Opposes
-
బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
సాక్షి, ముంబై: బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. మూడు ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. యూఎప్‌బీయూలోని అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొంటాయని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్వని రాణా పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం తెలిపాయి. కాగా మూడు (బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంక్) ప్రభుత్వ బ్యాంకుల విలీనమైతే దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భవించనుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో ఉన్నసంగతి తెలిసిందే. -
దివీస్‌కు వ్యతిరేకంగా మహిళల పోరుబాటు
-
అసెంబ్లీలో ప్రజెంటేషన్ వద్దు: కాంగ్రెస్
- బీఏసీలో ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్ - రీడిజైనింగ్‌పై అన్ని పార్టీలతో ఎందుకు చర్చించలేదని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, మహారాష్ట్రతో ఒప్పందం వంటి అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అధికార పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి శాసన సభను వేదిక చేసుకునేందు కు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించొద్దని భావిస్తోం ది. ఈ నెల 31న సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇస్తామని ఆదివా రం బీఏసీ సమావేశంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తరఫున హాజరైన భట్టివిక్రమార్క, జి.చిన్నారెడ్డి వ్యతిరేకించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించాలన్న డిజైన్‌ను మార్చే ముందు పార్టీలన్నింటితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీరివ్వాలనే డిజైన్‌ను ఎందుకు మార్చారన్నా రు. ప్రాణహిత ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించ డం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నారు. మేడిగడ్డ వద్ద రిజర్వాయరు నిర్మాణం వల్ల ఎత్తిపోతల అంచనా వ్యయం, నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతుందన్నారు. దీంతో ప్రజలు, రైతులపై భారం పెరుగుతుందన్నారు. రీడిజైన్‌తోపాటు టెండర్ల ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత అన్నీ సక్రమంగా చేసినట్టుగా చెప్పుకుంటామంటే, చూస్తూ కూర్చోవడం ప్రతిపక్షాల పని కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదించారు. తమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఒనగూరే ప్రయోజనం, ఇప్పటిదాకా జరిగిన పనులు, రీడిజైన్‌తో నష్టం, అవినీతి వంటి వాటిపై మాట్లాడటానికి ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలన్నారు. అయితే దీనిపై ఎటూ తేలకపోవడంతో నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేశారు. ఒకవేళ ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. అధికార పక్షం అవినీతిని ఎండగట్టడానికి అదే అసెంబ్లీని వేదిక చేసుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ ఉంది. దీనిపై పూర్తి సమాచారంతో మాట్లాడేందుకు ముగ్గురు సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. -
‘రియల్’ బిల్లుకు చిక్కులు
నేడు రాజ్యసభ ముందుకు బిల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ న్యూఢిల్లీ: స్థిరాస్తి వ్యాపారాన్ని నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు రాజ్యసభలో చిక్కులు ఎదురుకానున్నాయి. మంగళవారం పెద్దల సభలో చర్చకు రానున్న ఈ బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తన వ్యతిరేకతను ఉధృతం చేసింది. వాస్తవానికి గత బుధవారమే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు తలచినప్పటికీ.. బిల్లును పార్లమెంటు ఎంపిక కమిటీకి నివేదించాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో.. ఎగువ సభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న సర్కారు బిల్లును వాయిదా వేసుకుంది. ప్రతిపక్షం ఎదురుదాడి చేయటంతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. పార్టీలతో మరిన్ని సంప్రదింపులు జరపటానికి బిల్లును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి మరింత కఠినంగా మారింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గత శనివారం నాడు జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్సీఆర్) చెందిన ఇళ్ల కొనుగోలుదారులను కలిసిన తర్వాత.. ప్రభుత్వం మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బిల్లును బిల్డర్లకు అనుకూలంగా మార్చి తెస్తోందని ధ్వజమెత్తారు. ఫ్లాట్ యజమానుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని వారి ప్రతినిధులకు రాహుల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూపీఏ హయాంలో తెచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు, ఎన్డీఏ తెచ్చిన ప్రస్తుత బిల్లుకు తేడాలను విడమరచి చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ప్రభుత్వం బిల్లును ఆమోదింపచేసుకునేందుకు పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు, ప్రోత్సహించేందుకు, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. జీఎస్టీ బిల్లుకు తృణమూల్ మద్దతు వస్తువులు, సేవల పన్నుల (జీఎస్టీ) బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కీలక ఆర్థిక సంస్కరణ లక్ష్యంగా తెస్తున్న ఈ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకు రానుంది. గత నెల 26న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దానిని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలని కాంగ్రెస్, బీజేడీ, వామపక్షాలు సహా పలు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పట్టుపట్టాయి. ఈ పరిస్థితుల్లో.. తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు మద్దతు తెలపటం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్లయింది. ‘‘స్థాయీ సంఘం, ఎంపిక కమిటీలు ఈ బిల్లుపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, దీనిని మళ్లీ స్థాయీ సంఘానికి తిప్పిపంపటంలో అర్థం లేదు’’ అని తృణమూల్ నేత డెరెక్ ఒ-బ్రీన్ సోమవారం పీటీఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయే మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. -
స్కూళ్ల మూసివేతను అడ్డుకుంటాం
ఉచిత నిర్బంధ విద్య ఏమైందని ప్రశ్న హైదరాబాద్: పేదలకు ఉచితవిద్యను అందకుండా స్కూళ్ల మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకుంటామని బీజేపీ శాసనసభ పక్షనాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. అసెంబ్లీలోని కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో 4500 స్కూళ్లను మూసివేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. దీనివల్ల 15వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం ఉంటుందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతీ మండలంలో ఒక రెసిడెన్షియల్‌ను ఏర్పాటుచేసి కేజీ టు పీజీదాకా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఉచిత నిర్బంధ విద్యను అందించకపోగా ఉన్న స్కూళ్లను మూసేయడం దారుణమని లక్ష్మణ్ విమర్శించారు. లంబాడీ తాండాలు, గిరిజన గూడాలు, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న పేదలకు విద్యను అందకుండా చేసే కుట్ర దీనిలో దాగి ఉందని విమర్శించారు. ఉచిత నిర్బంధ విద్య, బదిలీలు, పదోన్నతులు, ఏకీకృత సర్వీసు రూల్స్ వంటివాటిపై అఖిలపక్ష సమావేశం, శాసనసభాపక్షాలతో సమావేశం నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేవిధంగా రోజుకో కొత్త హామీతో ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెడుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయని హైదరాబాద్‌లో పేదలకు గృహ నిరాణం గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటే కొందరికే పదవులు, అధికారం కాదన్నారు. ప్రజల్లో అసంతృప్తి పెరుగక ముందే కళ్లు తెరవాలని లక్ష్మణ్ సూచించారు. -
రైతు రుణమాఫీకి నేను వ్యతిరేకం
-
'రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు... ప్రమాదకరం'
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. బడ్జెట్లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించిందనేందుకు ఈ బడ్జెట్ మంచి ఉదాహరణ అని తెలిపారు. ప్రతి బడ్జెట్లో దేశంలో ప్రతి ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు అత్యధిక నిధులు కేటాయిస్తారని ఆయన గుర్తు చేశారు. అలాంటి శాఖలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవేశపెట్టడం అత్యంత ప్రమాదకరమని రఘువీరా రెడ్డి హెచ్చరించారు.