున్న వానలు తోడవడంతో రికార్డు స్థాయి వరదతో పోటెత్తుతోంది. ప్రాణహిత నది మహోగ్ర రూపంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏకంగా నీటి ప్రవాహాలు 9.87 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతున్నాయి. వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ఏకంగా రోజుకు సుమారు 90 టీఎంసీల మేర నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోగా, భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలు కానున్నాయి. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ తొణికిసలాడుతుండగా, చెరువులన్నీ అలుగుపోస్తున్నాయి. ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. ఎస్సారెస్పీకి పెరిగిన వరద గోదావరి బేసిన్లో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. పరివాహకం నుంచి వస్తున్న నీటితో 46 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. దీంతో నిల్వ 90 టీఎంసీలకుగాను 44.95 టీఎంసీలకు చేరింది. దీంతో పాటే లోయర్ మానేరు, మిడ్‌మానేరు, ఎల్లంపల్లికి ప్రవాహాలు పెరగడంతో అవి ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయి మట్టాలకు చేరుకోనున్నాయి. వరంగల్‌లో వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిండుకుండల్లా మధ్యతరహా ప్రాజెక్టులు ప్రధాన నదులన్నీ ఉప్పొంగుతుండటంతో మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళతో ఉట్టిప డుతున్నాయి. గోదావరి బేసిన్‌లోని 28, కృష్ణా బేసిన్‌లోని 8 ప్రాజెక్టులు పూర్తి నిల్వలతో తొణికిసలాడుతున్నాయి. మొత్తం ఈ 36 ప్రాజెక్టుల నీటి నిల్వల సామర్థ్యం 62 టీఎంసీల మేర ఉండగా, 51.28 టీఎంసీల నిల్వలు చేరుకున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు 1.39 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలేస్తు న్నారు. ఇదే జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం 40 వేల ప్రవాహం వస్తుండగా, మహబూబాబాద్‌లోని బయ్యారం ట్యాంక్‌కు 35,590 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాలోని వైరాకు 8,200, వరంగల్ రూరల్‌లోని పాకాల లేక్‌కు 8,402, ములుగు జిల్లాలోని పాలెంవాగుకు 12,452 క్యూసెక్కులు, రామప్ప లేక్‌కు 5,775, లక్నవరం లేక్‌కు 5,300 క్యూసెక్కుల మేర భారీ ప్రవాహాలు వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీమ్, వట్టివాగు ప్రాజెక్టులు సైతం ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో నిండనున్నాయి. (అప్రమత్తంగా ఉండండి: డీజీపీ) ప్రాణహిత మహోగ్రరూపం ఎగువ ప్రవాహాలతో మేడిగడ్డ వద్ద ప్రాణహిత ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. మూడ్రోజుల కిందట మేడిగడ్డ వద్ద 3.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండగా, శనివారం 3.48 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అయితే, రెండ్రోజులుగా పరీవాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉదయానికి ఏకంగా 7.50 లక్షల క్యూసెక్కులకు, సాయంత్రానికి మరింత పెరిగి 9.87 లక్షల క్యూసెక్కులకు చేరింది. ఇది దాదాపు 90 టీఎంసీలకు సమానం. మేడిగడ్డ బ్యారేజీలో ఇప్పటికే 16.17 టీఎంసీలకు 9.87 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో బ్యారేజీ 65 గేట్లెత్తి అంతే నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని పంపులను ఆపేయగా, అన్నారం బ్యారేజీకి సైతం మానేరు వాగు నుంచి ప్రవాహాలు పెరగడంతో అక్కడి పంప్‌హౌస్ మోటార్లను నిలిపివేశారు. ఈ బ్యారేజీకి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు 40 గేట్లెత్తి దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం అన్నారంలో నీటి నిల్వ 10.87 టీఎంసీలకుగాను 4 టీఎంసీల నిల్వ ఉంది. సుందిళ్ల బ్యారేజీలో 8.83 టీఎంసీలకు 6.42 టీఎంసీల నిల్వ ఉండగా, 6,208 క్యూసెక్కుల నీరు స్థానిక వాగుల నుంచి వస్తోంది. ఇక్కడి పంప్‌హౌస్ మోటార్లను నిలిపివేశారు. ఇప్పటివరకు జూన్‌లో మొదలైన సీజన్ నుంచి ఇంతవరకు మేడిగడ్డ నుంచి ఏకంగా 365 టీఎంసీల మేర నీరు దిగువకు వెళ్లిపోయిందని ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి. 11 సంవత్సరాల తర్వాత వనపర్తి జిల్లా సరళాసాగర్లోని సైఫన్ల ద్వారా దిగువకు వెళ్తున్న వరద పోటెత్తుతున్న కృష్ణా కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఇప్పటికే భారీ, మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులన్నీ నిండిపోవటంతో స్థానిక పరీవాహకం నుంచి ఆల్మట్టిలోకి భారీ ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి 1.16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా, 1.80లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఈ నీరంతా నారాయణపూర్ వస్తుండటంతో అక్కడి నుంచి 2.37 లక్షల క్యూసెక్కులు నదిలోకి వదిలేశారు. ఈ నీరంతా జూరాలకు చేరుతోంది. జూరాలకు ప్రస్తుతం 1.03 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, సోమవారానికి మరింత పెరగనుంది. ప్రాజెక్టులో నీటి నిల్వ, ఎగువ ప్రవాహాల దృష్ట్యా 1.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి వదిలారు. శ్రీశైలానికి ప్రస్తుతం 1.31 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీనికి తోడు ఎగువన ఉన్న తుంగభద్రలోకి 33,256 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ఈ నీరంతా దిగువ శ్రీశైలానికి రానుంది. శ్రీశైలంలో ప్రస్తుతం 215 టీఎంసీలకుగాను 144.80 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి 42 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా వదులుతుండటంతో నాగార్జునసాగర్‌లోకి 42 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్‌లో నిల్వ 312 టీఎంసీలకుగాను 250 టీఎంసీలకు చేరింది. -
ప్రాజెక్టుల వ్యయాలు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులకు బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్‌తోపాటు పర్యావరణ అనుమతుల వివరాలను కోరింది. తాజాగా తెలంగాణలో రెండు నదీ బేసిన్లలోని కొత్త, పాత ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, సవరించిన అంచనాలు, చేసిన ఖర్చు వివరాలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీలైనంత త్వరగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అపెక్స్‌కు ముందే అన్నీ సేకరణ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు మొదలైన అనంతరం ప్రాజెక్టుల వివరాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కృష్ణా, గోదావరిపై అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని బోర్డులు గతంలోనే రాష్ట్రాన్ని ఆదేశించగా ఇటీవలే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం లేఖ రాశారు. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ 2018 జూన్‌లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది. కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు మొదలు పెట్టిందని, దీనికి ఆమోదం లేదనే విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది. ఈ ఏడు ప్రాజెక్టులతోపాటే కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, భక్త రామదాస వంటి ప్రాజెక్టుల్లో ఎన్నింటికి పర్యావరణ అనుమతులు ఉన్నాయో డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొత్తగా రెండు నదీ బేసిన్లలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఆ సమయంలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, తర్వాత సవరించిన అంచనాలు, ఇందులో ఇంతవరకు చేసిన ఖర్చు వివరాలను తమకు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. ఇప్పటికే తమ వద్ద అంచనాల వివరాలను పేర్కొన్న కేంద్రం... ఇందులో కాళేశ్వరం అంచనా వ్యయం రూ. 80,150 కోట్లు, పాలమూరు–రంగారెడ్డి అంచనా వ్యయం రూ. 35,200 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులతోపాటు దేవాదుల, సీతారామ వంటి పథకాలపై కొత్త అంచనా వ్యయాలను అధికారికంగా ధ్రువీకరించేందుకే కేంద్రం అంచనా వ్యయాల వివరాలు కోరిందన్న చర్చ జలవనరుల శాఖ వర్గాల్లో జరుగుతోంది. -
అవి ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తాము చేపట్టిన ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పూర్తి చేశామని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలిపింది. శనివారం ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీకి లెటర్ రాశారు. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి రివర్ లిఫ్టు స్కీములు మాత్రమే రాష్ట్ర విభజన తర్వాత చేపట్టామని, వాటి డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని తెలిపింది. ఆ డీపీఆర్‌లు రెడీ అయ్యాక బోర్డుకు సమర్పిస్తామని పేర్కొంది. గురురాఘవేంద్ర, సిద్ధాపురం, శివభాష్యం లిఫ్ట్ స్కీములు, మున్నేరు స్కీం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్మాణం పూర్తయ్యాయని తెలిపారు. ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీం సైతం రాష్ట్ర విభజనకు ముందే కంప్లీట్ చేశామని, అవేవీ కొత్త ప్రాజెక్టులు కానేకావని పేర్కొన్నారు. కేఆర్ఎంబీ 12వ మీటింగ్‌లో ఏపీ స్పెషల్ సీఎస్ ఆ ప్రాజెక్టులన్నీ విభజనకు ముందు చేపట్టినవేనని వివరించారన్నారు. వీటి డీపీఆర్‌ల విషయంలో ఇంకా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదని, వాటిని కొత్త ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగించాలని తేల్చి చెప్పారు. డీపీఆర్‌లు రెడీ కాలేదు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమ ప్రభుత్వం కొత్తగా గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి (హగరి) నది లిఫ్ట్ స్కీములను మాత్రమే చేపట్టిందని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇంకా సిద్ధం కాలేదని, డీపీఆర్‌లు రెడీ అయ్యాక కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం కోసం బోర్డుకు సమర్పిస్తామని తెలిపారు. -
‘అమృత్’ పనులు వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: ‘అమృత్’ పథకం కింద రూ.3,762 కోట్లతో రాష్ట్రంలోని ఆయా మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పురపాలక శాఖను ఆదేశించారు. ఆర్థికంగా బలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు సమకూర్చడంలో ఉన్న ఇబ్బందులను తొలగించాలని.. అందుకు రూ.800 కోట్ల లోటును భర్తీ చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని, ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. పురపాలక శాఖలో అభివృద్ధి పనులపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► విజయవాడ, గుంటూరులలో చేపట్టిన డ్రైనేజీ పనులను సత్వరం పూర్తిచేయాలి. ► విశాఖపట్నానికి నిరంతరం తాగునీటి సరఫరా కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. ► స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద విశాఖ, కాకినాడ, తిరుపతిలో రూ.4,578 కోట్లతో చేపడుతున్న పనులను సత్వరం పూర్తి చేయాలి. ► ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ఆర్థిక సహాయంతో లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్న 50 పట్టణాల్లో తాగునీటి సరఫరాకు రూ.5,212 కోట్లతో చేపట్టిన పనులపై దృష్టి సారించాలి. ఈ పట్టణాలకు వెళ్లే దారిలోని 111 గ్రామాలకూ తాగునీరు అందించాలి. ► ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి జూలై 8న లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధంకావాలి. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరగా సిద్ధంచేయాలి. ► లక్ష జనాభా దాటిన పట్టణాల్లో రూ.10,666 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సన్నద్ధం కావాలి. మోడల్ మున్సిపాలిటీలుగా తాడేపల్లి, మంగళగిరి గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను మోడల్ మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేసే అంశంపై కూడా సీఎం వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. ఆయన ఏమన్నారంటే.. ► రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు రూపొందించాలి. ► 100 శాతం తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించేందుకు ప్రతిపాదనలు రూపొందించండి. ► పాఠశాలల అభివృద్ధి కోసం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో చేపట్టిన పనుల కన్నా మరింత ఆధునిక వసతులు సమకూర్చేలా ప్రతిపాదనలు తయారుచేయండి. ► జనాభా ప్రాతిపదికన నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలి. ► పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ఉండాలి. ► మంగళగిరిలో చేనేతలకు కాంప్లెక్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సమగ్ర కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి జూన్ నాటికి పరిపాలనా అనుమతులివ్వాలి. ► మంగళగిరి ఆలయ అభివృద్ధి పనులు, మాడ వీధుల పునర్నిర్మాణం.. బకింగ్‌హామ్ కాలువ అభివృద్ధి, కాల్వల సుందరీకరణ, జంక్షన్ల అభివృద్ధిపై కూడా సీఎం చర్చించారు. ఈ సమావేశంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పచ్చ’బొట్టుకు లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: నీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.లక్ష కోట్లు. ఇంకా చేయాల్సిన ఖర్చు కూడా సుమారు అంతే.. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీటివనరులన్నింటినీ వినియోగించుకుని కోటీ 24 లక్షల ఎకరాల ఆయకట్టే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తే మరో 54 లక్షల ఎకరాలకు నీరందుతుంది. అప్పుడే పూర్తిస్థాయి ఆయకట్టు లక్ష్యాలను చేరుకుంటుంది. ఇప్పటివరకు చేసిన ఖర్చులో 30 శాతం మేర రుణాలే. రుణాలే కీలకం.. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రం హక్కుగా కలిగిన నికర, మిగులు జలాల్లోని నిరీ్ణతవాటాలను సంపూర్ణంగా వినియోగంలోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి వంటి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. వీటితోపాటే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. రూ.2.27 లక్షల కోట్ల వ్యయ అంచనాతో ప్రాజెక్టులను చేపట్టగా, ఇందులో ఇప్పటి వరకు రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరో రూ.7,518 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐదేళ్ల కాలంలో చేసిన ఖర్చే రూ.1.04 లక్షల కోట్ల వరకు ఉంది. ఈ మొత్తంలో రుణాల ద్వారా చేసిన ఖర్చు రూ.28,652 కోట్ల మేర ఉంది. అందులోనూ అధికంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.25 వేల కోట్లు వెచ్చించారు. 2018–19 ఆర్థిక సంవ త్సరంలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.37 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా, ఇందులో రుణాలు రూ.17,194 కోట్లు. ఈ ఏడాదిలో రూ.8,476 కోట్ల బడ్జెట్ కేటాయించగా, రుణాల ద్వారా మరో రూ.12,302 కోట్లను ఖర్చు చేయనున్నారు. అత్యధిక శాతం రుణాల ద్వారానే ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.64 వేల కోట్లు, దేవాదుల, సీతారామ, తుపాకులగూడెం ప్రాజెక్టులకు రూ.17 వేల కోట్లు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదికి 10.53 లక్షల కొత్త ఆయకట్టు రాష్ట్రంలో ఇప్పటికే 70.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో జలయజ్ఞం ప్రాజెక్టుల కింద 2004 నుంచి ఇంతవరకు 16.77 లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టు సాగులోకి రాగా, అందులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఏకంగా 12.90 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కొత్త రాష్ట్రంలో మరో 16.46 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది. ఇందులో 2017–18 ఏడాదిలో కొత్తగా 2.56 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా, 2018–19లో 1.78 లక్షల ఎకరాల ఆయకట్టు కొత్తగా అందుబాటులోకి వచి్చంది. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 10.53 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. ఇందులో దేవాదుల కింద 4 లక్షల ఎకరాలు ఉండగా, కల్వకుర్తి 1.7 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి కింద 1.70 లక్షల ఎకరాలు ఉంది. ఈ ఆయకట్టు లక్ష్యాల మేరకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.8,476 కోట్లు కేటాయించారు. మొత్తంగా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రభుత్వం చెప్పినట్లు 1.24 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం నెరవేరాలంటే మరో 54 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఇది జరగాలంటే ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రాజెక్టులపై ఏటా ఖర్చు చేసిన నిధులు(రూ.కోట్లల్లో) ఏడాది ఖర్చు చేసిన నిధులు రుణాలు 2014–15 8,052 – 2015–16 10,993 – 2016–17 15,724 491.33 2017–18 25,291 10,967.54 2018–19 37,179 17,194.01 మొత్తం 97,239 28,652.88 ( దీనికి ప్రస్తుతం ఉన్న పెండింగ్ బిల్లులు మరో 7,518 కోట్లు కలుపుకుంటే మొత్తంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేసిన ఖర్చు రూ.1,04,757 కోట్లు చేరనుంది.) -
సాగునీటికి కత్తెర..
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం దెబ్బ రాష్ట్ర బడ్జెట్‌పై కూడా పడింది. ఈసారి బడ్జెట్లో పలు రంగాలకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సాగునీటి రంగానికి కూడా భారీ కుదింపు తప్పేలాలేదు. గత ఐదేళ్లుగా రూ.25 వేల కోట్లు ఈ రంగానికి కేటాయించగా, ఈసారి రూ.7 కోట్లలోపే నిధులు ఇవ్వనున్నట్లు సమాచారం. కొన్ని ప్రాజెక్టులకు ముందు పంపిన ప్రతిపాదనలతో పోలిస్తే కుదించిన అంచనాలు ఆరేడు రెట్లు తగ్గాయి. అయితే ప్రాజెక్టులు ఆగకుండా చూసేందుకు ప్రభుత్వం ‘కార్పొరేషన్ల’ ద్వారా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు భారీ కోత పడే అవకాశాలున్నాయి. గత ఐదేళ్ల బడ్జెట్లలో భారీ కేటాయింపులతో ముందు వరుసలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు తొలిసారి కేటాయిం పులు తగ్గే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు తగ్గిన నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.7 వేల కోట్ల లోపే కేటాయింపులు పరిమితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటి శాఖ రూ.26,500 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. దాన్ని రూ.7 వేల కోట్లకు తగ్గించాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే మళ్లీ ప్రతిపాదనలు సమర్పిం చారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయిస్తోంది. అందుకు తగ్గట్లే నిధులు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆరు నెలల కాలానికి రూ.10వేల కోట్ల కేటాయింపులు చేయగా, అందులో రూ.3,600 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇక ప్రస్తుతం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కోసం రూ.26 వేల కోట్ల అంచనాతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో అధికంగా పాలమూరు–రంగారెడ్డికి రూ.7 వేల కోట్లు, కాళేశ్వరానికి రూ.6 వేల కోట్ల మేర కేటాయింపులు కోరారు. పూర్వ పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పూర్తికి రూ.1,200 కోట్ల మేర కేటాయింపులతో ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం మాంద్యం నేపథ్యంలో అన్ని శాఖల బడ్జెట్లో 40 శాతం కోత విధించాలని ఆర్థిక శాఖ నుంచి నీటి పారుదల శాఖకు మౌఖిక ఉత్తర్వులు అందాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలను పూర్తిగా కుదించారు. పాలమూరు ప్రాజెక్టుల ప్రతిపాదనల అంచనాను రూ.1,200 కోట్ల నుంచి రూ.200 కోట్లకు తగ్గించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,400 కోట్లతో మొదట ప్రతిపాదనలు పంపగా, దాన్ని రూ.400 కోట్లకు కుదించారు. మైనర్ ఇరిగేషన్ కింద చేపడుతున్న పనులకు మొదట రూ.2,100 కోట్ల కేటాయింపులు చేసేలా ప్రతిపాదనలు వెళ్లగా, దాన్ని ఏకంగా రూ.400 కోట్లకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ఇదే మాదిరి ప్రతిపాదనలు తగ్గించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. మొత్తంగా రూ.7 వేల కోట్లకు తగ్గించి ప్రతిపాదనలు పంపగా ఆర్థికశాఖ దాన్ని రూ. 6,500 కోట్లకు పరిమితం చేసినట్లు తెలిసింది. అయితే ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాలను బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం చూపదు. అంటే ఈ రుణాల ద్వారానే ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశం ఉంది. -
సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!
ముంబై: చెన్నై నగరం ఎదుర్కొంటున్న దారుణమైన నీటి ఎద్దడిని చూస్తూనే ఉన్నాం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా నీరు చెన్నై నగరానికి చేరవేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని నిపుణులు, పర్యావరణ ప్రేమికులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఈ పరిస్థితులు దేశంలో భారీ పెట్టుబడులకు దారితీయనున్నట్లు అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అంచనా వేసింది. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టబోయే పలు నీటి ప్రాజెక్టుల రూపేణా వచ్చే 15 ఏళ్లలో ఏకంగా 270 బిలియన్ డాలర్ల మేర (రూ.18.9 లక్షల కోట్లు) పెట్టుబడులు రానున్నాయి. వివాదాస్పద నదుల అనుసంధాన ప్రాజెక్టు రూపంలోనే 168 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే పదిహేనేళ్లలో వస్తాయి. ఇక ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించే ప్రాజెక్టు కోసం 94 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి’’ అని ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ‘‘ఈ తరహా ప్రాజెక్టుల కోసం అవసరమైనన్ని నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వానికి చాలా కష్టం. అందుకని ప్రైవేటు రంగమూ పాల్గొనేలా తగిన నమూనాలు రూపొందించడం అవసరం’’ అని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ భారత విభాగ అధిపతి అమిష్‌షా పేర్కొన్నారు. వ్యవసాయంలో నీటి పొదుపు అవసరం... సాగు రంగంలో నీటి వినియోగాన్ని తగ్గించే విధానాలపై గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని షా సూచించారు. మన దేశంలో ఒక కిలో బియ్యం పండించేందుకు 5,600 లీటర్ల నీటిని వినియోగిస్తుంటే, చైనాలో వినియోగం కేవలం 300 లీటర్లు ఉన్నట్టు తెలిపారు. ‘‘తాజా జలంలో 89 శాతాన్ని వ్యవసాయ రంగమే వాడేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్తు లేదా సబ్సిడీతో కూడిన విద్యుత్ అధిక వాడకానికి, భూగర్భ జల వాడకానికి దారితీస్తున్నదో లేదో అనే విషయమై మనం తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని సూచించారు. గత ఐదేళ్లలోనే నీటి సంబంధిత సదుపాయాల కోసం పెట్టుబడులు ఏటేటా 15 శాతం పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 21 బిలియన్ డాలర్లకు చేరాయని షా తెలిపారు. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్రాలే ఇన్వెస్ట్ చేశాయని, జలం అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని చెప్పారాయన. ‘‘క్లీన్ గంగా ప్రాజెక్టు కోసం కేంద్రం సైతం కొంత పెట్టుబడులు పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ 2.5 బిలియన్ డాలర్లను కేటాయించారు. క్లీన్‌గంగా ప్రాజెక్టుపై గత మూడేళ్లలో 1.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. వచ్చే ఐదేళ్లలో 3 బిలియన్ డాలర్లను అదనంగా ఇన్వెస్ట్ చేయనున్నారు. నదుల అనుసంధానానికి సంబంధించి రెండు భారీ ప్రాజెక్టుల అంచనాలు (ఏపీలో పోలవరం, యూపీలో కెంట్–బెటావా ప్రాజెక్టు) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా చేసినవి’’ అని షా వివరించారు. మంత్రి నితిన్ గడ్కరీ గతంలో పేర్కొన్న గోదావరి– కృష్ణా– కావేరి అనుసంధాన ప్రాజెక్టు కేంద్రం చేపట్టబోయే తదుపరి ప్రాజెక్టుగా పేర్కొన్నారు. తెలంగాణ సర్కారు సైతం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులపై భారీగా వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. -
దేశంలో రాష్ట్రం ముందంజలో ఉంది
సాక్షి, హుజూరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని శాలపల్లి– ఇందిరానగర్‌కాలనీలో ఈటల రాజేందర్‌కు మద్దతుగా నియోజకవర్గస్థాయి రైతు ఆత్మీయ సమ్మేళన సభ మార్కెట్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ... పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల కష్టాలను దూరం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలనుంచే పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ఇవ్వాలనుకున్న సమయంలో కొంత మంది 5 నుంచి 10 ఎకరాలు వరకు సీలింగ్ పెట్టాలని సూచించిన క్రమంలో కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తు చేశారు. వందలాది ఎకరా లు కలిగినఉన్న రైతులు అక్కడక్కడ మా త్రమే ఉంటారని, రైతులందరికి రైతుబంధు అ మలుచేయాలని కేసీఆర్ సూచించారని తెలిపా రు. గత ప్రభుత్వాలు ఏనాడు రైతుల కోసం పథకాలు తీసుకురాలేదని విమర్శించారు. రైతు బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నా రు. వచ్చే వానకాలం వరకు కాలువలు, ప్రాజెక్టు లు నిండుకుండలా మారుతాయన్నారు. రానున్న రోజుల్లో సాగునీళ్లు ఇస్తామంటే వద్దనే పరిస్థితి ఉంటుందని జోష్యం చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కరువంటే ఎం టో తెలియకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ని యోజకవర్గ ప్రజలకు కొడుకుగా ఉంటూ, మచ్చ తేకుండా పని చేస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు. వేగంగా ప్రాజెక్టుల నిర్మాణాలు.. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు వేగవతం అయ్యాయన్నారు. కోటి ఎకరాలకు సాగు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దక్షిణభారతదేశంలోని సిమెంట్ కంపెనీల్లో 70 శాతం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు వినియోగిస్తున్నమంటే ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకోవాలన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేసే స్థాయి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలువాలని కోరా రు. మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి, డాక్టర్ ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, నాయకులు చొల్లేటి కిషన్‌రెడ్డి, కంకణాల విజయారెడ్డి, భగవాన్‌రెడ్డి, కొత్త అశోక్‌రెడ్డి, సాదవరెడ్డి, సురేందర్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, పోలంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహరెడ్డి , కేసిరెడ్డి లావణ్య, శోభారాణి, రమాదేవి పాల్గొన్నారు. -
తెలంగాణలో నిండు కుండలా మారిన జలాశయాలు
-
తెలుగు రాష్ట్రాలకు జలకళ
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరిగి జలకళ సంతరించుకుంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది. తూర్పుగోదావరి : జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం అంతకంతకి పెరుగుతోంది. 3లక్షల 69వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వచ్చిచేరుతోంది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున 3లక్షల 67వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాద్రి : కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రెండు గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కర్నూలు : తుంగభద్రా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ఇన్‌ఫ్లో 69717క్యూసెక్కులు కాగా ప్రస్తుత నీటి మట్టం 77986టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 100టీఎంసీలు. నిర్మల్ : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగటంతో అధికారులు గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 9600 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుత నీటి మట్టం 698అడుగులు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. -
అన్నీ ఒకరికేనా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నీరు–చెట్టు పనులను అప్పగించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే మింగుడు పడటం లేదు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో ఏకంగా రూ.48 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 8 శాతం కమీషన్ తీసుకుని ఈ పనులను కట్టబెట్టినట్టు సమాచారం. అంటే రూ.48 కోట్ల పనులకు గాను ఏకంగా రూ.3.84 కోట్ల కమీషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. పార్టీని, నేతను నమ్ముకుని ఉంటే తమకు మాత్రం పనులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులే అధికంగా మంజూరయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్ ఇంకా పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. చెక్‌డ్యాం పనుల్లో భారీగా ఆదాయం ఉండకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. కమీషన్ ఇంతేనా? నీరు–చెట్టు పథకం కింద జిల్లావ్యాప్తంగా భారీగా పనులు మంజూరవుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.868 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికభాగం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ పనులన్నింటిలోనూ 12 నుంచి 22 శాతం వరకు అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారు. ఇక్కడ ప్రధానంగా పూడికతీత పనులు కావడంతో భారీగా కమీషన్లు వస్తున్నాయి. అయితే.. ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మంజూరు కావడంతో అంతగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీనికితోడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పూడికతీత పనుల్లో ఇందుకు భిన్నం. కొన్నిచోట్ల గతంలో ఉపాధి హామీ కింద చేసిన పనులనే చూపి.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా చేపట్టి మొత్తం బిల్లు తీసేసుకుంటున్నారు. దీంతో ఏకంగా 22 శాతం వరకూ కమీషన్లు అక్కడి అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పారు. అయితే, తనకు కేవలం 8 శాతం కమీషన్ కావడంపై సదరు నేత మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనని శోధించే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా చెరువులున్నాయా? నీరు–చెట్టు కింద నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులన్నీ సులభతరం కావడంతో కాంట్రాక్టర్లకు అధిక ఆదాయం ఉంటోంది. దీంతో అధికారపార్టీ నేతలకు ఇచ్చే కమీషన్ కూడా ఎక్కువగా ఉంటోంది. అదే చెక్‌డ్యాం పనుల్లో తమకు పెద్దగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీంతో పూడికతీత పనులకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేత సోదరుడు ఇన్చార్జ్గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం చెక్‌డ్యాంల పనులను తీసుకున్న కాంట్రాక్టర్ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనంటూ వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా చెరువులు కనిపిస్తే చెక్‌డ్యాంల నిర్మాణం కాకుండా ఈ పనులను చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. -
710 టీఎంసీల కొరత..!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. కృష్ణా ప్రాజెక్టుల్లో ఏకంగా 554 టీఎంసీలు, గోదావరిలో 156 టీఎంసీల నీటి కొరత ఉండటంతో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కృష్ణా బేసిన్లో దిగువకు నీటిని పంపే ఎగువ కర్ణాటక ప్రాజెక్టులూ తీవ్ర నీటి కొరతను ఎదు ర్కొంటున్నాయి. కర్ణాటకలోని ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో ఏకంగా 185 టీఎంసీల నీటి కొరత ఉండటం, అవి నిండితే కానీ దిగువ ప్రాజెక్టులు నిండే అవకాశం లేకపోవడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. గణనీయంగా పడిపోయిన మట్టాలు కృష్ణా బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. ఎగువ కర్ణాటకలో గతేడాది కాస్త ఆలస్యంగా భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండాయి. అయితే ఖరీఫ్, రబీ సీజన్లలో అక్కడ గణనీయమైన సాగు జరగడంతో ఆ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 167 టీఎంసీల నిల్వకు గానూ కేవలం 51 టీఎంసీల నీటి లభ్యతే ఉంది. తుంగభద్ర పరీవాహకంలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురవడంతో ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 100 టీఎంసీలకు గానూ 31 టీఎంసీల నిల్వలున్నాయి. దీంతో మొత్తంగా ఎగువ ప్రాజెక్టుల్లోనే దాదాపు 186 టీఎంసీల నీటి కొరత కనబడుతోంది. ఎగువన సుమారు 150 టీఎంసీల మేర నీరు చేరాకే దిగువకు వరద వచ్చే అవకాశాలుంటాయి. ఇది జరగడానికి మరో నెలన్నర కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాజెక్టులు ఖాళీ.. రాష్ట్ర పరిధిలోని నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 368 టీఎంసీల మేర నీటి కొరత ఉంది. ఈ మూడు ప్రాజెక్టుల్లోకి నెల వ్యవధిలో కేవలం 3 టీఎంసీల కొత్త నీరు మాత్రమే వచ్చి చేరింది. జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురిసినా రాష్ట్ర ప్రాజెక్టుల్లో చేరే నీటిలో సుమారు 90 నుంచి 100 టీఎంసీల మేర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాగునీటి అవసరాలకు పక్కన పెట్టాకే ఖరీఫ్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన సైతం ప్రాజెక్టుల్లో కొంతమేర నీరు చేరినా వెంటనే ఖరీఫ్‌కు అందిచ్చేపరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఖరీఫ్ ఆయకట్టుపై స్పష్టత వచ్చే అవకాశాల్లేవు. సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సకాలంలో నీరు చేరని పరిస్థితిల్లో మొత్తంగా 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. గోదావరి అంతే గోదావరి బేసిన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అసలు ప్రవాహాలు కానరావడం లేదు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూర్, కడెం, ఎల్లంపల్లిలలో కేవలం 8 టీఎంసీలు మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. ఈ ప్రాజెక్టుల్లో 190 టీఎంసీల మేర నిల్వ సామర్థ్యం ఉండగా ఏకంగా 156 నీటి లోటు ఉంది. జూలై, ఆగస్టు వర్షాలపైనే సుమారు 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. తీవ్ర నీటి కొరత దృష్ట్యా ప్రభుత్వం తన తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని 37 ప్రాజెక్టుల నుంచి ఈ జూన్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు మిషన్ భగీరథ అవసరాలకు 60 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ దృష్ట్యా తాగునీటికి అవసరమైన నిల్వలు పక్కకు పెట్టిన తర్వాతే సాగు నీటి కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రీశైలం వెలవెల రాష్ట్రానికి సాగు, తాగునీటి వరప్రదాయిని అయిన శ్రీశైలం జలాశయానికి ఇంకా వరద మొదలుకాలేదు. దీంతో జలాశయం వెలవెలబోతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885.0 అడుగులు కాగా, ఆదివారం నాటికి 800.1 అడుగుల నీరు (29.0552 టీఎంసీలు) ఉంది. వాటర్ ఇయర్ ప్రారంభమై నెల రోజులు పూర్తయినా ఇంత వరకు ఎగువ ప్రాంతాలు జూరాల, సుంకేసుల నుంచి నీటి ప్రవాహం రాలేదు. కర్ణాటక, రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా.. (టీఎంసీల్లో) ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ ప్రస్తుత నిల్వ కొరత ఆల్మట్టి 129.72 27.55 102.17 నారాయణపూర్ 37.64 24.02 13.62 తుంగభ్రద 100.86 31.20 69.66 జూరాల 9.65 5.85 3.81 శ్రీశైలం 215.81 29.06 186.75 సాగర్ 312.05 133.72 178.33 సింగూర్ 29.91 7.81 22.10 నిజాంసాగర్ 17.80 2.37 15.43 ఎస్సారెస్పీ 90.31 10.17 80.14 కడెం 7.60 4.62 2.98 లోయర్ మానేరు 24.07 3.44 20.63 ఎల్లంపల్లి 20.18 6.08 14.10 -
‘గట్టు’.. తెలంగాణకు మరో పచ్చబొట్టు
ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజకీయం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తించారు. అదే 2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలించింది. ప్రజాస్వామ్యంలో పాలించే ప్రభుత్వ వ్యవస్థలు శాశ్వతం. ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించే పాలక పక్షాలు మాత్రం ఐదేళ్లకోమారు పరీక్షను ఎదుర్కోవాల్సిందే. అదే ప్రజాస్వామ్య వ్యవస్థకున్న చక్కటి లక్షణం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పాలక పార్టీలను మార్చేసే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓటుకు ఉంది. ఇది ఇప్పటికే భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఎన్నోసార్లు రుజువయింది. పాలకపార్టీలు అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాయా లేదా ప్రజల అవసరా లను తీర్చుతున్నాయా లేదా అన్నది ముఖ్యం. తాను ఓటు వేసిన సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ఎలా పని చేస్తున్నారని ప్రజలు ప్రత్యక్షంగా, ప్రసార మాధ్య మాల ద్వారా నిత్యం గమనిస్తూనే ఉంటారు. తాము పట్టం కట్టిన పార్టీ పాలన ఎలా ఉందో బేరీజు వేసు కుంటారు. ఐదేళ్ల తర్వాత తనకు వచ్చిన అవకాశంతో అటు పాలక పార్టీలకు, ఇటు ప్రతిపక్షాలకు మార్కులు వేసి ఎవరిని ఉత్తీర్ణులను చేయించాలి ఎవర్ని ఫెయిల్ చేయాలో నిర్ణయిస్తారు. అయితే 2014లో ప్రభుత్వంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికార దాహంతో రాలేదు. తెచ్చిన తెలంగాణను అందరు కలలు కంటున్న బంగారు తెలంగాణగా మార్చాలని అధి కార పీఠాన్ని అధిష్టించింది. తెలంగాణ ఉద్యమం ద్వారా వెలుగు చూసిన కడగండ్లను తొలగించడమే ధ్యేయంగా ఎన్నికల ఎజెండాను రూపొందించింది. సాగు నీరు తెలంగాణ బీడు పొలాల్లోకి రాకపోవడం వల్లే ఈ ప్రాంతం వెనకబడిందని గమనించింది. అందుకోసమే అధికార పీఠం ఎక్కిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి సారించారు. సామాజిక ఇంజనీర్‌గా మారి ఏ ప్రాంతానికి ఎలా నీరు ఇవ్వాలో ప్రాజెక్టుల రీ ఇంజ నీరింగ్ సాధ్యాసాధ్యాలపై మేధో మథనం చేశారు. అందులోంచి పుట్టుకొచ్చినవే నేటి తెలంగాణ ప్రాజె క్టులు. శరవేగంగా తెలంగాణలో ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయంటే అది వచ్చే ఎన్నికలలో విజయం కోసం కాదు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను పరిపూర్ణంగా నెరవేర్చడానికే. తెలంగాణ వస్తే పాలన చేతనవుతుందా? రాష్ట్రం మనగలుగుతుందా? అన్న వారి నోళ్లు మూతపడేలాగా పాలన కొనసాగుతు న్నది. దేశానికి దిక్సూచిగా చెప్పదగిన అభివృద్ధి పథ కాలు, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. చరిత్రను సృష్టించనున్నాయి. ప్రస్తుత అంశానికి వస్తే–ముఖ్యమంత్రి గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అంశాన్ని ఇటీవలే ప్రతిపక్ష కాంగ్రెస్ తనదైన శైలిలో వివాదం చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజ లకు వాస్తవాలు తెలియవలసి ఉంది. ఏదైనా ఓ పని అప్పగిస్తే కొందరు చేసినట్లు నటిస్తారు. మరి కొందరు నిజంగా పనిచేస్తారు. ఇలా పని చేసినట్లు నటించే చరిత్ర ప్రతిపక్ష పార్టీది. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. గట్టు ప్రాజెక్టు చరిత్రే కాంగ్రెస్ నేతల అసలు చరిత్రను వెల్లడిస్తుంది. పాలమూరు ప్రాంత సాగుకు ఉపయోగపడే గట్టు ప్రాజెక్టుకు తొలి అడు గులు పడిన తీరు ఇలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి గద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవెల్ కెనాల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన హయాంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. 2012 సెప్టెంబర్ 14వ తేదీన జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి ర్యాలంపాడు జలాశయం నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలం లోని చెరువులను నింపి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యా మలం చేస్తామని ప్రకటించారు. అయినా ఏడాదిన్నర వరకు అనుమతులు మంజూరు చేయలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే మోక్షం కలిగింది. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా 3,000 ఎకరాలు చెరువు ఆయకట్టు స్థిరీకరణకు సర్వే చేయ డానికి జీవో నంబర్ 3ను 22–01–2014 నాడు విడు దల చేసింది. 3 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన సర్వే కోసం మాత్రమే రూ. 10.50 లక్షలు మంజూరయ్యాయి. ఎన్నికల ప్రకటన జారీకి ముందు 2014 ఫిబ్రవరి 22న అప్పటి మంత్రులు సైతం ఇది సర్వే చేయడానికి జారీ చేసిన జీవో మాత్ర మేనని తెలిసి కూడా గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇది ఎన్నికల ముందు ప్రజ లను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి చేసిన పని అని ఎవరికైనా అర్థమవుతుంది. రెండు నెలల్లో కేవలం సర్వే కోసం రూ. 10.57 లక్షలు మంజూరు చేసినట్లు జీవో విడుదల చేసి, నెల రోజులకి శంకు స్థాపన చేసి ఆ తర్వాతి నెలలో ఎన్నికల్లో ప్రజల్ని మభ్య పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ఘనత చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. సర్వే కోసం జీవో ఇచ్చి ప్రాజెక్టుకు శంకు స్థాపన చేస్తారా? సర్వే జరగలేదు, ప్రాజెక్టు డీపీఆర్ లేదు, టెండర్లు లేవు. మరి శంకుస్థాపన ఎందుకు చేశారు? ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి మరో మారు ‘గట్టె’క్కాలన్న ఆలోచన. కానీ ప్రజలు ఆ ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బాధ, తెలంగాణ సోయి, తెలంగాణ ఆలోచన ఉన్న తెరాస ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరంతో మేధో మథనం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చర్చించారు. అనంతరం గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండల ప్రజల ఆలోచనను అడిగి తెలుసుకున్నారు. కరవు మండలాలకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా 3 వేల ఎకరాలకు నీరు ఇచ్చే పథకం సర్వే చేయించడానికి ఇచ్చిన జీవో వల్ల ఎటువంటి న్యాయం జరగదని గుర్తించి ఈ మూడు మండ లాల్లో దాదాపు 25 వేల ఎకరాల వరకు కొత్త ఆయ కట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చేలా సమగ్ర సర్వే చేయాలని సాగు నీటి శాఖను ఆదేశిం చారు. ఈ మేరకు జీవో ఆర్టీ నంబర్ 461 ని 2016 మే 3వ తేదీన విడుదల చేశాం. కొత్తగా ఈ ప్రాజె క్టును రూపొందించేందుకు సమగ్ర సర్వే చేయించేం దుకు 52.46 లక్షలు మంజూరు చేసి ఆ పనులను సర్వే ఏజెన్సీకి అప్పగించాం. ఇక్కడితో మా ప్రభు త్వం ఆగలేదు. ప్రాజెక్టు సమగ్ర సర్వే సమర్పించే దశలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు కోసం రిజర్వు చేసిన 5 వేల ఎకరాలను ఆయకట్టు పరిధి లోకి తేవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరికను మేం కాదనలేదు. తిరిగి మరోమారు సర్వే చేయించాం. తద్వారా 25 వేల ఎకరాల నుంచి 33 వేల ఎకరాలకు నీరిచ్చేలా గట్టు ప్రాజెక్టు రూపు రేఖలు మార్చాం. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మూడు వేల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కోసం సర్వే పనులకు మాత్రమే జీవో విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదిత గట్టు ప్రాజెక్టుకు మేం శంకుస్థాపన చేస్తున్నామా? లేదా 33 వేల ఎకరాల కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన తెరాస ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గట్టు ప్రాజె క్టుకు శంకుస్థాపన చేస్తున్నామా? ఈ ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన తర్వాత గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ 33 వేల ఎకరాలకు నీరు పారించే విధంగా రూ. 553.98 కోట్లను మంజూరు చేశారు. ఈ మేరకు జీవో ఎం.ఎస్ నెంబర్ 60 ద్వారా 2018 మే 31వ తేదీన పరిపాలన పరమైన అను మతులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది అసలు ప్రాజెక్టు కథ. ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని రాజ కీయం చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను గందరగోళ పరుస్తున్న కాంగ్రెస్ ప్రజలకు సమా ధానం చెప్పాలి. ఎక్కడ మూడు వేల ఎకరాల ప్రాజెక్టు? ఎక్కడ 33 వేల ఎకరాల ప్రాజెక్టు? ఏ ప్రాజెక్టు కట్టాలి? వారి 3 వేల ఎకరాల ప్రాజెక్టా? మేం ప్రతిపాదిస్తోన్న 33 వేల ఎకరాల ప్రాజెక్టా? గట్టు, ధరూర్, కేటీ దొడ్డి మండలాల రైతులు సైతం దీనిపై స్పందించాలని కోరుతున్నా. ప్రజలు తమని నమ్ముతున్నారన్న భ్రమలో కాంగ్రెస్ నేతలున్నారు. వారి స్వభావం ఉద్యమ కాలంలోనే ప్రజలు గుర్తిం చారు. అదే 2014 ఎన్నికల తీర్పులో ప్రతిఫలిం చింది. 2014లో మంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసినట్టు మాజీ మంత్రి డీకే అరుణ చెబు తున్నారు. నేను అరుణ గారిని అడుగుతున్నాను. 25 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు ప్రతిపాదించిన ప్రాజెక్టు జీవోను చూపించగలరా? ఆధారాలు ఏవైనా బయట పెట్టగలరా? కాంగ్రెస్‌కు కావల్సింది మొబిలై జేషన్ అడ్వాన్స్‌లు. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. మేం అడ్వాన్స్‌ల కోసం ప్రాజె క్టులు కట్టడం లేదు. కోటి ఎకరాలకు నీరిచ్చే లక్ష్యంతో ప్రాజెక్టులు కడుతున్నాం. అధికార యావ మీది. తెలంగాణ గోస తీర్చాలన్న భావన మాది. గత ఎన్నికల్లో గట్టెక్కేందుకు గట్టు ప్రాజెక్టును వినియోగిం చుకున్న కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో నాలుగు ఓట్లు పడతాయన్న భావనతో ప్రజలను గందరగోళ పరిచే ప్రయత్నం చేస్తున్నది. ప్రజల ముందు ఈ వాస్తవా లను ఉంచాలన్న నా ఈ ప్రయత్నం ఉద్దేశం అదే. (గట్టు ఎత్తిపోతల పథకానికి నేడు శంకుస్థాపన) - తన్నీరు హరీశ్‌రావు వ్యాసకర్త తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి -
‘క్రాసింగ్’ దాటని ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు రైల్వే క్రాసింగ్‌లో చిక్కుకుంటున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల నిర్మాణాలు రైల్వే లైన్లు దాటలేక చతికిలబడుతున్నాయి. తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 32 రైల్వే క్రాసింగ్‌లు ప్రాజెక్టుల పనులకు అడ్డుగా నిలుస్తుండటంతో 4.74 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతోంది. ఈ విషయమై రైల్వేతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి 11 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి. ఇందులో ఇప్పటికే 26 క్రాసింగ్‌ల పనులు పూర్తయ్యాయి. మరో 32 చోట్ల పూర్తయితే గానీ కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టడం కుదరదు. ఇందులో నెట్టెంపాడు పరిధిలో 5, దేవాదులలో 6, ఎల్లంపల్లిలో 3, కాళేశ్వరంలో 3, ఉదయసముద్రం, వరద కాల్వ పరిధిలో రెండేసి చొప్పున క్రాసింగ్ సమస్యలున్నాయి. పెనుగంగ, కొమురం భీం పరిధిలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. క్రాసింగ్లకు సంబంధించి నిధులను నీటి పారుదల శాఖ రైల్వేకు డిపాజిట్ చేస్తున్నా పనుల్లో వేగం మాత్రం కానరావడంలేదు. పనులు పట్టాలెక్కుతాయా..? రైల్వే క్రాసింగ్‌ల వల్ల ప్రభావితమవుతున్న 4,74,851 ఎకరాల ఆయకట్టులో 3,38,507 ఎకరాలకు ఈ ఏడాది చివరికి నీళ్లివ్వాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నెట్టెంపాడు, దేవాదుల, కొమురం భీం, ఉదయసముద్రం, ఎల్లంపల్లి పరిధిలో 18 చోట్ల రైల్వే క్రాసింగ్‌ల పనులు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రాసింగ్ ఇబ్బందులపై వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ మొదలయ్యే నాటికి 12 క్రాసింగ్ పనులు పూర్తి చేసి 90,709 ఎకరాలకు.. రబీ నాటికి మరో 2,47,798 ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలని కోరారు. మరో 14 క్రాసింగ్లను పూర్తి చేస్తే 1,36,344 ఎకరాలకు నీరందు తుందని చెప్పారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలత వ్యక్తం చేసినా పనులు పట్టాలెక్కుతాయా? ఆయకట్టుకు నీరందుతుందా? వేచి చూడాలి. -
రూ.659 కోట్ల నిధులకు దక్కని మోక్షం!
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపికైన 11 పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోక్షం దక్కడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టులకు మరో రూ.659 కోట్లు అందాల్సి ఉన్నా ఇంతవరకు విడుదల చేయలేదు. మెజారిటీ ప్రాజెక్టులను మరో రెండు నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా నేపథ్యంలో కేంద్ర సాయం అందకపోవడం.. ప్రాజెక్టుల పనులకు ప్రతిబంధకంగా మారుతోంది. పీఎంకేఎస్‌వై కింద కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను కేంద్రం గుర్తించింది. వాటి నిర్మాణానికి రూ.24,827 కోట్లు అవసరం కాగా ఇందులో రూ.17,387 కోట్లను రాష్ట్రం ఇప్పటికే ఖర్చు చేసింది. మరో రూ.7,440 కోట్ల నిధులను ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో కేంద్రం తన వాటా కింద రూ.659.56 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులకు రూ.496 కోట్లు.. కేంద్ర నిధుల్లో అత్యధికంగా దేవాదులకు రూ.496 కోట్లు, భీమాకు రూ.107 కోట్లు, ఎస్సారెస్పీ–2కు రూ.37 కోట్లు, గొల్లవాగుకు రూ.10కోట్ల మేర సాయం అందాల్సి ఉంది. వరద కాల్వ మినహా మిగతా ప్రాజెక్టులన్నింటినీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నిధుల కోసం రాష్ట్రంతో పాటు పీఎంకేఎస్‌వై పరిధిలోని ప్రాజెక్టులకు చెందిన రాష్ట్రాలు కేంద్ర జలవనరుల శాఖపై ఒత్తిడి పెంచాయి. ఈ ఒత్తిళ్లతో ఈ నెల 6న కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ పీఎంకేఎస్‌వై ప్రాజెక్టుల పురోగతి, నిధుల అవసరాలపై రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రం నుంచి కమిషనర్ మల్సూర్ హాజరు కానున్నారు. ఈ భేటీలో పెండింగ్ నిధులపై స్పష్టత రానుంది. -
ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత నాదే
-
రెండేళ్లు జీఎస్టీ మినహాయించండి
- ‘సాగు, తాగునీరు.. గృహ, రహదారుల’ ప్రాజెక్టులపై.. - లేదంటే పురోగతిలో ఉన్నవి వదిలేయండి - 9న జరిగే కౌన్సిల్‌కు తెలంగాణ కొత్త ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: సాగు, తాగునీటి ప్రాజెక్టులు.. గృహ, రహదారుల నిర్మాణ పనులపై రెండేళ్లు జీఎస్టీ మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. లేనిపక్షంలో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను మినహాయించాలని విన్నవించనుంది. ఈ మేరకు ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ కొత్త ప్రతిపాదనలను లేవనెత్తనుంది. సాగు, తాగునీటి పథకాలు.. గృహ, రహదారుల నిర్మాణ పనులపై కేంద్రం 18 శాతం జీఎస్టీ విధించింది. అయితే ఈ నాలుగింటిపై జీఎస్టీ విధించొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. గత కౌన్సిల్ సమావేశంలో ఈ విషయం ప్రధానంగా ప్రస్తావనకు రావటంతో 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయించింది. అయితే వాటిపై జీఎస్టీ విధించటమే సరికాదంటూ కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు. తాజాగా మరోసారి పట్టుబట్టడం వల్ల 5 శాతం శ్లాబ్‌లో చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. పెద్దగా లాభం ఉండదని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 5 శాతం శ్లాబ్‌లో చేరిస్తే కాంట్రాక్టర్లకే ఎక్కువ లాభమని, ప్రభుత్వానికి నష్టమేనని ఆర్థిక శాఖ తాజాగా అంచనా వేసింది. నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రిపై చెల్లించిన పన్ను, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రూపంలో కాంట్రాక్టు సంస్థలకు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఖజనాకు లాభం లేని ఈ ప్రతిపాదనను పక్కకు పెట్టింది. దానికి బదులుగా ఈ 4 అంశాలకు రెండేళ్లు జీఎస్టీని మినహాయించాలని, లేదంటే పురోగతిలో ఉన్నవి వదిలేసి, కొత్త పనులకే వర్తించే వెసులుబాటు కోరాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
నీటి ప్రాజెక్టులపై జీఎస్టీ భారం వద్దు
► జైట్లీతో సమావేశంలో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి ► గ్రానైట్, బీడీ పరిశ్రమలపై పన్ను శ్లాబ్‌లు మార్చాలని వినతి ► సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: దేశంలో సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులు, చిన్న, మధ్య తరహా గ్రానైట్ పరిశ్రమలు, బీడీ పరిశ్రమపై విధించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబ్‌లపై పునరాలోచించాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో జైట్లీని ఆయన కార్యాలయంలో కలుసుకున్న కేటీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పనుల తోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు, పేదల గృహ నిర్మాణా లపై జీఎస్టీ వల్ల జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ పన్నుల వల్ల తెలం గాణ ప్రభుత్వంపై అదనంగా రూ. 11 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా గ్రానైట్ పరిశ్ర మలు, బీడీ పరిశ్ర మలపై విధించిన పన్ను శ్లాబ్‌లను మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జైట్లీ... జీఎస్టీ వల్ల తీవ్ర ప్రభావానికి గురయ్యే రంగాల వివరాలు సమర్పించాలని కేటీఆర్‌కు సూచించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచండి.. తెలంగాణ ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని జైట్లీని కేటీఆర్ కోరారు. తెలంగాణ రెండంకెల వృద్ధితో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందున్నదని వివరిం చారు. అందువల్ల సంక్షేమ పథకాల అమలుకు ఎక్కువ రుణ సదుపాయాన్ని పొందేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని కోరారు. గత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు వెనుకబడిన జిల్లాల కింద రావాల్సిన రూ. 450 కోట్ల మూడో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. హైదరా బాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని.. దానికి బదులుగా రాష్ట్ర భూములను కేటా యిస్తామన్నారు. దీనిపై రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రాను పిలిపించి మాట్లాడిన జైట్లీ.. హైదరాబాద్‌లో రక్షణ భూముల బదలాయింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఉమాభారతితో హరీశ్‌రావు భేటీ
ఎఫ్ఆర్బీఎంతో సంబంధం లేకుండా నాబార్డు రుణాలు సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్రానికి హరీశ్‌రావు విజ్ఞప్తి దేవాదులకు కేంద్ర సహకారాన్ని 60 శాతానికి పెంచాలని వినతి సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన(పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల కోసం నాబార్డు ఇచ్చే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితికి సంబంధం లేకుండా అందజేయాలని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. పీఎంకేఎస్‌వై ప్రాజెక్టులను సమీక్షించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి మంగళవారం ఉదయం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులు పీఎంకేఎస్వైలో ఉన్నాయి. వాటికోసం నాబార్డు నుంచి తొలి విడతగా రూ.1,500 కోట్ల రుణం విడుదలైంది. అయితే రాష్ట్రంలో రూ. 80 వేల కోట్లతో 99 ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో మూడు కీలక అంశాలను ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లాం. నాబార్డు నుంచి ఇచ్చే రుణం ఎఫ్ఆర్బీఎం పరిమితికి సంబంధం లేకుండా ఇవ్వాలి. 11 ప్రాజెక్టుల కోసం అడుగుతున్న రూ.7 వేల కోట్ల రుణాన్ని ఎఫ్ఆర్బీఎం పరిమితి వెలుపల ఇవ్వాలని కోరాం..’’ అని హరీశ్ చెప్పారు. ఇక దేవాదుల ప్రాజెక్టు మావోయిస్టు ప్రభావిత, రైతు ఆత్మహత్యలు ఉన్న ప్రాంతంలో ఉందని, అందువల్ల దానికి అందిస్తున్న కేంద్ర సాయాన్ని 25 శాతం నుంచి 60 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు గ్రాంటుగా ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ఆర్థిక శాఖకు సిఫారసు చేసిందని, ఆ విషయంలో సహకారం కావాలని ఉమాభారతిని కోరామని తెలిపారు. నీతిఆయోగ్‌తో సీఎస్ రాజీవ్ శర్మ, రాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నారని, ఉమాభారతి కేంద్ర ఆర్థిక మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై స్పందిస్తూ.. ‘ట్రిబ్యునల్‌కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో ఈనెల 29న చర్చిస్తాం. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకుంటాం..’ అని హరీశ్ చెప్పారు. -
ప్రాజెక్టులకు వెల్లువెత్తిన వరద నీరు
హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు. ఇన్ ఫ్లో 1,05,358 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 83,712 క్యూసెక్కులుగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని దవళేశ్వరం ప్రాజెక్టులో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 4.87 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదల చేశారు. నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 78,100 క్యూసెక్కులు.... ఔట్ ఫ్లో 900 క్యూసెక్కులు ఉంది. మెదక్ జిల్లా : సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1717 అడుగులు కాగా... ప్రస్తుతం నీరు 1716 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కలు ఉండగా.. ఔట్ ఫ్లో 45 వేల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 29.99 టీఎంసీలు... ప్రస్తుతం 28.10 టీఎంసీలు ఉంది. నిజామాబాద్ జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1403 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో లక్షా 5 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 87 వేల క్యూసెక్కులు ఉంది. అదే జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో 42 గేట్లను అధికారులు మూసివేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1090 అడుగులు ఉంది. ఇన్‌ఫ్లో లక్షా 86 వేల క్యూసెక్కులు ఉండగా... వరద కాల్వకు 15 వేల క్యూసెక్కులు ఉంది. కాకతీయ కాల్వకు 3 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. కరీంనగర్ : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 146.70 మీటర్లు ఉంది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 2,81,318 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 2,70,805 క్యూసెక్కులు ఉంది. -
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు
హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 878 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,71,144 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 54,502 వేల క్యూసెక్కులు ఉంది. నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్‌కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 515 అడుగులు ఉంది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 11,500 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1350 క్యూసెక్కులు ఉంది. ఇదే జిల్లాలోని కేతెపల్లి మద్ద మూసీ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీరు 642 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 16 వేల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 9 వేల క్యూసెక్కులు ఉంది. నిజామాబాద్ జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుతం 1395 అడుగులకు నీరు చేసింది. ఇన్‌ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో మాత్రం నిల్. మహబూబ్‌నగర్ : జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 11 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు ఉండగా... ప్రస్తుతం 318.280 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 2 లక్షల 5 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 2 లక్షల 5, 515 క్యూసెక్కులు ఉంది. కరీంనగర్ జిల్లా: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తివేసి.. లక్షా 34 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3 లక్షల, ఔట్ ఫ్లో 34 వేల క్యూసెక్కులు ఉంది. ఆదిలాబాద్ జిల్లా : కొమరం భీం ప్రాజెక్టులోని మూడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 7500, ఔట్ ఫ్లో 75600 క్యూసెక్కులు ఉంది. మెదక్ జిల్లా : సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు తగ్గింది. పూర్తిస్థాయి నీటిమట్టం 29.99 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 26.5 టీఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 90 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు ఉంది. -
నీళ్లల్లో నిప్పు!
నీళ్లతోపాటు నిత్యం విద్వేషాలు కూడా ప్రవహించే కావేరి నది మరోసారి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలమధ్య నిప్పు రాజేసింది. ఎప్పటిలా ఈ వివాదంలో సుప్రీం కోర్టు జోక్యం తప్పలేదు. పదిరోజులపాటు రోజుకు 15,000 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని అది ఆదేశాలిచ్చింది. వాటిని నిరసిస్తూ కావేరి పరీవాహ ప్రాంతమైన మాండ్యా జిల్లాలో వెనువెంటనే జనం రోడ్లపై కొచ్చారు. బంద్ పాటించారు. శుక్రవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త బంద్ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు తమకనుకూలంగా లేకపోతే తమిళనాడులో ఈ స్థితి చోటుచేసుకునేది. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికైన ప్రభుత్వాలుగానీ... మధ్య వర్తిత్వం వహించి సరిదిద్దాల్సిన కేంద్రంగానీ... నీటి పంపకం బాధ్యతలు చూడా ల్సిన కావేరి ట్రిబ్యునల్‌గానీ... దాని నేతృత్వంలో, అది ఇచ్చే ఆదేశాలతో పనిచేయా ల్సిన కావేరి యాజమాన్య బోర్డు, కావేరి జల క్రమబద్ధీకరణ కమిటీలుగానీ ఎవరి పని వారు సక్రమంగా చేయకపోవడంతో ఈ సమస్య జటిలమవుతున్నది. ప్రధాని అధ్యక్షతన ఉండే కావేరి రివర్ అథారిటీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అది ఒకటి రెండుసార్లు మినహా సమావేశం కాలేదు. వివాదాలు తలె త్తినప్పుడు చురుగ్గా కదలకుండా సాచివేత ధోరణి అవలంబిస్తే అవి ఏ స్థాయికి చేరగలవో కావేరి వివాదం రుజువు చేస్తున్నది. ఈ గొడవకు శాశ్వత ముగింపు పలకాలని భావించిన సుప్రీంకోర్టు కావేరి నదీజలాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 1990లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాతే అప్పటి వి.పి. సింగ్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏడాది గడిచాక ఆ ట్రిబ్యునల్ మధ్యంతర ఆదేశాలిస్తే వాటిపై కర్ణాటక రాష్ట్రం నెలరోజులు అట్టుడికిపోయింది. బెంగళూరు సహా అనేకచోట్ల తమిళులపై దాడులు జరిగాయి. అనేకులు ప్రాణభయంతో స్వరాష్ట్రానికి పరుగులు తీశారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా తమిళనాట కూడా ఆందోళనలు చెలరేగాయి. 2007లో కావేరి ట్రిబ్యునల్ తుది అవార్డు ప్రకటించింది. కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో పంచుకోవాలో చెప్పింది. కేరళ, పుదుచ్చేరిలకు దీంతో పెద్ద పేచీ ఏమీ లేదు. వివాదమంతా ఎప్పుడూ కర్ణాటక, తమిళనాడుల మధ్యే నడుస్తుంది. వర్షాలు సక్రమంగా పడినంత కాలమూ సమస్య ఉండదు. పుష్కలంగా నీరున్నప్పుడు ఏ రాష్ట్రం ఎన్ని క్యూసెక్కుల నీరు తీసుకోవాలన్న విషయంలో లెక్కలు స్పష్టంగానే ఉంటాయి. ఎవరూ నిరసన గళం వినిపించరు. కానీ వానలు లేనప్పుడు ఎంత పంచుకోవాలో ఇంతవరకూ చెప్పింది లేదు. రైతుల్ని మానసికంగా సిద్ధం చేసింది లేదు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలూ రైతుల ప్రయోజనాలను పరిరక్షణ కోసం తాము ఎంతగా పాటు పడుతున్నదీ, పాలకపక్షాలు ఎలా ద్రోహం చేస్తున్నదీ ఏకరువు పెడతాయి. సమ స్యంతా అక్కడే వస్తుంది. ఈసారి కూడా అనుకున్నట్టుగా వర్షాలు లేకపోవడంవల్ల రిజర్వాయర్లన్నీ అడుగంటాయి. తమిళనాడులో సాంబ మసూరి కాపాడుకోవాలని రైతులు ఆత్రుత ప్రదర్శించినట్టే కర్ణాటక రైతులు తమ పంటలెక్కడ దెబ్బతింటా యోనని ఆందోళన పడుతున్నారు. అందువల్లే మరోసారి ఉద్రిక్తతలు మొదల య్యాయి. వాహనదారులకు నిత్యం నరకాన్ని చూపే బెంగళూరు రోడ్లు శుక్రవారం బంద్ వల్ల జన సంచారం కరువై చిన్నబోయాయి. తమ రాష్ట్రానికే సాగునీరు, తాగునీరు లేని స్థితిలో తమిళనాడుకు నీళ్లెలా ఇస్తామని రైతు సంఘాలు ప్రశ్నిస్తు న్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలపై ఏం చేద్దామో చెప్పండంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశం పెట్టారు. మూడు గంటలు సుదీర్ఘంగా చర్చించాక చివరకు ఆ ఆదేశాలను శిరసావహించాలని నిర్ణయించారు. వాటిని సవరించమంటూ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్టు ప్రకటిం చారు. బంద్‌ను వ్యతిరేకించడం లేదని ప్రకటించడం ద్వారా సిద్ధరామయ్య దానికి మద్దతునిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇది కావేరికి పరిమితమైన సమస్యో... తమిళనాడు, కర్ణాటకల మధ్య మాత్రమే తలెత్తిన వివాదమో అని సరిపెట్టుకోవడానికి లేదు. ఇలాంటివి దేశంలో చాలా ఉన్నాయి. గోదావరి, కృష్ణా, నర్మద, రావి-బియాస్, వంశధార, మహాదాయి నదీ జలాల విషయంలో కూడా వివాదాలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లపెరియార్, బాబ్లీ డ్యాంల వివాదాలు వీటికి అదనం. ముఖాముఖి చర్చలతో, పరస్పర ఒప్పం దాలతో, సంయుక్తంగా ఆనకట్టల నిర్మించడంద్వారా కొన్ని రాష్ట్రాలు జల వివా దాలు రాకుండా జాగ్రత్త పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నదీ జలాలపై దేశంలో ఇంతవరకూ 144 అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదిరాయని గణాంకాలు చెబు తున్నాయి. రాష్ట్రాలమధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఏం చేయాలో నిర్దేశించేందుకు 1956లో వచ్చిన అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం ఉంది. అయితే దిగువనున్న రాష్ట్రా లెదుర్కొనే ఇబ్బందుల ప్రాతిపదికగానే జల వివాదాల సమస్యను చూడాలన్న వైఖరి, ఆలోచన కరువవుతున్నది. భారీ వర్షాలొచ్చి నదులకు వరదలొచ్చినప్పుడు ఎనలేని నష్టాన్ని చవిచూడక తప్పని స్థితిలో ఉండే దిగువ రాష్ట్రాలకు... వానల్లేక దిగులు పడే సందర్భాల్లో బాసటగా నిలవాలన్న ఆలోచన ఎగువ రాష్ట్రాలకు ఉండటం లేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా రాజకీయ కోణంలో ఆలోచి స్తుండటం, తమ పార్టీ ఏ రాష్ట్రంలో బలంగా ఉంటే ఆ రాష్ట్రానికి అనుగుణంగా వ్యవహరించడం లేదా మౌనంగా ఉండిపోవడం రివాజుగా మారింది. రానున్న కాలంలో దేశాలమధ్య ప్రధానంగా నదీ జలాల కోసమే యుద్ధాలు జరుగుతాయని ఒక నిపుణుడు చెప్పాడు. అది రాష్ట్రాల విషయంలో కూడా నూటికి నూరుపాళ్లూ నిజం. పాలకులు ఈ సమస్యపై దృష్టి సారించడం లేదు. ఒక నిర్దిష్టమైన విధాన రూపకల్పనకు పూనుకోవడం లేదు. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ తదితరాలమధ్య సమన్వయం సాధించే దిశగా కదలడం లేదు. ఎన్నో సమస్యలతో ముడిపడి ఉండే నదుల అనుసంధానం చుట్టూ మాత్రమే ఆలోచిస్తున్నారు. నీటి కోసం శివాలెత్తే మంది చేతుల్లో ప్రభుత్వాలు బందీలైతే మిగిలేది అరాచకమే. అందుకే పాలకులు మేల్కొనాలి. శాశ్వత పరిష్కారానికి నడుం బిగించాలి. -
ప్రాజెక్టులపై అవగాహన లేదు : ఎంపీ కవిత
► జానారెడ్డి రాజకీయాలకు అతీతంగా మాట్లాడారు ► రేవంత్‌రెడ్డి.. వర్క్‌లేని వర్కింగ్ ప్రెసిడెంట్ ► ప్రతిపక్షాలపై ఎంపీ కవిత మండిపాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహన కూడా లేదని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తమ్మిడిహెట్టిపై మహారాష్ట్రతో కాంగ్రెస్ 152 మీటర్లకు ఒప్పందం చేసుకోలేదని రాజకీయాలకు అతీతంగా మాట్లాడి ప్రతిపక్ష నేత జానారెడ్డి తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారన్నారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా జానారెడ్డి బాటలో నడిస్తే బావుంటుందని వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ తెలంగాణ భవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం పెట్టారని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోలేదని విమర్శించారు. ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర మధ్య 40-35 టీఎంసీల చొప్పున నీటిని వాడుకునేలా ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, దీంతో ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు అందని దుస్థితి నె లకొందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే సీఎం అడుగులు వేస్తున్నారన్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి అధిష్టానం అమరావతిలో ఉందని, ఆయన వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్ అని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం లేదా మరే ఇతర ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తేవాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలోనే కొత్త జిల్లాలు కొత్త జిల్లాల విభజనపై విపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, శాస్త్రీయ పద్ధతిలోనే జిల్లాలు ఏర్పడుతున్నాయని కవిత పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జీఎస్టీతో రాష్ట్రానికి లాభం జరుగుతుందని, ఈ బిల్లుకు మొదట మద్దతు తెలిపింది తెలంగాణేనని చెప్పారు. టీఆర్ఎస్ కేంద్రానికి వ్యూహాత్మకంగా మద్దతిస్తోందని పేర్కొన్నారు. -
ఎవరి కాళ్లయినా మొక్కుతాం
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తాం ప్రజెంటేషన్‌లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులపై బహిరంగ చర్చకు సిద్ధమా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహకరిస్తామని... ఢిల్లీకే కాదు ఎక్కడికైనా వచ్చి ఎవరి కాళ్లయినా పట్టుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు సమాధానంగా... ‘తెలంగాణలో వాస్తవ జలదృశ్యం’ పేరిట టీపీసీసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో బుధవారం మూడున్నర గంటలకుపైగా జరిగిన కార్యక్రమంలో ఉత్తమ్‌తో పాటు టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఎస్సీసెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డి.కె.అరుణ, పి.సుదర్శన్‌రెడ్డి, ముఖ్యనేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. రీడిజైన్లలో భారీ అవినీతి: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ వెనుక భారీ అవినీతి కుట్ర ఉందని ప్రజెంటేషన్‌లో ఉత్తమ్ ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.38 వేల కోట్లతో ప్రతిపాదించారని.. ఆయకట్టు ఏమీ పెంచకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం అంచనాలను రూ.85వేల కోట్లకు పెంచిందని చెప్పారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 35 వేల కోట్లతో ప్రతిపాదించారు. దానిని జూన్‌లో రూ.47వేల కోట్లకు, జూలైలో రూ.50 వేలకోట్లకు పెంచారు. నెలకోసారి అంచనా పెరుగుతుందా? ’’ అని ఉత్తమ్ నిలదీశారు. సాగునీరివ్వడానికి ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిందేనని.. అయితే ప్రజల సొమ్మును దోపిడీ చేస్తుం టే కాంగ్రెస్ సహకరించదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు పేరు రావొద్దనే.. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఉత్తమ్ చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 26 నెలలైందని.. ఇప్పటిదాకా వాటికి నిధులెందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే భయంతోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి టెండర్లను ఎందుకు ఎక్సెస్ రేటుకు కట్టబెట్టిందని ఉత్తమ్ ప్రశ్నించారు. బహిరంగచర్చకు సిద్ధమా? ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితులు, సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమని.. మరి సీఎం కేసీఆర్ సిద్ధమా అని ఉత్తమ్ సవాలు విసిరారు. ప్రజెంటేషన్‌కు హాజరైన టీ జేఏసీ బుధవారం టీపీసీసీ ఇచ్చిన ప్రజెంటేషన్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ, ఉద్యమ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీ జేఏసీ ప్రతినిధులు జి.రవీందర్రావు, పిట్టల రవీందర్, గోపాలశర్మ, భూనిర్వాసితుల పోరాట సంఘం ప్రతినిధి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ అధ్యయన వేదిక కన్వీనర్ గాదె ఇన్నయ్య, అరుణోదయ విమల, తెలంగాణ ఉద్యమ వేదిక నేతలు చెరుకు సుధాకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రజెంటేషన్‌కు ప్రతిపక్షనేత కె.జానారెడ్డి దూరంగా ఉండడం గమనార్హం. టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన ప్రజెంటేషన్‌కు జానారెడ్డి రాకపోవడంపై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రతో ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేసేవిధంగా ఈ నెల 23న మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్లకు కాకుండా 148 మీటర్లకు ఒప్పందం చేసుకుంటే ప్రజలు శాశ్వతంగా నష్టపోతారన్నారు. మహారాష్ట్రలో ముంపు బాధితులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చినా ఫర్వాలేదని.. దానివల్ల తెలంగాణలో 80 వేల ఎకరాలను ముంపులేకుండా రక్షించుకోవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందానికి నిరసనగా 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నల్లజెండాలతో, వివిధ రూపాల్లో భారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. -
మా నీటికి అడ్డుపడితే ఊరుకోం
