- బీఏసీలో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్
- రీడిజైనింగ్‌పై అన్ని పార్టీలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, మహారాష్ట్రతో ఒప్పందం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి శాసన సభను వేదిక చేసుకునేందు కు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించొద్దని భావిస్తోం ది. ఈ నెల 31న సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇస్తామని ఆదివా రం బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తరఫున హాజరైన భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి వ్యతిరేకించారు.
తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలన్న డిజైన్‌ను మార్చే ముందు పార్టీలన్నింటితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీరివ్వాలనే డిజైన్‌ను ఎందుకు మార్చారన్నా రు. ప్రాణహిత ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించ డం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నారు. మేడిగడ్డ వద్ద రిజర్వాయరు నిర్మాణం వల్ల ఎత్తిపోతల అంచనా వ్యయం, నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుందన్నారు. దీంతో ప్రజలు, రైతులపై భారం పెరుగుతుందన్నారు. రీడిజైన్‌తోపాటు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత అన్నీ సక్రమంగా చేసినట్టుగా చెప్పుకుంటామంటే, చూస్తూ కూర్చోవడం ప్రతిపక్షాల పని కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు.
తమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఒనగూరే ప్రయోజనం, ఇప్పటిదాకా జరిగిన పనులు, రీడిజైన్‌తో నష్టం, అవినీతి వంటి వాటిపై మాట్లాడటానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలన్నారు. అయితే దీనిపై ఎటూ తేలకపోవడంతో నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేశారు. ఒకవేళ ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. అధికార పక్షం అవినీతిని ఎండగట్టడానికి అదే అసెంబ్లీని వేదిక చేసుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. దీనిపై పూర్తి సమాచారంతో మాట్లాడేందుకు ముగ్గురు సభ్యులు అధ్యయనం చేస్తున్నారు.
అసెంబ్లీలో ప్రజెంటేషన్ వద్దు: కాంగ్రెస్
Published Mon, Mar 28 2016 2:31 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement