'ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం'
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు.
ఇతర రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నామని, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న రోజును బ్లాక్ డేగా వర్ణించిన కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడవద్దని, బాధ్యతగా మాట్లాడాలని చెప్పారు. 2018 కల్లా మిషన్ భగీరథను పూర్తి చేసి.. నియోజకవర్గానికి లక్ష ఎకరాల చొప్పున కోటి ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే...
► కేజీ టు పీజీ తప్ప అన్ని హామీలు అమలు చేశాం
► ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నాం
► టెక్స్టైల్ హబ్గా వరంగల్
► వచ్చే ఎన్నికల్లో తండాలను పంచాయతీలుగా మార్పు
► 16 శాతం కరెంటు వినియోగం పెరిగినా ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా
► మిషన్ భగీరథ పూర్తి అయితే ఓట్లు పడవని కాంగ్రెస్కు భయం
► ఈ ఏడాది డిసెంబర్ నాటికి 6,182 గ్రామాలతో పాటు 12 మున్సిపాలిటీల్లో ఇంటింటికి మంచి నీళ్లు
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ కల్యాణలక్ష్మీ పథకం
► తొలిదశలో 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు
► రుణమాఫీ కింద ఈ ఏడాది చెల్లింపుతో 75 శాతం పూర్తి
► ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం అమలుతో రూ. 33 వేల కోట్ల పెట్టుబడులు
► ఐటీ సెక్టార్లో బెంగళూరు తర్వాత స్ధానంలో తెలంగాణ
► త్వరలో హైదరాబాద్కు గూగుల్ క్యాంపస్ నిర్మాణంతో పాటు కాగ్నిజెంట్, అమెజాన్
► ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేం ఎప్పుడూ చెప్పలేదు..లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాత్రమే చెప్పాం
► లక్ష ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతాం ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.