న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగా వాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. యర్లుంగ్ త్సంగ్ బో(బ్రహ్మపుత్ర) నదిపై 60 గిగావాట్ల భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు చైనా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. చైనా ప్రాజెక్టుల కారణంగా భారత్‌లో అకస్మాత్తుగా వరదలు రావడం, నీటి కొరత ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం.
చైనా నీటి ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని జల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా అన్నారు. తమ ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. ఇది కార్యరూపం దాల్చితే చైనా డ్యామ్‌ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భారీగా నీటి నిల్వకు వీలుంటుందన్నారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు నదీ జల వివాదాలు కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
బ్రహ్మపుత్రపై భారత్ రిజర్వాయర్
Published Wed, Dec 2 2020 4:44 AM | Last Updated on Wed, Dec 2 2020 5:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment