టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి | cm kcr speaks over palamuru district water projects | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి

Published Thu, Apr 21 2016 4:43 PM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

cm kcr speaks over palamuru district water projects

హైదరాబాద్: మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాములు గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, ఆయన అనుచరులను సీఎం కేసీఆర్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. రాములుతోపాటు అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement