హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 878 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 1,71,144 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 54,502 వేల క్యూసెక్కులు ఉంది.
నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 515 అడుగులు ఉంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 11,500 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1350 క్యూసెక్కులు ఉంది. ఇదే జిల్లాలోని కేతెపల్లి మద్ద మూసీ ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు ఉండగా.. ప్రస్తుతం నీరు 642 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 16 వేల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 9 వేల క్యూసెక్కులు ఉంది.
నిజామాబాద్ జిల్లా: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుతం 1395 అడుగులకు నీరు చేసింది. ఇన్ఫ్లో లక్షా 30 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో మాత్రం నిల్.
మహబూబ్నగర్ : జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 11 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 అడుగులు ఉండగా... ప్రస్తుతం 318.280 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 2 లక్షల 5 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 2 లక్షల 5, 515 క్యూసెక్కులు ఉంది.
కరీంనగర్ జిల్లా: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 14 గేట్లు ఎత్తివేసి.. లక్షా 34 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 3 లక్షల, ఔట్ ఫ్లో 34 వేల క్యూసెక్కులు ఉంది.
ఆదిలాబాద్ జిల్లా : కొమరం భీం ప్రాజెక్టులోని మూడు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ఫ్లో 7500, ఔట్ ఫ్లో 75600 క్యూసెక్కులు ఉంది.
మెదక్ జిల్లా : సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు తగ్గింది. పూర్తిస్థాయి నీటిమట్టం 29.99 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 26.5 టీఎంసీలు ఉంది. ఇన్ఫ్లో 90 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 60 వేల క్యూసెక్కులు ఉంది.
ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు
Published Sun, Sep 25 2016 9:54 AM | Last Updated on Wed, Aug 1 2018 4:01 PM