తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి వాటికి అనుసంధానంగా అవసరమైన చోటల్లా చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చెప్పారు.
తాండూరు (రంగారెడ్డి జిల్లా): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యేనాటికి వాటికి అనుసంధానంగా అవసరమైన చోటల్లా చెక్‌డ్యాముల నిర్మాణం పూర్తి చేస్తామని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలోని చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రగతిని శనివారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో వాగులు, వంకలు ఎక్కడున్నాయో అక్కడంతా సర్వేచేసి వీలైనన్ని ఎక్కువ చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల అంగీకారంతోనే భూసేకరణ ప్రక్రియ కొసనాగిస్తున్నామని, భూసేకరణ ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిస్తామని వివరించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నేతలు హరీశ్వర్‌రెడ్డి, గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.