- ఏపీ నేతలకు మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక - కృష్ణాలో మా వాటా మేం వినియోగించుకుంటున్నాం - పక్క రాష్ట్రాల వాటాలో అదనంగా చుక్క కూడా కోరుకోవడం లేదు - ఆర్డీఎస్‌పై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు అడ్డుపడతారా? ఇది మానవత్వమేనా? - చర్చకు 10 రోజులుగా ప్రయత్నిస్తున్నా దేవినేని నుంచి స్పందన లేదు సాక్షి, హైదరాబాద్ కృష్ణా జలాల్లో తెలంగాణకు ఉన్న హక్కుల మేరకే నీటిని వినియోగించుకుంటున్నామని, పక్క రాష్ట్రాల వాటాలో ఒక్క చుక్క కూడా అదనంగా కోరుకోవడం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తమకు హక్కుగా సంక్రమించిన నీటికి అడ్డుపడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని, వాటిని వాడుకునేందుకు యత్నిస్తుంటే ఏపీ అడ్డుకోవడం సబబు కాదన్నారు. ‘‘ఆర్డీఎస్ కాల్వలఆధునీకరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగింది. ఇప్పుడు దాన్ని అమలు చేద్దామంటే ఏపీ అడ్డుకోవడం దారుణం. ఇది మానవత్వమేనా?’’ అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం మంత్రి చందూలాల్, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డిలతో కలిసి సచివాలయంలో హరీశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఎస్ పనుల ఆధునీకరణ కోసం కర్ణాటక వెళ్లి ఆ రాష్ట్రాన్ని ఒప్పించామని, ఇదే విషయమై చర్చిద్దామని పది రోజులుగా కోరుతున్నా ఏపీ మంత్రి దేవినేని ఉమ మాత్రం స్పందించడం లేదన్నారు. కర్ణాటక అధికారులు సోమవారం పనులు ఆరంభిస్తే కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ పనులు ఆరంభించరాదంటూ రాయచూర్ కలెక్టర్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు. న్యాయమైన వాటా కోరుతుంటే ఇలా పనులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. తక్షణమే ఆ లేఖ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పనులను కొనసాగించేలా చూడాలంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అవి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులే.. కృష్ణాలో మొత్తంగా 448 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని, అందులో ఉమ్మడి రాష్ట్రం సమయంలోనే.. 150 టీఎంసీలు ఏపీకి, 77 టీఎంసీలు తెలంగాణకు కలిపి మొత్తంగా 227 టీఎంసీలు కేటాయించారని మంత్రి హరీశ్ చెప్పారు. మిగిలిన 221 టీఎంసీల మిగులు జలాల ఆధారంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయించారని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం.. పట్టిసీమ నుంచి నీటిని తీసుకెళ్తే ఎగువ రాష్ట్రాలకు ఆ నీటిలో 45 టీఎంసీల మేర నీటి హక్కు లభిస్తుందన్నారు. ఇక 811 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉందని, అయితే ఇందులో 200 టీఎంసీలకు మించి తెలంగాణ వాడటం లేదని స్పష్టంచేశారు. కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013(ఉమ్మడి రాష్ట్రం)లోనే జీవో 72 ఇచ్చారని, అలాగే కృష్ణాలో 30 టీఎంసీల నీటితో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న జీవో 159 ఇచ్చారని మత్రి గుర్తుచేశారు. అలాంటప్పుడు అవి ముమ్మాటికీ పాత ప్రాజెక్టులేనని, వీటిపై కొత్తగా అపెక్స్ కమిటీ అనుమతులు అవసరం లేదన్నారు. ఉమ్మడి ఏపీలోనే నీటి కేటాయింపులు చేసి, సర్వేలు చేసి, నిధులు ఖర్చు చేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కొత్త ప్రాజెక్టులంటారా? అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. అధికార , ప్రతిపక్ష నేతల మధ్య కొట్లాటలకు తెలంగాణ ప్రాజెక్టులను ఎందుకు వేదికగా చేసుకుంటున్నారని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోసుకున్న ఉసురు చాలదా అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. -
'కేసీఆర్, హరీష్ నియోజక వర్గాలకేనా నీళ్లు'
- రీడిజైనింగ్ పేరిట లక్ష కోట్లు వృథా - వాగ్దానాల అమలులో కేసీఆర్ వైఫల్యం - డీసీసీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయం సుల్తానాబాద్ (కరీంనగర్): ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల కోసమే కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు తరలిస్తామని చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలో భాగమే ఈ ప్రాజెక్టు హడావుడి శంకుస్థాపన అని చెప్పారు. మ్యాప్‌కో సంస్థ సర్వే చేసి నివేదిక ఇచ్చి రీడిజైనింగ్ చేయాలని చెప్పిందనడంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. మహారాష్ట్రతో ఒప్పందంతో పాటు 30 రకాల అనుమతులు రాకుండానే శంకుస్థాపన హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తున్నప్పటికి వాగ్దానాల అమలులో వైఫల్యం చెందారని చెప్పారు. ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆచరణలో వైఫల్యం చెందారని చెప్పారు. గోదావరి నీళ్లను జిల్లాలో చెరువులు, కుంటలు నింపకుండా సీఎం సొంత జిల్లా మెదక్‌లోని తడకపల్లికి 50 టీఎంసీల నీరు తరలిస్తున్నారని చెప్పారు. హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేట, సీఎం నియోజకవర్గం గజ్వేల్‌కు ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్తున్నారే తప్ప ఇక్కడి ప్రజలకు నీరు అవసరం లేదనుకున్నారా ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.35వేల కోట్ల నుండి 80వేల కోట్లకు పెంచడంలో మతలబు ఉందన్నారు. యూనివర్సిటీలో 90 శాతం ఖాళీలు ఉన్నాయని వాటిపైదృష్టి సారించాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పటి వరకు 600 కూడా నిర్మించలేదని, జిల్లాలో 300ల ఎకరాలు దళితులకు కేటాయించలేదని చెప్పారు. -
ప్రాజెక్టులన్నీ ఖాళీ
రాష్ట్రంలో పూర్తిగా ఎండిపోయిన ప్రధాన నీటి ప్రాజెక్టులు ♦ గతంలో ఎన్నడూ లేనంతగా 561 టీఎంసీల నీటి కొరత ♦ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలు ♦ కనీస మట్టాలు సహా ఉన్న నీరు 167.68 టీఎంసీలే ♦ ఇందులోనూ వినియోగార్హమైన నీరు 10 టీఎంసీల లోపే ♦ కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ జలకళను కోల్పోయి నిర్జీవంగా మారాయి. వేసవి ముగిసేందుకు మరో నెలన్నర సమయమున్నా ఇప్పటికే పూర్తిగా ఎండిపోయాయి. చివరికి తాగేందుకూ నీరందించలేని పరిస్థితికి దిగజారాయి. గోదావరి, కృష్ణా పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులదీ అదే దుస్థితి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 561 టీఎంసీల మేర నీటి కొరత నెలకొంది. ప్రధాన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలే. ఇందులోనూ కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న వినియోగార్హమైన నీరు 10 టీఎంసీలకన్నా తక్కువేనని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది తాగునీటి కోసం ఆధారపడిన నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాల కన్నా దిగువన వెళ్లి తోడుకున్నా... ఐదారు టీఎంసీలకు మించి లభించే పరిస్థితి లేకపోవడం కలవరపెడుతోంది. రాష్ట్రంలోని ఈ దుర్భర, దుర్భిక్ష పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కేంద్ర జల సంఘానికి నివేదించింది. లభ్యతగా ఉన్న నీటినంతా తాగునీటికే మళ్లిస్తున్నామని వివరించింది. తాగునీటికీ సరిపోని దుస్థితి గత ఏడాది వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులోనూ ఆశించిన నీరు చేరలేదు. గోదావరి బేసిన్‌లోని సింగూరు, నిజాంసాగర్ , శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు రాలేదు. ఈ మూడు ప్రాజెక్టుల్లో కలిపి నిల్వ సామర్థ్యం 147 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం లభ్యతగా ఉన్నది 5 టీఎంసీలే. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో సుమారు 20 టీఎంసీల మేర నిల్వలు ఉన్నాయి. ఇక కడెం, ఎల్లంపల్లి, దిగువ మానేరు ప్రాజెక్టుల్లోకి కొద్దిపాటి నీరు చేరడంతో ప్రస్తుతం వీటిల్లో 8 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. అది కూడా గతేడాదితో పోల్చితే సుమారు 3 టీఎంసీలు తక్కువే కావడం గమనార్హం. ఇక కృష్ణా బేసిన్‌లోని జూరాలను మినహాయిస్తే... శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు మొత్తంగా 100 టీఎంసీలకు మించి నీరు రాకపోవడం ఆందోళనకరం. ఖరీఫ్, రబీ సాగు అవసరాలను పూర్తిగా పక్కనపెట్టి ఈ రెండు ప్రాజెక్టుల నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకే కేటాయించినా కూడా సరిపోని దుస్థితి. ఈ రెండు ప్రాజెక్టుల వాస్తవ నిల్వ సామర్థ్యం 527 టీఎంసీలు కాగా... ప్రస్తుతమున్నది 150 టీఎంసీలే. ఇవి కూడా ప్రాజెక్టుల్లో వినియోగించుకోవడానికి వీల్లేని కనీస మట్టంలోని నీళ్లే. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 729.67 టీఎంసీలుకాగా... ప్రస్తుతం ఉన్నవి 167.68 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ వినియోగార్హమైన నీరు 6 నుంచి 7 టీఎంసీలకు మించదు. వచ్చే రెండు నెలలు కష్టమే.. ప్రాజెక్టులన్నీ ఖాళీ కావడంతో వచ్చే రెండు నెలలు రాష్ట్రం దుర్భర స్థితిని ఎదుర్కోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. జూన్‌లో వర్షాలు మొదలైనా అవి ప్రాజెక్టుల పరీవాహకంలోని చిన్నపాటి కుంటలు, చెరువులు నిండేందుకే సరిపోతాయి. వర్షపు నీరు ప్రవాహాలుగా మారి ప్రాజెక్టుల్లోకి రావాలంటే భారీ వర్షాలు కురవాల్సిందే. గోదావరి బేసిన్లో జూన్‌లోనే వర్షాలు పడే అవకాశమున్నా, కృష్ణాలో మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఆగాల్సిన పరిస్థితి. ఈ దృష్ట్యా ప్రస్తుత నీటితో జూలై తొలివారం వరకు నెట్టుకురావడం కష్టం. సాగర్ పూర్తిస్థాయి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం ఏకంగా కనీస నీటిమట్టమైన 510 అడుగుల కన్నా దిగువన 507 అడుగులకు పడిపోయింది. ఈ ఎత్తులో 127.80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కానీ అత్యవసర పంపులు వాడి 505 అడుగుల వరకు తోడినా ఒక టీఎంసీకి మించి నీటిని వాడటానికి లేదు. ఇక శ్రీశైలంలో 784.8 అడుగుల వద్ద 22.20 టీఎంసీల నీళ్లున్నా... అందులో 780 అడుగుల వరకు వినియోగార్హమైన నీరు ఒక టీఎంసీయే. దాంతో 770 అడుగుల వరకు వెళ్లి నీటిని తోడుకోవాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. అంతగా నీటిని తోడినా గరిష్టంగా 4 టీఎంసీలకు మించి నీరు లభించదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 2 ప్రాజెక్టుల్లో కలిపి లభించే 5 టీఎంసీల నీటినే ఇరు రాష్ట్రాలు వాడుకోవాలి. ఇక ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల నుంచి 3 నుంచి 4 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశ ముంది. మొత్తంగా 6 నుంచి 7 టీఎంసీలకు మించి వాడటానికి రాష్ట్రానికి అవకాశం లేదు. ఈ నీటితోనే వచ్చే 2 నెలలు సర్దుకుపోవాలి. రాష్ట్రంలో కరువుపై కేంద్రం రాష్ట్రాల నుంచి వివరణ కోరగా... నీటి పారుదల శాఖ సోమవారం ప్రాజెక్టుల నీటి లభ్యతను వివరిస్తూ కేంద్ర జల సంఘానికి నివేదిక సమర్పించింది. -
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి
హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాములు గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, ఆయన అనుచరులను సీఎం కేసీఆర్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. రాములుతోపాటు అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. -
నీటి ప్రాజెక్టులతో రాష్ట్రాల అభివృద్ధి
జల వారోత్సవాల్లో అరుణ్ జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: నీటి ప్రాజెక్టులపై అధిక పెట్టుబడుల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు త్వరగా ఫలితాలిస్తాయని వివిధ రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయన్నారు. సోమవారమిక్కడ కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన జల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నీటిపారుదల రంగంలో పెట్టుబడులు పెట్టి సౌకర్యాలను కల్పిస్తే తరువాయి సీజన్లోనే దాని ప్రభావం కనపడుతుందన్నారు. ప్రాజెక్టులపై పెట్టుబడులకు ఆసక్తి కనబర్చిన రాష్ట్రాలను ప్రస్తావిస్తూ మధ్యప్రదేశ్‌తోపాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ దిశలో ముందంజలో ఉన్నాయని జైట్లీ చెప్పారు. మధ్యప్రదేశ్ వ్యవసాయాభివృద్ది రేటు అత్యధికంగా 22 శాతానికి చేరిందని, నీటిపారుదల వసతుల కల్పన వల్లే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ కూడా అదేవిధంగా చేసిందన్నారు. ఏపీలో ప్రభుత్వం ఇటీవల రెండు నదులను అనుసంధానించిందని, దాని ప్రభావం త్వరలో కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా అమలైన తర్వాత నీటిఎద్దడి అధికంగా ఉన్న అనంతపురం వంటి ప్రాంతాలకు నీరు అందుతుందన్నారు. భూగర్భ జలాలపెంపునకు కేంద్రం రూ.6వేల కోట్లు కేటాయించిందని జలవనరుల మంత్రి ఉమాభారతి చెప్పారు. తెలంగాణ పథకాల వివరణ.. తెలుగు రాష్ట్రాల నీటిపారుదల ప్రాజెక్ట్‌లను కేంద్రం కొనియాడిందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు చెప్పారు. కార్యక్రమంలో ఆయన తెలంగాణ ప్రాజెక్టులను వివరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడం, త్వరగా పూర్తయ్యే మధ్య, చిన్న తరహా ప్రాజెక్ట్‌లను పూర్తిచేయాలని ఈ కార్యక్రమంలో నిర్ణయించారన్నారు. -
'ఎన్ని ఆటంకాలు వచ్చినా కోటి ఎకరాలకు నీరిస్తా'
హైదరాబాద్: దుమ్ముగూడెం టెయిల్ పాండ్ దుర్మార్గమైన ప్రాజెక్టు అని చెప్పారు. కృష్ణా, గోదావరిపై మహారాష్ట్ర, కర్ణాటక 450 ప్రాజెక్టులు నిర్మించాయని అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ గోదావరి నుంచి ఈ ఏడాది చుక్క నీరు తెలంగాణ ప్రాజెక్టులకు రాలేదని పేర్కొన్నారు. అనేక విషయాలపై అధ్యయనం చేశాక ప్రాజెక్టుల రీడిజైన్ పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులు కట్టాలనుకుంటుంటే కొంతమంది కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతాం అని కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారు. బీడు భూములకు నీరు ఇచ్చి హరిత తెలంగాణగా మారుస్తామని చెప్పారు. ఒక్క పెన్ గంగపైనే మహారాష్ట్ర 40 ప్రాజెక్టులు కట్టిందని తెలిపారు. -
'ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలే'
హైదరాబాద్: ఉమ్మడిరాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులన్నింటికీ అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేలా ఏర్పాటుచేశారని అన్నారు. పర్యావరణ అనుమతులు రాకుండా ఉమ్మడి పాలకులు కుట్రలు చేశారని చెప్పారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్, ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈ విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ ఎదురుగా ఒక తెర, కుడి ఎడమ వైపుల రెండుతెరలు ఏర్పాటు చేశారు. ఇక శాసన మండలి దర్బార్ హాల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ తన వద్ద ఒక కంప్యూటర్ పెట్టుకుని, దాన్ని ఈ తెరలన్నింటికీ అనుసంధానం చేశారు. కాగా, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్, టీడీపీలు దూరంగా ఉన్నాయి. అసెంబ్లీలో ఇలా ప్రజంటేషన్ ఇవ్వడం సరికాదని కాంగ్రెస్ అంటోంది. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గోదావరిలో 940 , కృష్ణాలో376 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు, కుతుబ్ షాహీలు ఎన్నో చెరువులు తవ్వించారని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాంసాగర్ అని కేసీఆర్ చెప్పారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పారు. -
నది వద్దకు వెళితే కేసీఆర్ ఏం చేస్తారంటే..!
హైదరాబాద్: తెలంగాణ ప్రజలు నీళ్లకోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నీళ్లు సరిగా లేకనే తెలంగాణ నుంచి లక్షలమంది వలస పోయారని అన్నారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో భాగంగా సందర్భంగా ఆయన నదీమతల్లులను ఎంత గౌరవిస్తారో చెప్పారు. తల్లి గోదావరమ్మ, తల్లి కృష్ణమ్మ అంటూ సంబోధించారు. తాను ఎప్పుడు ఏ నది దాటుతున్నా అందులో పెద్దలు చెప్పిన ఆచారాన్ని గౌరవిస్తూ నాణేలు వేసేవాడినని, తాను వేసినన్ని నాణేలు తెలంగాణలో ఇంకెవరూ వేసి ఉండకపోవచ్చని అన్నారు. గత 35 ఏళ్లుగా తనకు ఒక్కడే కారు డ్రైవర్ అని, అతడు ఎప్పుడూ కార్లో చిల్లర డబ్బులు సిద్ధంగా ఉంచేవాడని, తాను అడగగానే ఇచ్చేవాడని అన్నారు. -
ఎత్తిపోతలపై సీఎం ‘పవర్’ పాయింట్!
- నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లు అవసరమని ప్రభుత్వ అంచనా - ఈ జూన్ నాటికే 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం - ఏటా విద్యుత్ వినియోగానికి అవసరమయ్యే ఖర్చు రూ.12 వేల కోట్లపైనే - అంచనాలు సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజక్టులకు విద్యుత్ అవసరాలు హెచ్చుగానే ఉండనున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న 16 ప్రాజెక్టులకు 10 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరం ఉంటుందని అంచనా. ఈ ఏడాది జూన్-జులై నాటికి అందుబాటులోకి వచ్చే ఎత్తిపోతల పథకాలకు సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ నివేదిక తయారు చేసింది. ఈ ఎత్తిపోతల విద్యుత్ అవసరాలు, వాటికయ్యే ఖర్చు తదితరాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. 16 ఎత్తిపోతల ప్రాజెక్టులతో సుమారు 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, మరో 3 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎత్తిపోతల పథకాలతో సుమారు 507 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాణహిత, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలను మినహాయిస్తేనే పాక్షికంగా నిర్మితమైన దేవాదుల, ఎల్లంపల్లి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులకే సుమారు 2,800 మెగావాట్ల వరకు విద్యుత్ అవసరం ఉంది. కొత్తగా చేపట్టిన ప్రాణహిత, కాళేశ్వరాలకు సుమారు 3,640 మెగావాట్లు, పాలమూరు, డిండికి కలిపి 3,500 మెగావాట్లు అవసరమని అధికారులు లెక్కించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ వినియోగంలోకి వచ్చి 9,975 మెగావాట్ల విద్యుత్‌ను వాడుకుంటే యూనిట్‌కు రూ.5 చొప్పున చెల్లించినా ఏటా మొత్తంగా సుమారు రూ.12 వేల కోట్ల భారం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రి, సింగరేణి-జైపూర్, ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఏ జిల్లా ఎత్తిపోతల పథకాల అవసరాలను ఎలా తీర్చుతామన్న దానిపై సీఎం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
అసెంబ్లీలో ప్రజెంటేషన్ వద్దు: కాంగ్రెస్
- బీఏసీలో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్ - రీడిజైనింగ్‌పై అన్ని పార్టీలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, మహారాష్ట్రతో ఒప్పందం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి శాసన సభను వేదిక చేసుకునేందు కు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించొద్దని భావిస్తోం ది. ఈ నెల 31న సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇస్తామని ఆదివా రం బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తరఫున హాజరైన భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి వ్యతిరేకించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలన్న డిజైన్‌ను మార్చే ముందు పార్టీలన్నింటితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీరివ్వాలనే డిజైన్‌ను ఎందుకు మార్చారన్నా రు. ప్రాణహిత ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించ డం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నారు. మేడిగడ్డ వద్ద రిజర్వాయరు నిర్మాణం వల్ల ఎత్తిపోతల అంచనా వ్యయం, నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుందన్నారు. దీంతో ప్రజలు, రైతులపై భారం పెరుగుతుందన్నారు. రీడిజైన్‌తోపాటు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత అన్నీ సక్రమంగా చేసినట్టుగా చెప్పుకుంటామంటే, చూస్తూ కూర్చోవడం ప్రతిపక్షాల పని కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు. తమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఒనగూరే ప్రయోజనం, ఇప్పటిదాకా జరిగిన పనులు, రీడిజైన్‌తో నష్టం, అవినీతి వంటి వాటిపై మాట్లాడటానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలన్నారు. అయితే దీనిపై ఎటూ తేలకపోవడంతో నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేశారు. ఒకవేళ ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. అధికార పక్షం అవినీతిని ఎండగట్టడానికి అదే అసెంబ్లీని వేదిక చేసుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. దీనిపై పూర్తి సమాచారంతో మాట్లాడేందుకు ముగ్గురు సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. -
మన అలుగును మనమే నిర్మించుకుందాం
► ‘మనరాయి.. మనసిద్ధేశ్వరం’ నినాదంతో కదులుదాం ► 10వేల మందితోపనులకు పూనుకుందాం ► రాయలసీమ జలసాధన కార్యాచరణ సదస్సులో నేతల పిలుపు నంద్యాల రూరల్: ‘జలం ఉంటే తప్ప రాయలసీమ కరువుకు పరిష్కారం దొరకదు.. ఇందుకోసం మనకు మనమే కృష్ణానదిపై సిద్ధేశ్వరం అలుగును నిర్మించుకుందాం. ఇందుకోసం పల్లెలకు వెళ్లి ప్రజలను చైతన్యం చేద్దాం.. జూన్ 2వ వారంలో ‘మనరాయి-మన సిద్ధేశ్వరం’ నినాదంతో 10వేలమందితో తరలివెళ్లి అలుగు నిర్మాణ పనులు మొదలెడదాం’ అని రాయలసీమ జల సాధన కార్యాచరణ సదస్సులో నేతలు పిలుపునిచ్చారు. నంద్యాల త్రినేత్ర అట్ల ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన సదస్సులో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జాదశరథరామిరెడ్డి, రాయలసీమ జేఏసీ కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ భాస్కర్ జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కరువు సీమలోని నీటి ప్రాజెక్టులు కోస్తా ప్రాంతానికి జలసంపదగా మారాయని,వీటి వల్లనే ప్రాంతీయ విభేదాలు పెరుగుతున్నాయన్నారు. రాయలసీమ వెనుకబాటుకు కారణాలను వెతికి పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు రాజకీయాలతో పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. సీమప్రాంతవాసులు ఓట్లు వేయలేదనే సాకుతో ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తుండడం బాధాకరమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బడ్జెట్లో కూడా అరకొర నిధులతో సరిపెట్టారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం.. రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి చైతన్యం తెద్దామని నాయకులు పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులతో కలిసి ఐక్యంగా శాంతియుత ఉద్యమం చేపడదామన్నారు. సీమ ప్రాంతంలో తాగేందుకు గుక్కెడు నీరు కూడా లభించని పరిస్థితి ఉందన్నారు. ఉపాధి లేక ప్రజలు వలసబాట పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భావి తరాల సంక్షేమం కోసం ఉద్యమ బాట పట్టక తప్పదని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ రాయలసీమ అభివృద్ధికి పాటుపడ్డారని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతుల ఉద్యమానికి విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కుందూ పోరాట సమితి నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, ైవె ఎన్రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు సోమసుందర్శర్మ, రాధాకృష్ణ, డాక్టర్ కృష్ణమూర్తి, బండి నారాయణస్వామి, విద్యార్థి సంఘం నాయకులు రవికుమార్, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, నంది రైతు సంఘాల నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం'
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నామని, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న రోజును బ్లాక్ డేగా వర్ణించిన కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడవద్దని, బాధ్యతగా మాట్లాడాలని చెప్పారు. 2018 కల్లా మిషన్ భగీరథను పూర్తి చేసి.. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే... ► కేజీ టు పీజీ తప్ప అన్ని హామీలు అమలు చేశాం ► ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం ► టెక్స్టైల్ హబ్‌గా వరంగల్ ► వచ్చే ఎన్నికల్లో తండాలను పంచాయతీలుగా మార్పు ► 16 శాతం కరెంటు వినియోగం పెరిగినా ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ► మిషన్ భగీరథ పూర్తి అయితే ఓట్లు పడవని కాంగ్రెస్‌కు భయం ► ఈ ఏడాది డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలతో పాటు 12 మున్సిపాలిటీల్లో ఇంటింటికి మంచి నీళ్లు ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ కల్యాణలక్ష్మీ పథకం ► తొలిదశలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ► రుణమాఫీ కింద ఈ ఏడాది చెల్లింపుతో 75 శాతం పూర్తి ► ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం అమలుతో రూ. 33 వేల కోట్ల పెట్టుబడులు ► ఐటీ సెక్టార్లో బెంగళూరు తర్వాత స్ధానంలో తెలంగాణ ► త్వరలో హైదరాబాద్‌కు గూగుల్ క్యాంపస్ నిర్మాణంతో పాటు కాగ్నిజెంట్, అమెజాన్ ► ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం ఎప్పుడూ చెప్పలేదు..లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం ► లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం ఎలాంటి అనుమానం అక్కర్లేదు. సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
స్వార్థం కోసమే మహారాష్ట్రతో ఒప్పందం
► ఎర్రవెల్లి కోసమే ప్రాజెక్టులు ► ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి మంకమ్మతోట : వ్యక్తిగత స్వార్థప్రయోజనాల కోసమే మహారాష్ర్ట ప్రభుత్వంతో సీఎం కేసీఆర్ నీటిప్రాజెక్టుల ఒప్పందం కుదుర్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేసీఆర్ ఏదో ఘనకార్యం సాధించినట్లు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు కాకముందే దివంగత నే త వైఎస్.రాజశేఖరరెడ్డి2007లోనే తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడానికి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7జిల్లాల్లోని 16లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు, 30 టీఎంసీల తాగునీరు, 16టీఎంసీ నీరుఇండస్ట్రియల్కు అందించేందుకు రూపకల్పన చేశారన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా రీడిజైన్ పేరుతో నిర్లక్ష్యం చేస్తు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అన్నిఅనుమతులతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉందని, జాతీయ హోదా కల్పించి దీన్ని పూర్తి చేస్తే తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీరు అందేదని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టులను మార్పులు చేసిన దాఖలాలు లేవన్నారు. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు నీరు తీసుకుపోవడానికి రీడిజైన్ పేరుతో కాల యాపన చేస్తూ మహారాష్ర్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారన్నారు. కుటుంబంతప్ప ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్ ఎల్లంపల్లి పూర్తి అయినా ఇంతవరకు చుక్క నీ రుఇవ్వలేదన్నారు. రీడిజైన్‌తో మహా రాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎం సీల నీరు అందిస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డి మాండ్ చేశారు. బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దేవరనేని వేణుమాధవ్‌రావు, ప్రచా రకమిటీ జిల్లా అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి,నాయకులు దుబ్బాక సంప త్, యాదగిరి, రహీం పాల్గొన్నారు. -
చినబాబు.. కోటా!
అధికారపార్టీ నేతల అరాచకం 60సీ కింద బాలాజీ రిజర్వాయర్పనుల విభజన స్లో ప్రోగ్రెస్ కింద పాత కాంట్రాక్టర్‌పై వేటు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు జిల్లాలోని నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువ పనులను వాటాలు వేసి పంచుకుంటున్న అధికారపార్టీ నాయకులు మరో అక్రమానికి తెరతీశారు. గాలేరు-నగరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను చినబాబు అనుచరులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్‌పై పనుల ఆలస్యం అనే నెపం నెట్టారు. అసలు విషయమేమంటే పనులు చేపట్టేందుకు పలు శాఖల నుంచి క్లియరెన్సులే రాలేదు. పనులూ ప్రారంభమే కాలేదు. అయినా పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొనడం కొసమెరుపు. తిరుపతి తుడా: గాలేరు-నగిరి కాలువ పరిధిలోని బాలాజీ రిజర్వాయర్ పనులను అధికారపార్టీ సానుభూతి పరులకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. బాలాజీ రిజర్వాయర్ పనులను 60-సీ కింద విభజించి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అనుయాయులైన మరో ఇద్దరికి కట్టబెట్టేందుకు అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మూడో కంటికి తెలియకుండా సంబంధిత అధికారులు ఈ పనులను చక్కబెట్టేశారు. పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెడుతూ ఈ పనులు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. 2007లో అగ్రిమెంట్ పొందిన హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ జీఎన్ఎస్స్ 11వ ప్యాకేజీ కింద బాలాజీ రిజర్వాయర్ పనులను టెండర్ ద్వారా చేజిక్కించుకుంది. 2011 కల్లా బాలాజీ రిజర్వాయర్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే నిర్మాణం చేపట్టాలంటే డీజీపీఎస్ సర్వే చేసి ఫారెస్ట్ అనుమతులు పొందాల్సి ఉంది. ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు రాకపోవడం, నిధులు విడుదలలో పక్షపాతం వంటి అనేక కారణాలు వెంటాడటంతో బాలాజీ రిజర్వాయర్ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఫారెస్టు క్లియరన్స్ లేకపోవడం సంబంధిత అధికారులదే తప్పువుతుంది, కాంట్రాక్టర్‌ది ఎలాంటి తప్పులేకపోయినా స్లో ప్రోగ్రెసివ్ కింద పాత అగ్రిమెంట్‌ను నిలుపుదల చేస్తూ 60-సీ కి విభజించి మరో ఇద్దరికి (పీఎంఆర్, చెన్నకేశవ కన్స్టక్ష్రన్సకు) పనులను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీనికితోడు రిజర్వాయర్ అంచనా వ్యయం రూ.125.55 కోట్లు కాగా.. తాజాగా మరో రూ.90 కోట్లను పెంచి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చారనీ, ఇందులో చినబాబుకు భారీగా వాటా దక్కనున్నట్లు సమాచారం. టెండర్‌కు వెళ్లకుండా.. 60సీ తెరపైకి స్లో పోగ్రెస్ కింద పాత కాంట్రాక్టర్‌ను నిలుపుదల చేస్తూ అదే అగ్రిమెంట్‌తో 60-సీ కింద పనులను మరో ఇద్దరికి అప్పగించేశారు. జీఎన్ఎస్ఎస్లో భాగమైన బాలాజీ రిజర్వాయర్ 11వ ప్యాకేజీ కిందకి వస్తుంది. 2007లో హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసీవ్ కంస్ట్రక్షన్స్ టెండర్ ద్వారా రూ.125.55 కోట్లతో పనులను దక్కించుకున్నారు. స్లో ప్రోగ్రెస్ కింత పాత కాంట్రాక్టర్‌ను నిలుపుతూ అదే అగ్రిమెంట్ కింద మరో ఇద్దరికి పనులను అప్పగించారు. ప్రభుత్వం- కాంట్రాక్టర్ల మధ్య తలెత్తడానికి కారణమైన పనులు, అనవసర క్లైమ్లు వచ్చిన పనుల్ని విడదీయడానికి, స్లో ప్రోగెస్ (పనుల్లో జాప్యం) వంటి కారణాలు ఎదురైతే పనుల్ని విడదీసి మరొకరికి ఇవ్వడం కోసం 60-సీ నిబంధన తెరపై తీసుకొస్తారు. ఈ నిబంధన బాలాజీ రిజర్వాయర్‌కు వర్తించకపోయినా చినబాబు అండతో60సీ తెరపైకి తీసుకొచ్చి పచ్చనేతలకు కట్టబెట్టారు. స్లో ప్రోగ్రెస్ ఉంటే టెండర్‌ను రద్దుచేసి మళ్లీ టెండర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. 60-సీని అడ్డుపెట్టుకుని టెండర్‌కు వెళ్లకుండా అధికార పార్టీ నేతలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బరితెగించింది. పాత టెండర్ పేరుతో ప్రస్తుతం పనులు అప్పగించినా, వాటి అంచాలను పెంచి కోట్ల రూపాయలు కొట్టేసేందుకు పెద్దకుట్ర జరుగుతోంది. మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో జీఎన్ఎస్ఎస్కు నిధులు కేటాయించనుండటంతో చినబాబు తన అనుయాయులకు లబ్ధిచేకూర్చి తద్వారా సొమ్ముచేసుకునేందుకు ఈ కుంభకోణానికి తెరలేపారు. తిరుపతి డివిజన్ గాలేరు-నగరి చీఫ్ ఇంజనీరు ఈ అంశంపై సాక్షి వివరణ కోరగా.. సెలవులో ఉన్న కారణంగా తనకు పూర్తి సమాచారం తెలియదని అనారోగ్యం దృష్టా సెలవు పెట్టానని. రెండు రోజుల్లో పూర్తి వివరాలు చెబుతానని తెలిపారు. స్లో పోగ్రెసివ్ ఎలా అవుతుంది బాలాజీ రిజర్వాయర్ పనులు చేయాలంటే ఇతర శాఖలకు సంబంధించి ముందస్తు అనుమతులు ఉండాలి. 2011 కల్లా ఈ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ఫారెస్టు అనుమతులు లేవు. అనుమతులు ఇవ్వకనే టెండర్ పిలిచి పనులను అప్పగించారు. ఆ తరువాతైనా అనుమతులు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు ప్రారంభమే కాని పనులకు స్లో పోగ్రెస్ అనే కారణంతో పాత కాంట్రాక్టర్‌కు చెక్ పెట్టి అగ్రిమెంట్‌ను రద్దు చేయడం గమనార్హం. -
ఇరిగేషన్లో 108 అదనపు పోస్టులు
♦ భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ♦ కొత్తగా 8 సీఈ, 7 ఎస్ఈ, 21 ఈఈ, ♦ 55 డీఈఈ పోస్టులు ♦ పాలమూరు ప్రాజెక్టుకు 26, కాళేశ్వరానికి 30, డిండికి 16, పెన్‌గంగకు 14 పోస్టులు ♦ కొత్తగా డీఏఓ, సీఏఓ పోస్టుల మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం 108 అదనపు పోస్టులకు పచ్చజెండా ఊపింది. కృష్ణా, గోదావరి నదులపై పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్‌గంగ వంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీలాంటి పాత ప్రాజెక్టులను కూడా బలోపేతం చేస్తున్నందున అందుకు అవసరమైన అధికారులను నియమించుకోవాలని భావించింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈలు, ఏఈఈల నియామక ప్రక్రియ సాగుతున్నందున సీనియర్ అధికారులందరికీ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం, కొత్తగా 108 ఉన్నతాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి జీతభత్యాల రూపేణా ఏటా రూ.9.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే 33 భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు గత బడ్జెట్లో రూ.8 వేల కోట్లు కేటాయించారు. మరోపక్క రూ.2 వేల కోట్లతో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులు పుంజుకున్నాయి. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు ఉంటాయని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2017 నాటికి పూర్తి చేసేలా, కొత్త ప్రాజెక్టులను అప్పటిలోగా పాక్షికంగా పూర్తి చేసేలా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం నీటిపారుదల శాఖలో కేవలం నలుగురు మాత్రమే పూర్తిస్థాయి చీఫ్ ఇంజనీర్ పోస్టుల్లో ఉండగా, మరో పది చోట్ల అదనపు బాధ్యతలు చూస్తున్నారు. చిన్న నీటిపారుదల శాఖ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ, నాగార్జునసాగర్, కరీంనగర్, మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ల పోస్టుల్లో ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్లంతా అదనపు బాధ్యతలు చూస్తున్నవారే. దీనికితోడు ప్రస్తుతం ఇంజనీర్ ఇన్ చీఫ్లుగా బాధ్యతలు చూస్తున్న ముగ్గురికి పదవీకాలం పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టులను వెంటనే భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 మంది సీఈలు.. 46 మంది ఎస్ఈలు తాజా నిర్ణయంతో ఇప్పటికే ఉన్న 14 మంది సీఈ (చీఫ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 8 మందిని, ప్రస్తుతమున్న 39 మంది ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజనీర్)లకు తోడుగా మరో ఏడుగురిని నియమించే అవకాశం లభించింది. ఇకపై మొత్తంగా సీఈలు 22, ఎస్ఈలు 46 మంది ఉండనున్నారు. ఇక వీటితోపాటే ప్రస్తుతమున్న 183 మంది ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 21 మందిని, ఇప్పుడున్న 619 మంది డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)లకు తోడుగా మరో 55 మందిని, కొత్తగా 15 మంది డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు (డీఏఓ), ఇద్దరు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ల (సీఏఓ) పోస్టులను శాఖాపరమైన పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో పాలమూరు రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, పెన్‌గంగ, కాడా, విజిలెన్స్‌లతో పాటు మరో రెండు విభాగాలకు కొత్తగా చీఫ్ ఇంజనీర్లను నియమించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో పాలమూరు ప్రాజెక్టుకు సీఈ, ఎస్‌లతో పాటు 5మంది ఈఈలను, 13 మంది డీఈఈలను, 6 మంది డీఏఓలను అంటే మొత్తంగా 26 పోస్టులను కేటాయించగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఈ, 2 ఎస్ఈ, 7 ఈఈ, 16 డీఈఈ, 4 డీఏఓ పోస్టులను అంటే మొత్తంగా 30 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. డిండికి మొత్తంగా 16 పోస్టులు, పెన్‌గంగకు 14 పోస్టులను భర్తీ చేయనుంది. -
'ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి చెక్‌డ్యాములు'
తాండూరు (రంగారెడ్డి జిల్లా): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి వాటికి అనుసంధానంగా అవసరమైన చోటల్లా చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రగతిని శనివారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో వాగులు, వంకలు ఎక్కడున్నాయో అక్కడంతా సర్వేచేసి వీలైనన్ని ఎక్కువ చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల అంగీకారంతోనే భూసేకరణ ప్రక్రియ కొసనాగిస్తున్నామని, భూసేకరణ ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తామని వివరించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నేతలు హరీశ్వర్‌రెడ్డి, గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'మాజీ సీఎం, మంత్రులకు ముడుపులిచ్చాం'
వాషింగ్టన్: సంచలనం రేపిన నీటి ప్రాజెక్టుల్లో ముడుపుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అమెరికా కేంద్రంగా నడుస్తోన్న లూయీస్ బెర్గర్ అనే నిర్మాణ సంస్థ.. గోవాలో నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఎవరెవరికి ఎంతెత ముడుపులిచ్చిందో ఫెడరల్ కోర్టుకు వెల్లడించింది. ఆ సంస్థ ప్రతినిధులు రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు కోర్టుకు చెప్పిన వివరాలను బట్టి.. గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మాజీ మంత్రి చర్చిల్ అలెమోలకు దాదాపు రూ.6 కోట్లు లంచంగా ఇచ్చి లూయీస్ కంపెనీ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నమని, ఎఫ్ఐఆర్ నమోదుకు తగిన ఆధారాలను సేకరించేపనిలో ఉన్నామని గోవా పోలీసులు చెప్పారు. 2009లో గోవాలో నిర్మించతలపెట్టిన భారీ తాగునీటి, సరఫరా, మురుగు నీటి మళ్లింపు ప్రాజెక్టుల్లో ఈ ముడుపుల వ్యవహారం చోటుచేసుకుంది. కాగా, మాజీ సీఎం కామత్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేస్తున్నారు. కుంభకోణం వెలుగులోకి వచ్చిందిలా.. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే లూయీస్ బెర్గర్ కంపెనీ తన వార్షిక పద్దుల్లో 'కమిట్మెంట్ ఫీజు', 'మార్కెటింగ్ ఫీజు', 'ఆపరేషన్ నిర్వహణా ఖర్చులు' అనే పేర్లతో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపింది. దీంతో అనుమానం వచ్చిన అక్కడి ఆదాయం పన్ను శాఖ అధికారులు మొత్తం వ్యవహారంపై కూపీలాగగా ముడుపుల విషయం బయటపడింది. కంపెనీ ప్రతినిధులైన రిచర్డ్ హిర్ష్, జేమ్స్ మెక్లాంగ్లు విచారణలో నేరం అంగీకరించడంతో కోర్టు వారికి 17.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. మొదట లంచం తీసుకున్న వివరాలను వెల్లడించడానికి కోర్టు నిరాకరించినప్పటికీ తర్వాత ఆ విషయాలన్నీ బహిర్గతమయ్యాయి. బెర్గర్ సంస్థ ప్రతినిధులకు విధించే శిక్షలకు సంబంధించి నవంబర్‌లో తుది తీర్పు వెలువడనుంది. ఈ కంపెనీకి హైదరాబాద్ నగరంలోనూ ఓ కార్యాలయం ఉడటం గమనార్హం. -
‘నిద్ర’మాని నిధులివ్వండి
బెళుగుప్ప : రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రపోతే అవి పూర్తి కావాని, నిధులు కేటాయిస్తేనే సాధ్యమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో మంగళవారం లక్ష సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీపీ వీరన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హంద్రీ నీవా మొదటిదశ ఆయకట్టుకు ఎగనామం పెట్టి చిత్తూరు, కుప్పంకు నీటిని తరలించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సంక్రాంతి సంబరాలకు రూ.150 కోట్లు, హెలికాప్టర్ ఖర్చు, విజయవాడ, హైదరాబాద్‌లలో కేబినేట్ ఖర్చులకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు తప్ప రాయలసీమ కరువు రైతులకు సాగునీటికి నిధులు వెచ్చించి నీటిని అందించలేక పోతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ నీవాకు రూ. 5800 కోట్లు ఖర్చు చేసి జీడిపల్లి వరకు కృష్ణా జలాలు తీసువచ్చే విధంగా కృషిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌కు అయినా మొదటిదశకు సాగునీరు అందించాలన్నారు. నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు సాగునీరు, బెళుగుప్ప మండల పరిధిలో మాత్రమే జీడిపల్లి రిజర్వాయర్ కింద 26,500 ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇవ్వాలని ఉద్యమించాలని, దీనిపై లక్ష సంతకాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేద్దామని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హంద్రీ నీవా కింద భూములకు ఒక తడి ఇస్తే బంగారు పంటలు పండుతాయన్నారు. మొదటి దశ ఆయకట్టుకు ప్రస్తుత ఖరీఫ్‌లో నీటిని అందించాలని, లేకపోతే కాలువలు పగుల గొట్టి నీటిని తీసుకుపోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా రైతులు సమైక్యంగా పోరాడాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రదాన కార్యదర్శి దుద్దేకుంట రామాంజనేయులు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. బెళుగుప్ప సింగిల్‌విండో అధ్యక్షుడు శివలింగప్ప, బెళుగుప్ప సర్పంచ్ రామేశ్వరరెడ్డి, కాలువపల్లి ఎంపీటీసీ వెంకటేశులు, పార్టీ మండల ఉపాధ్యక్షుడు అశోక్, శీన, నాయకులు రాజన్న, తిప్పేస్వామి నాయక్, హర్షకుమార్‌రెడ్డి, బాస్కర్‌రెడ్డి, చౌదరి, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల నిలయాలు
సుమారు 35శాతం జనాభా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో నివసిస్తున్నా మౌలిక సౌకర్యా లు లేక పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునికతను సంతరించుకోవాల్సిన కాలనీలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. అటు సొంత ఆదాయం సరిపోక, ఇటు ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో అందక పాలకమండళ్లు సతమతమవుతున్నాయి. పాలనను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం మున్సిపాలిటీ లు మురుగు కూపాలుగా మారాయి. మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలుండగా సుమారు 14లక్షలకు పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతుండడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా అంచనాలకు మించుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల లేకపోవడంతో పట్టణాలు మురికి కూపాలను తలపిస్తున్నాయి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 243 వార్డులకు 124 వార్డుల్లో మురికి వాడలుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా అంతర్భాగంగా ఉన్న కాలనీల్లో డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఆధునికీకరించడం లేదు. మరోవైపు శరవేగంగా వెలుస్తున్న కొత్త కాలనీల్లో సౌకర్యాలు కల్పించడంలేదు. నిధుల కొరతను పాలకమండళ్లు కారణంగా చూపుతున్నాయి. గ్రేడ్-1 మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌లో గతంలో నిర్మించిన కోయిలసాగర్, రామన్‌పాడు తాగునీటి పథకాలు పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వడం లేదు. నారాయణపేట, షాద్‌నగర్, కల్వకుర్తిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. గద్వాలలో చేపట్టిన తాగునీటిపథకం పనులు ఆగిపోయాయి. షాద్‌నగర్‌కు మెట్రో వాటర్‌వర్క్స్ నుంచి నీరు అందించాలని నిర్ణయించినా సాంకేతిక సమస్యల మూలంగా ప్రణాళిక ఆచరణలోకి రావడం లేదు. అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ చెత్త సేకరణ, తరలింపు, డంపింగ్ సమస్యగా తయారైంది. కనీసం ఒక్కో మున్సిపాలిటీ సగటున 20 నుంచి 50 ఎకరాల మేర డంపింగ్ యార్డు స్థలాలను సమకూర్చుకోవాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదు. మురికివాడల వాసులకు ఇళ్ల స్థలాలు, పక్కాగృహాలు నిర్మించి ఇవ్వడంతోపాటు జీవనోపాధి కల్పిం చాల్సి ఉన్నా పాలక మండళ్లు, ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. పట్టాలెక్కని పట్టణ పాలన సుమారు రెండేళ్ల ప్రత్యేక అధికారుల పాలన అనంతరం ఎట్టకేలకు సుమారు ఐదునెలల క్రితం మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. కోర్టు కేసుల మూలంగా అచ్చంపేట, కొల్లాపూర్ నగర పంచాయతీల్లో ఎన్నిక నిలిచిపోయింది. అయితే మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, ఐజ మినహా అన్నిచోట్లా పూర్తిస్థాయి కమిషనర్లు లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోంది. మౌలిక వసతుల కల్పనలో కీలకంగా వ్యవహరించే సాంకేతిక సిబ్బంది లేకపోవడంతో సమస్యలు రెట్టింపవుతున్నాయి. ఎస్ఎఫ్సీ, టీఎఫ్సీ, ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్లు, బీఆర్జీఎఫ్ తదితర పద్దుల కింద నిధులు విడుదలవుతున్నా సకాలంలో అందడం లేదు. ఆస్తి, నల్లా పన్ను, సేల్స్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు, ఇంటి నిర్మాణ అనుమతులు తదితరాల ద్వారా మున్సిపాలిటీలు సొంతంగా ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం ద్వారా అందే నిధులను ప్రత్యేకించిన పనులకే వాడాలనే నిబంధన కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా తయారయ్యాయి. కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల బిగింపు తదితరాల కోసం జనరల్ ఫండ్‌పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. -
తెలంగాణకు సంపూర్ణసహకారం
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు * సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం * సానుకూలంగా వ్యవహరించేలా ప్రయత్నిస్తా.. * ఊరూరా గోదావరి జలాలు రావాలి.. ప్రజల కష్టాలు తీరాలి * కేసీఆర్ ఆధ్వర్యంలో విద్యాసాగర్‌రావుకు ఘనంగా పౌర సన్మానం * ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చొరవ చూపాలని కోరిన ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఊరూరా గోదావరి జలాలు రావాలి. ప్రజల కష్టాలు తీరాలి. సముద్రం లేదనే లోపాన్ని దూరం చేసుకునేలా గోదావరి నదిని నౌకాయానికి వీలుగా తీర్చిదిద్దాలి. ఈ రెండు సుసాధ్యమే. గోదావరి నీటితో తెలంగాణ లబ్ధి పొందేలా మహారాష్ట్ర గవర్నర్‌గా నాకున్న అధికారాలను వినియోగిస్తాను. అక్కడి బీజేపీ ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తాను’’ అని ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారమిక్కడ ఆయనకు పౌర సన్మానం నిర్వహించింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ తదితరులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ... ఎంతో విలువైన గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ నీటి ప్రాజెక్టులు సాఫీగా పూర్తయ్యేందుకు వీలుగా.. మహారాష్ట్ర ప్రభుత్వం చేయూత అందించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్‌గా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ పౌరసన్మానం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ‘‘ఇప్పుడు కొందరు నేతలు వింతగా వ్యవహరిస్తుంటారు. ఆ మధ్య కేసీఆర్ సింగపూర్ వెళ్తే... ఓ నేత నాదగ్గరకొచ్చి ‘అన్నా... కేసీఆర్ ఆరోగ్యం బాగోలేనట్టుంది. అందుకే విదేశాలకెళ్తున్నారు. గతంలో కేసీఆర్ కాళ్లు బాగా ఊపుతుండేవారు.. ఈ మధ్య బాగా తగ్గించారు.. అది అనారోగ్య లక్షణమేమో’ అని అన్నాడు. ఆయనకేం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడని నేను చెప్పి పంపా’’ అని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ఇలా యద్భావం తద్భవతే అన్న తరహాలో నేతలు ఆలోచించొద్దంటూ చమత్కరించారు. అధిష్టానాన్ని ఒప్పించిన నేత: కేసీఆర్ సుదీర్ఘకాలం కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యాసాగర్‌రావు పాత్ర అమోఘమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కొనియాడారు. తెలంగాణకు అనుకూలంగా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవటంలో కృషి చేసిన వారిలో ఆయన కూడా ఒకరని పేర్కొన్నారు. అలాంటి తెలంగాణ నేత మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ కావటం అభినందనీయమని, ఆయనను సత్కరిస్తే తెలంగాణ తనకు తాను సత్కరించుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. కరెంటు విషయంలో చర్చించేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా విద్యాసాగరరావు తనకు సహకరించారని, ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించేలా చొరవచూపుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజకీయాల్లో జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్న విద్యాసాగరరావు నేటి తరం నేతలకు ఆదర్శప్రాయుడని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కిరణ్ సర్కారును.. కడిగిపారేసిన కాగ్ !
నిధుల విడుదల జాప్యంతో సకాలంలో నీటి ప్రాజెక్టులు పూర్తికాలేదన్న కాగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం పెరిగి ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం సంక్షేమ పథకాల అమల్లోనూ కిరణ్ సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించిన కాగ్ లబ్ధిదారులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారని స్పష్టీకరణ ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని తుడా,స్విమ్స్ యాజమాన్యాలకు చీవాట్లు సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాలకు బడ్జెట్లో నిధు ల కేటాయింపునకు విడుదలకూ పొంతన కుదరకపోవడం వల్ల ప్రగతి తిరోగమిస్తోందని కంప్ట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. నిధుల విడుదలలో నిర్లక్ష్యంవల్ల సాగునీటి ప్రాజెక్టుల అం చనా వ్యయం అంతకంతకూ పెరి గి ప్రభుత్వ ఖజానాపై రూ.12,591.63 కోట్ల భారం పడిందని తేల్చింది. ఇందిరప్రభ, రాజీవ్ యువకిరణాలు, మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు వంటి పథకాల్లోనూ లబ్ధిదారులకు మొండిచేయి చూపారని పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను శనివారం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పటి కిరణ్ ప్రభుత్వం నిర్వాకాలను కాగ్ తూర్పారబట్టింది. సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేసేందు కు 2011-12లో ‘గ్రీన్ చానల్’ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ.. తాను ప్రవేశపెట్టిన విధానాన్నే కిరణ్ సర్కారు అపహాస్యం చేసింది. బడ్జెట్లో కేటాయించిన మేరకు ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. 2011-12,2012-13 బడ్జెట్లలో సాగునీటి ప్రాజెక్టులకు అతి తక్కువ నిధులు విడుదల చేసింది. నిధుల కొరతకు భూసేకరణ సమస్య తోడవడంతో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. స్టీలు, సిమెంటు, ఇంధనం వంటి ధరలు పెరగడంతో సా గునీటి ప్రాజెక్టుల వ్యయం అంతకంతకూ పెరిగింది. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2007-08లో రూ.399 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా 88,300 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 23,666 ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీళ్లందించాలని, ఐదు లక్షల మంది దాహార్తి తీర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు భూసేకరణ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నిధులనూ సర్దుబాటు చేయలేకపోయింది. దీనివల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.437.42 కోట్లకు పెరిగింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.38.42 కోట్ల భారం పడిందని కాగ్ తేల్చిచెప్పింది. రాయలసీమలో 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలన్న లక్ష్యంతో రూ.6,850 కోట్ల వ్యయంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు పనులకు మార్చి 31, 2013 నాటికి రూ.6188.79 కోట్లను ఖర్చు చేశారు. నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది. ప్రభుత్వ ఖజానాపై రూ.3,615 కోట్ల భారం పడిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గాలేరు-నగరి ప్రాజెక్టు కింద కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల పరిధిలో 3.25 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2005లో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,777.94 కోట్లు. మార్చి 31, 2013 నాటికి రూ.4,135.62 కోట్లను ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడంతో పనులు సాగ డం లేదు. దీని వల్ల అంచనా వ్యయం పెరిగి.. ప్ర భుత్వ ఖజానాపై రూ.5,143.21 కోట్ల భారం పడింది. తెలుగుగంగ ప్రాజెక్టు కింద చెన్నై నగరానికి తాగునీరు అందించాలని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 1.40 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 1983లో ఆ ప్రాజెక్టును చేపట్టినప్పు డు అంచనా వ్యయం రూ.637 కోట్లు. కానీ.. ఆ ప్రాజెక్టుకు నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల పనులు సా..గుతూ వస్తున్నాయి. దీ నివల్ల అంచనా వ్యయం రూ.4,432 కోట్లకు పెరి గింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.3,795 కో ట్ల భారం పడినట్లయిందని కాగ్ స్పష్టీకరించింది. ఈ తాగునీటి ప్రాజెక్టుకు సక్రమంగా నిధులు కేటాయించాలని పేర్కొంది. సంక్షేమం కాదు.. సంక్షామమే! రైతులకు 2011 నుంచి రూ.లక్ష వరకూ వడ్డీ లేని రు ణాలు.. రూ.3 లక్షల వరకూ పావలా వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తింపజేస్తామని మెలిక పెట్టింది. కానీ.. జిల్లాలో సకాలంలో చెల్లించిన రైతులకు రూ.14 కోట్లకు పైగా వడ్డీ రాయితీని చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని కాగ్ ఎత్తిచూపింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకూ వడ్డీ రాయితీని అందించడంలో ప్రభుత్వం దాటవేత వైఖరి అనుసరిస్తోందని పేర్కొంది. మార్చి 31, 2013 నాటికి మహిళా సంఘాలకు రూ.21 కోట్ల మేర వడ్డీ రాయితీని చెల్లించక పోవడాన్ని ఎత్తిచూపింది. ఇందిరమ్మ గృహనిర్మాణంలోనూ ప్రభుత్వం తీరును తప్పుపట్టింది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారని ఆరోపించింది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.28 కోట్లు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చింది. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమానికి కేటాయించిన నిధుల వినియోగంలోనూ ప్రభుత్వం పిసినారితనాన్ని ప్రదర్శించిందని పేర్కొంది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంలోనూ.. ఇందిర జలప్రభ కింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలోనూ ప్రభుత్వం కాడిదించడాన్ని కాగ్ ఆక్షేపించింది. తుడా, స్విమ్స్లకు చీవాట్లు తిరుపతి పట్టాణాభివృద్ధి సంస్థ(తుడా), శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్)కూ కాగ్ చీవాట్లు పెట్టింది. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి మాత్రమే తుడా ఆడిటింగ్ పూర్తి చేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నివేదికను తుడా అందించలేదని కాగ్ పేర్కొంది. తుడా నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయాలను లీజుకు ఇవ్వకపోవడం వల్ల సంస్థకు భారీ ఎత్తున నష్టం వస్తోందని తేల్చింది. స్విమ్స్‌నూ కాగ్ కడిగేసింది. నిధుల వినియోగంలో స్విమ్స్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిటింగ్‌ను చేయించడంలో స్విమ్స్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టింది. ఆడిట్ నివేదికను ఇప్పటిదాకా అందించలేదంది. ఎప్పటికప్పుడు ఆడిట్ చేయించి.. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆ సంస్థకు సూచించింది. -
సాగు జాగు !
అరకొరగా నీటి విడుదల గత ఏడాది ఆగస్టు 10 నాటికి 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు ఈ ఏడాది 82 వేల ఎకరాల్లోనే.. మచిలీపట్నం : కృష్ణాడెల్టా రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న నీటి ప్రాజెక్టులు నిండినా దిగువకు అరకొరగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా బ్యారేజీ నుంచి 6300 క్యూసెక్కులు విడుదల చేశారు. రోజుకు 16 వేలకు పైగా క్యూసెక్కులు విడుదల చేస్తేనే శివారు ప్రాంతాలకు సాగునీరందే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద బుధవారం నాటికి 9.2 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఇది 12 అడుగులకు చేరితేనే పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ ఈఈ గంగయ్య చెప్పారు. బుధవారం రైవస్ కాలువకు 3003 క్యూసెక్కులు, బందరు కాలువకు 1011, ఏలూరు కాలువకు 1021, కేఈబీ కాలువకు 1008 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అరకొరగా నీటిని విడుదల చేయడంతో రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా తగ్గడంతో పూర్తిస్థాయిలో సాగునీటిని కాలువలకు విడుదల చేసేందుకు మరికొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వరినాట్లు పూర్తయ్యేదెప్పటికో.. గత ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి జిల్లాలో 4.43 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది కేవలం 82 వేల ఎకరాల్లో మాత్రమే వరినాట్లు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు, మిగిలిన 5.52 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉంది. ఆగస్టు ఆశించిన మేర వర్షం కురవలేదు. కాలువలకు నీరు విడుదల కాలేదు. జిల్లాలోని పలు మండలాల్లో 22,500 ఎకరాల్లో వేసిన వరి నారుమళ్లు నీరందక ఎదుగుదల లోపించి చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అరకొరగా నీటిని విడుదల చేస్తుండటంతో శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో చేరడానికి మరో నాలుగు రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు. శివారు ప్రాంతాలకు నీరందించేందుకు కాలువల వెంటే తిరుగుతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అంటున్నారు. పశ్చిమకృష్ణాలో ప్రత్యామ్నాయం వైపు దృష్టి... ఆగస్టు 15 నాటికి వరినాట్లు పూరి కాకుంటే 120 రోజుల వ్యవధిలో కోతకు వచ్చే 1010, 1001 వరి వంగడాలను రైతులు సాగు చేయాల్సిందేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. బీపీటీ 5204 వరి వంగడం 145 రోజులకు కోతకు వస్తుందని, సెప్టెంబరులో వరినాట్లు వేయాల్సి వస్తే ఈ రకం సాగు చేసేందుకు సమయం చాలదని అంటున్నారు. డెల్టా ప్రాంతంలో వరి పంటకు ప్రత్యామ్నాయం లేదని, తక్కువ వ్యవధిలో కోతకు వచ్చే వంగడాలనే సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమకృష్ణా ప్రాంతంలోని తిరువూరు, నూజివీడు, కంచికచర్ల, గంపలగూడెం, బాపులపాడు మండలాల్లో వరికి బదులుగా మొక్కజొన్న సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 1.40 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరగాల్సి ఉండగా వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో ఇంకా విత్తడం పూర్తికాలేదని అధికారులు చెబుతున్నారు. నూజివీడు తదితర ప్రాంతాల్లో వేరుశనగ సాగు ఇంకా ప్రారంభం కాలేదని సెప్టెంబరులో ఈ సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారుల అంచనాగా ఉంది. జూన్ నెల ఒకటో తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి ఆగస్టు 12 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 371.3 మిల్లీమీటర్లు. కురిసిన వర్షపాతం 260.0 మి.మీ. జూలై నెలాఖరు నాటికి 308 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా 246.4 మి.మీ. మాత్రమే కురిసింది. 15 రోజులుగా ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో నారుమళ్లు ఎండుతున్నాయి. -
'పూడికతీతతో ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దు'
హైదరాబాద్:తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పురోగతిపై సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ అంశానికి సంబంధించి తాగునీటి శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ భేటీలో గొలుసుకట్టు చెరువుల పునరుద్దరణ చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. కాగా, ఆక్రమణలకు గురైన చెరువులను కూడా తిరిగి పునరుద్దరణ కార్యాచరణను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. పూడికతీత పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దని హరీష్ రావు అధికారులకు హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం ' సాక్షి' తో మాట్లాడిన హరీష్ రావు.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వాటా తేలాల్సి ఉందన్నారు. నదీ జలాల వాటాపై సాధ్యమైనంత త్వరలో పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. ఆ తరువాతే ప్రాజెక్టులపై ఆలోచిస్తామన్నారు. -
జలయజ్ఞానికి అబద్ధాల అడ్డుకట్ట!
తెలంగాణ ప్రాజెక్టుల సాధనకు ఏ రోజూ పాటుపడకుండా, కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు. రాజకీయాలు ఇంత అధఃపాతాళానికి చేరాయా? అనిపించేటట్టు నేటి నాయకుల ప్రవర్తన ఉన్నది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన హంద్రీ-నీవా, గాలేరు నగరి, వెలిగొండ తదితర ప్రాజెక్టులన్నీ అక్రమంగా నిర్మిస్తున్నవని, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ అవసరాలకు చేపట్టిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వకుర్తి భీమా తదితర ప్రాజెక్టులు అవసరాలు తీరిన తరువాతనే నీటి విడుదల ఉంటుందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దారుణం. ఒక పాలకుడి దార్శనికతకు, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఒక నేత నిబద్ధతకు తాగునీరు, సాగునీరు పథకాలు అద్ధం పడతాయి. 1972లో ఇరిగేషన్ కమిషన్ గుర్తించిన ‘నిరంతర కరువుపీడిత ప్రాంతాల’ అవసరాలు తీర్చడానికి ప్రయత్నించి, పరిణత నేతగా నిలిచిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని మెట్ట ప్రాంతాలకు కృష్ణా జలాలు అందించాలని అన్ని పార్టీలూ ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో నల్లగొండ మహబూబ్‌నగర్ జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ తప్పిదాన్ని సవరించడానికి డాక్టర్ వైఎస్ జల‘యజ్ఞం’తో ప్రయత్నించారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే కోయిల్‌సాగర్ స్టేజ్-1, స్టేజ్-2, నెట్టెంపాడు, కల్వకుర్తి బీమా పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయన తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి పోతిరెడ్డిపాడు, రాయలసీమలోని ఇతర ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని ఎవరైనా నిరూపించగలరా? తెలంగాణ ప్రాజెక్టుల ప్రాధాన్యతలను గుర్తించకుండా, వాటి సాధనకు ఏ రోజూ పాటుపడకుండా కేవలం ఒక అబద్ధాన్ని వందసార్లు వల్లిస్తే అదే నిజం అవుతుందని నమ్మే కేసీఆర్ తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, తెలంగాణ నీటిని రాయలసీమకు అక్రమంగా తరలిస్తున్నారని విష ప్రచారం చేశారు. జలయజ్ఞం రాష్ట్రంలో అమలు పరచగలిగితే కోస్తాలో 88 శాతం, తెలంగాణలో 60 శాతం, రాయలసీమలో 32 శాతం సేద్యపునీటి వనరులు అందుబాటులోకి వస్తాయి. జలయజ్ఞం ప్రాజెక్టులను విశ్లేషిస్తే ఇది సులభంగానే అర్థమవుతుంది. ఈ వ్యయాలలో ప్రాంతీయ వివక్ష ఉందా? వైఎస్ జలయజ్ఞంలో చేపట్టిన పోలవరం, దుమ్ముగూడెం, నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్, ప్రాణహిత- చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, దేవాదుల, యల్లంపల్లిలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని వైఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీటిలో రాయలసీమ ప్రాజెక్టులు లేకపోవడం గమనార్హం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ద్వారానే జలవనరులను అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చడానికి ఉపయోగించుకునేఅవకాశం ఉందని వైఎస్ కుమారుడు జగన్ చెబుతూనే ఉన్నారు. కానీ పర్యవసానాల గురించి ఆలోచించకుండా జగన్మోహన్రెడ్డినీ, వైఎస్సార్సీపీనీ నిలువరించడానికి రాష్ట్రాన్ని విభజించారు. సీమాంధ్రులకు ఏ విధమైన హామీలూ హక్కులూ దక్కకుండానే విభజన ప్రక్రియ ఊపందుకుంటున్నది. రెచ్చగొట్టే ప్రకటనలతో ఒక ప్రాంతాన్ని దిగజార్చి మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లింది. కేసీఆర్ స్థానం ఎక్కడో 2009లో వైఎస్ చూపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచి నిలబెట్టింది. కిరణ్‌కుమార్‌రెడ్డి అవకాశవాద పద్ధతుల్లో విభజనకు కేంద్రానికీ, సోనియాకూ సహాయం అందించారు. వీళ్లంతా సీమాంధ్రకే కాదు తెలంగాణకు కూడా తీవ్రమైన ద్రోహం చేశారు. ప్రత్యామ్నాయాలు సూచించక, ఏర్పడబోయే పరిణామాలు ఆలోచించకుండా రాష్ట్రాన్ని విడగొట్టారు. కేసీఆర్ రాజకీయ ఉన్మాదంతో చేస్తున్న వ్యాఖ్యలకు వీరే బాధ్యత వహించాలి. జలయజ్ఞంలో గత ఐదేళ్లలో వివిధ ప్రాంతాలకు చేసిన వ్యయం(రూ. కోట్లలో) ప్రాంతం పాలనాపరమైన మంజూరు చేసిన వ్యయం ఆంధ్రా 45,375.98 13,575.35 రాయలసీమ 24,394.81 14,300.69 తెలంగాణ 1,10,120.95 25,330.25 సందర్భం: ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ సంపాదకుడు) -
సీఎంపై హరీష్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు బదిలీ
-
సీఎంపై హరీష్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు బదిలీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు దాఖలు చేసిన పిటీషన్‌ను రాష్ట్ర హైకోర్టు శుక్రవారం డివిజన్ బెంచ్‌కు బదిలీ చేసింది. చిత్తూరు జిల్లాకు సాగునీటి పథకం పేరిట మూడు వందల కోట్లు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హరీష్ రావు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. హరీష్‌రావు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.... పిటిషన్లో ప్రజా ప్రయోజనాలున్నాయని ఉన్నాయని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకు తాగునీటి పథకం కోసం రూ.4,300 కోట్లు కేటాయించడం చట్ట విరుద్ధమని హరీష్ రావు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రభుత్వం, సిఎంతో పాటు మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. సుమారు రూ.7390 కోట్ల అంచనా వ్యయంతో చిత్తూరు జిల్లా త్రాగునీటి సరఫరా పథకం అమలుకు జారీ చేసిన జిఓలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. విభజన ప్రక్రియ కొనసాగుతుండగా రాష్ట్ర మంత్రివర్గం ప్రాంతాల వారీగా చీలిపోయిన నేపథ్యంలో శాసనసభ నుంచి గానీ, రాష్ట్ర మంత్రివర్గం నుంచి గానీ ఆమోదం పొందకుండా నిధులు విడుదల చేసే అధికారం ముఖ్యమంత్రికి లేదని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్‌పై వచ్చే సోమవారం పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. -
ఉగ్రరూపం
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాలకు జిల్లాలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడి పొలాలు, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపడటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు కన్నీటిపాలవుతున్నారు. వరాహ నది కూడా అదే దారిన భయపెడుతోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా జల ప్రాజెక్టులకు సంబంధించి 76 చోట్ల గండ్లు పడ్డాయి. జలాశయాలు ప్రమాదస్థాయికి చేరాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి పడడంతో శనివారం ఒక్క రోజే తాండవ రిజర్వాయర్‌లో ఏడు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధికారులు రాత్రి ఏడు గంటల సమయంలో రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జిల్లాలోని నాతవరం, పాయకరావుపేటలతోపాటు తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలవారిని అధికారులు అప్రమత్తం చేశారు. అలాగే చోడవరం, మాడుగుల ప్రాంతంలోని కల్యాణపులోవ రిజర్వాయర్ మినహా రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉండటంతో గేట్లు ద్వారా అదనపునీటిని దిగువ నదుల్లోకి వదిలేస్తున్నారు.ఎగువ ప్రాంతంనుంచి వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జలాశయాల్లోకి చేరడంతో అన్నీ నిండుకులా ఉన్నాయి. రైవాడ సాధారణ నీటిమట్టం 114మీటర్లు. ప్రస్తుతం 113.75మీటర్లకు చేరింది. దీంతో ఈ జలాశయం నుంచి 4500క్యూసెక్యుల నీటిని విడిచిపెట్టడంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. తీరప్రాంత గ్రామాల్లోకి ఉప్పొంగుతోంది. కోనాం సాధారణ నీటిమట్టం 101మీటర్లు. ప్రస్తుతం 100.25మీటర్లకు చేరింది. దీని నుంచి 900క్యూసెక్యుల నీటిని బొడ్డేరు నదిలోకి వదులుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని రిజర్వాయర్లదీ ఇదే పరిస్థితి. జోలాపుట్టులోకి భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్ లోకి ఉపనదుల ద్వారా వరద నీరు చేరుతోంది. డుడుమలోనూ నీరు ప్రమాదస్థాయిలోనే ఉంది. బలిమెల రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 1516 అడుగులు. ప్రస్తుతం 1515కి చేరుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిలకడగా ఉంది. -
కురిసే ప్రతి చుక్కా సముద్రంలోకే!
ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం... భారీగా నీరు వృథా సాక్షి, హైదరాబాద్: కనీసం గొంతు తడుపుకోవడానికీ చుక్కనీరు దొరకని కరువు పరిస్థితులను రాష్ట్రం ఎన్నోసార్లు చవిచూసింది. రాష్ట్రంలో ఎప్పుడోగానీ విస్తృతంగా వర్షాలు కురిసి, ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవు. అలాంటిది ఈసారి రాష్ట్రంతో పాటు ఎగువప్రాంతాల్లోనూ వర్షాలు విస్తారంగా కురిసి, ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి పొంగి పొర్లాయి. ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వేలాది టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతోంది. అంతేకాదు.. ఇక నుంచి కురిసే ప్రతీ వర్షపు చుక్కా సముద్రం పాలు కానుంది. మరోవైపు రాష్ట్రంలో భారీ సంఖ్యలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయి. వాటిని పూర్తిచేసి ఉంటే.. ప్రస్తుతం వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అసలే గత మూడేళ్లుగా నదుల్లో నీరులేక ప్రాజెక్టులు ఖాళీగా ఉన్నాయి. అదే కొనసాగి ఉంటే.. కరువు పరిస్థితులు నెలకొనేవే. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం గుణపాఠం రావడం లేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే దాదాపు 800 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉండేది. తద్వారా సాగుకు, తాగునీటికి కావలసిన నీరు అందుబాటులో ఉండి ప్రజలకు ఎంతో మేలు జరిగేది. వృథాగా వేలాది టీఎంసీల నీరు.. ఈ ఏడాది రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో.. ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాలపై ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. కృష్ణానదిపై కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ నుంచి రాష్ట్రంలోని జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్ వంటి ప్రాజెక్టులు కూడా వర్షాకాలం మొదట్లోనే నిండాయి. దాంతో గోదావరి నది నుంచి గత జూలై నుంచి ఇప్పటివరకు దాదాపు 5,145 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. అలాగే కృష్ణానది నుంచి కూడా.. 238 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలయింది. చివరిదశలోనే నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలు.. ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్లలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో కొన్నింటి నిర్మాణాలు చివరి దశలో ఉండగా.. మరికొన్ని సగానికిపైగా పూర్తయ్యాయి. ఒకటి రెండు ప్రాజెక్టుల పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు. అయితే, నిర్మాణం చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తే.. సుమారు 800 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని, వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ అద్భుత అవకాశాన్ని చేజేతులా జారవిడుస్తోంది. ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కృష్ణానదిపై చేపట్టిన వాటిలో నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, కల్వకుర్తి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఏఎమ్మార్పీ, పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణాలు నాలుగేళ్ల కిందే దాదాపు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి. కానీ, రాష్ట్ర సర్కారు గత నాలుగేళ్లుగా వీటిని పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి, చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయి ఉండేవి. సుమారు 300 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండేది. అలాగే గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎస్సారెస్పీ-2, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి, రుద్రమకోట వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. ఈ నాలుగేళ్ల సమయంలో వీటితో పాటు పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల వంటి ప్రాజెక్టులు కూడా పూర్తయి ఉండేవి. వీటిద్వారా గోదావరి నదిలో వృథా అవుతున్న నీటి నుంచి సుమారు 500 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది.